తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Indian Students Drown : ఈతకు వెళ్లి ఇద్దరు తెలంగాణ విద్యార్ధుల దుర్మరణం

Indian students drown : ఈతకు వెళ్లి ఇద్దరు తెలంగాణ విద్యార్ధుల దుర్మరణం

HT Telugu Desk HT Telugu

29 November 2022, 9:23 IST

  • Indian students drown అమెరికాలోని మిస్సోరీ రాష్ట్రంలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు తెలంగాణ విద్యార్ధులు మృతి చెందారు. శనివారం సాయంత్రం జరిగిన ప్రమాదంలో  ఒకరి మృతదేహం వెంటనే లభించినా మరొకరి మృతదేహం ఆదివారం లభించింది. మృతదేహాలను స్వదేశానికి రప్పించేందుకు సాయం  చేయాలని కోరడంతో మంత్రి కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. 

అమెరికాలో తెలంగాణ విద్యార్ధుల నీట మునక
అమెరికాలో తెలంగాణ విద్యార్ధుల నీట మునక (HT_PRINT)

అమెరికాలో తెలంగాణ విద్యార్ధుల నీట మునక

Indian students drown అమెరికాలో జరిగిన ఘోర ప్రమాదంలో ఇద్దరు తెలంగాన విద్యార్ధులు నీట మునిగి చనిపోయారు. థాంక్స్ గివింగ్ వారాంతంలో అమెరికాలోని మిస్సౌరీ రాష్ట్రంలోని ఓజార్క్స్ సరస్సులో ఈతకు వెళ్లిన తెలంగాణకు చెందిన ఇద్దరు భారతీయ విద్యార్థులు మునిగి మరణించారు. ఈ ఘటన శనివారం సాయంత్రం చోటు చేసుకుంది.

ట్రెండింగ్ వార్తలు

TS SET 2024 Updates : తెలంగాణ సెట్ దరఖాస్తులు ప్రారంభం - ఆగస్టు 28 నుంచి పరీక్షలు

TS Cabinet Expansion : సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో మరో ఆరుగురికి ఛాన్స్, ఎవరెవరికి చోటు దక్కనుంది?

Hyderabad Real Estate Scam: హైదరాబాద్ లో మరో ప్రీ లాంచ్ రియల్ ఎస్టేట్ స్కామ్, రూ.60 కోట్లు వసూలు చేసిన భారతి బిల్డర్స్

Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలు పని వేళల్లో మార్పులు, అధికారుల క్లారిటీ!

మిస్సోరి స్టేట్ హైవే పెట్రోల్ అధికారులు బాధితులను 24 ఏళ్ల కుంట ఉతేజ్ , 25 ఏళ్ల కెల్లిగారి శివగా గుర్తించారు.

తెలంగాణకు చెందిన ఇద్దరు భారతీయులు శనివారం సాయంత్రం మిస్సోరీలోని ఓజార్క్స్ సరస్సులో మునిగి చనిపోయారు. బాధితుల వివరాలు వెంటనే తెలియరాలేదు. తర్వాత జరిగిన విచారణలో వారిని భారతీయ విద్యార్ధులుగా గుర్తించారు. వారాంతపు విహారం కోసం వెళ్లిన వారు ప్రమాదం బారిన పడ్డారు.

తెలంగాణ మంత్రి కెటిఆర్‌ మృత దేహాలను వీలైనంత త్వరగా తిరిగి తీసుకురావడానికి బాధిత కుటుంబాలకు సహాయం చేయాలని తన కార్యాలయ బృందానికి సూచించినట్లు ట్వీట్‌లో తెలిపారు.

శనివారం మధ్యాహ్నం 2:20 గంటలకు మిస్సోరీ సహాయ బృందాలకు కాల్ వచ్చింది. సరస్సులో మునిగి పోయిన ఇద్దరిని గుర్తించడంలో సహాయాన్ని అభ్యర్థిస్తూ మిస్సోరీ స్టేట్ హైవే పెట్రోల్, ట్విట్టర్ పేజీ ఆదివారం ట్వీట్ చేసింది. దాంతో మృతులను వారి మిత్రులు గుర్తించారు.

సరస్సులో ఈతకు వెళ్లిన కుంట ఉత్తేజ్‌ పైకి రాకపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఉత్తేజ్‌ను కాపాడటానికి అతని స్నేహితుడు కెల్లిగారి శివ కూడా సరస్సులోకి దూకాడు, అతను కూడా నీటి నుంచి తిరిగి పైకి రాలేకపోయాడని పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు.

ఘటన జరిగిన రెండు గంటల తర్వాత కుంట ఉత్తేజ్‌ మృతదేహాన్ని రెస్క్యూ సర్వీసెస్ సిబ్బంది శనివారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో వెలికి తీశారు. ఆదివారం తర్వాత కెల్లిగారి శివ మృతదేహాన్ని వెలికి తీశారని పోలీసులు తెలిపారు. పోలీసు రికార్డుల ప్రకారం ఇద్దరూ సంఘటనా స్థలంలోనే మృతి చెందారు.

ఘటన జరిగిన ప్రాంతంలో ఉన్న వారు ప్రమాదాన్ని గుర్తించి కేకలు వేయడంతో సరస్సు నిర్వాహకులు అత్యవసర సేవలకు కాల్ చేసినట్లు చెప్పారు. అక్కడ ఉన్న వారు ఎమర్జెన్సీ సాయం కోసం పోలీసులకు కాల్ చేశారు. లేక్ మేనేజర్‌ సోదరుడు నీటిలో దూకి వారిని రక్షించడానికి ప్రయత్నించినా ఫలితం లేకపోయిందని పోలీసులు చెప్పారు. నీటిలో మునిగిపోతున్న వారి వద్దకు కయాక్ సాయంతో వెళ్లే సమయానికి ఇద్దరు పూర్తిగా నీటిలో ముగిపోయినట్లు ప్రత్యక్షసాక్షులు వివరించారు.

ఇద్దరు విద్యార్ధులు దుర్మరణం పాలవడంతో వారి మిత్రులు మృతదేహాలను స్వదేశానికి తరలించేందుకు తెలంగాణ ప్రభుత్వం ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారు

తదుపరి వ్యాసం