తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tspsc Group 1 Notification 2024 : గుడ్ న్యూస్... 563 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల, ముఖ్య తేదీలివే

TSPSC Group 1 Notification 2024 : గుడ్ న్యూస్... 563 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల, ముఖ్య తేదీలివే

19 February 2024, 19:20 IST

    • TSPSC Group 1 Notification 2024 Updates: కొత్తగా గ్రూప్ -1 నోటిఫికేషన్ ను విడుదల చేసింది టీఎస్పీఎస్సీ. ఇందులో భాగంగా… 563 పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. 
గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల
గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల (https://websitenew.tspsc.gov.in/)

గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల

TSPSC Group 1 Notification 2024 : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి కీలక ప్రకటన వెలువడింది. గత ప్రభుత్వంలో జారీ అయిన గ్రూప్ -1 నోటిఫికేషన్ రద్దు చేసిన కొద్ది సమయంలోనే… కొత్త నోటిఫికేషన్ ను జారీ చేసింది. మొత్తం 563 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఫిబ్రవరి 23వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపింది. మార్చి 14వ తేదీని తుది గడువుగా ప్రకటించారు. వయోపరిమితి 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంచారు.

తెలంగాణ గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల

ముఖ్య తేదీలు:

గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల - ఫిబ్రవరి 19,2024.

ఆన్ లైన్ దరఖాస్తులు ప్రారంభం - ఫిబ్రవరి 23, 2024.

దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు - మార్చి 03,2024.

దరఖాస్తుల సవరణకు అవకాశం - మార్చి 23 నుంచి మార్చి 27,2024.

హాల్ టికెట్లు డౌన్లోడ్ - పరీక్షకు ఏడు రోజుల ముందు నుంచి అందుబాటులోకి వస్తాయి.

ప్రిలిమినరీ పరీక్ష - మే/జూన్ 2024.

మెయిన్స్ పరీక్షలు - సెప్టెంబర్/ అక్టోబరు 2024.

అధికారిక వెబ్ సైట్ - https://www.tspsc.gov.in/      

ఖాళీల వివరాలను కింద ఇచ్చిన పీడీఎఫ్ లో చూడొచ్చు..

అప్లికేషన్ ప్రాసెస్ ఫీజును రూ. 200గా నిర్ణయించారు. ఎగ్జామినేషన్ ఫీజు రూ. 120గా నిర్ణయించారు. అయితే నిరుద్యోగులకు ఈ ఫీజు(ఎగ్జామినేషన్ ఫీజు) నుంచి మినహాయించారు. 33 జిల్లా కేంద్రాల్లో ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించనున్నారు. మెయిన్స్ పరీక్షను గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నిర్వహించనున్నారు.

రద్దు ప్రకటన… ఆపై వెంటనే నోటిఫికేషన్

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2022 ఏప్రిల్‌లో గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. మొత్తం 503 పోస్టులను భర్తీ చేసేందుకు ప్రకటన జారీ అయింది. 2022 అక్టోబరు 16న ప్రిలిమినరీ పరీక్ష జరిగింది. ఆ తర్వాత ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారం వెలుగు చూడటంతో పరీక్షను కమిషన్‌ రద్దు చేసింది. ఆ తర్వాత మరోసారి పరీక్షను నిర్వహించింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఇందులో భాగంగా… 2023 జూన్ 11 రెండోసారి పరీక్షను నిర్వహించారు. 2023 జూన్‌లో నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షకు 2.33 లక్షల మంది ప్రిలిమ్స్‌ పరీక్ష రాశారు. పరీక్ష నిర్వహణలో లోపాలున్నాయని, అభ్యర్థుల బయో మెట్రిక్ తీసుకోలేదని, ప్రిలిమినరీ పరీక్ష రోజున ఇచ్చిన విద్యార్ధుల సంఖ్యకు.. తుది కీ విడుదల సమయంలో ఇచ్చిన హాజరు సంఖ్యకు పొంతన లేదంటూ పలువురు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లను విచారించిన హైకోర్టు న్యాయస్థానం పరీక్ష రద్దు చేసి మరోసారి నిర్వహించాలని తీర్పు ఇచ్చింది. తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ కూడా రద్దు చేయాలని స్పష్టం చేసింది. దీంతో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ న్యాయ నిపుణులతో చర్చించి సుప్రీంకోర్టులో అప్పీలు చేసింది. గతేడాది అక్టోబరు నుంచి విచారణ జరగలేదు.

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌కు ఇప్పటికే కొత్త పాలక మండలి ఏర్పడింది. దీంతో గ్రూప్-1 పరీక్ష నిర్వహణపై క్లారిటీ ఇవ్వాలని ప్రభుత్వం భావించింది. ఇందులో భాగంగా… సుప్రీంలో దాఖలు చేసిన అప్పీలు పిటిషన్ వెనక్కు తీసుకునేందుకు అనుమతివ్వాలని పిటిషన్ వేసింది. తీవ్రమైన జాప్యం, విద్యార్ధుల ఎదురు చూపుల నేపథ్యంలో ఆలస్యం కాకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను వెనక్కి తీసుకున్న నేపథ్యంలో…. గ్రూప్ 1 నోటిఫికేషన్ ను మొత్తం రద్దు చేసింది.

రద్దు చేసిన తర్వాత గంటల వ్యవధిలోనే కొత్త నోటిఫికేషన్ వచ్చేసింది. మొత్తం 563 పోస్టులతో ప్రకటన విడుదలైంది. గతంలో పోల్చితే 60 పోస్టులు ఎక్కువగా ఉన్నాయి.

తదుపరి వ్యాసం