తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Vande Bharat Express: తిరుపతి సికింద్రాబాద్ మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్

Vande Bharat Express: తిరుపతి సికింద్రాబాద్ మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్

HT Telugu Desk HT Telugu

25 March 2023, 7:24 IST

  • Vande Bharat Express: తిరుపతి సికింద్రాబాద్ మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రవేశపెట్టేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతోంది.

త్వరలో తిరుపతి సికింద్రాబాద్ మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్
త్వరలో తిరుపతి సికింద్రాబాద్ మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (HT_PRINT)

త్వరలో తిరుపతి సికింద్రాబాద్ మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్

Vande Bharat Express: తిరుపతి సికింద్రాబాద్ మధ్య వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రవేశపెట్టేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. వచ్చే నెల రెండో వారంలోనే ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ విజయవంతంగా నడుస్తోంది. సికింద్రాబాద్-తిరుపతి మధ్య ఉన్న రద్దీ దృష్ట్యా ఈ మార్గంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రవేశపెట్టనుంది. వారంలో 6 రోజులు ఈ ట్రైన్ నడిచేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

ట్రెండింగ్ వార్తలు

CM Revanth Reddy : తెలంగాణలో భూముల మార్కెట్ విలువ సవరణ…! కీలక ఆదేశాలు జారీ

TS LAWCET 2024 Updates : టీఎస్ లాసెట్ కు భారీగా దరఖాస్తులు - ఈ సారి 3 సెష‌న్ల‌లో ఎగ్జామ్, ఫైన్ తో అప్లికేషన్లకు ఛాన్స్

TSRTC Jeevan Reddy Mall : అద్దె ఒప్పందం రద్దు , జీవన్ రెడ్డి మాల్ స్వాధీనం - టీఎస్ఆర్టీసీ ప్రకటన

Telangana Rains : కరీంనగర్ జిల్లాలో గాలివాన బీభత్సం - పిడుగుపాటుతో ఇద్దరు మృతి

ప్రస్తుతం పద్మావతి, నారాయణాద్రి, వెంకట్రాది తదితర ఎక్స్‌ప్రెస్ సర్వీసులు తిరుపతికి భక్తులను చేరవేస్తున్నాయి. కానీ వీటిలో టికెట్ కోసం కనీసం ఒక నెల ముందు బుక్ చేసుకోవాల్సి వస్తోంది. లేదంటే వెయిటింగ్ లిస్ట్ చాంతాడంత ఉంటోంది. వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రాకతో ప్రయాణికులకు ఈవిషయంలో సౌకర్యవంతంగా ఉండే అవకాశం ఉంది.

కాగా ఏప్రిల్ 14న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈశాన్య భారతానికి తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభించనున్నారు. గౌహతి, న్యూజల్‌పాయిగురి మధ్య ఈ వందేభారత్ ఎక్స్‌ప్రెస్ నడవనుంది.

టాపిక్

తదుపరి వ్యాసం