తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tspsc Jobs : టీఎస్‌పీఎస్సీ మరో నోటిఫికేషన్.. అప్లై చేయండి ఇలా

TSPSC Jobs : టీఎస్‌పీఎస్సీ మరో నోటిఫికేషన్.. అప్లై చేయండి ఇలా

Anand Sai HT Telugu

17 August 2022, 22:41 IST

    • తెలంగాణలో డివిజినల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌(DAO) గ్రేడ్‌-2 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్
టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్

టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (TSPSC) మరో ఉద్యోగ నోటిఫికేషన్‌ జారీ చేసింది. డైరెక్టర్‌ ఆఫ్‌ వర్క్స్‌ అకౌంట్స్‌ విభాగంలో 53 డివిజినల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ (DAO) గ్రేడ్‌-2 పోస్టుల భర్తీ చేయనుంది. ఆగ‌స్టు 17 నుంచి సెప్టెంబరు 6వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం www.tspsc.gov.in వెబ్‌సైట్‌ వెళ్లాలి.

ట్రెండింగ్ వార్తలు

BRS Mlc Election Burden: బీఆర్​ఎస్ గ్రాడ్యుయేట్​ ఎమ్మెల్సీ భారమంతా ‘పల్లా’పైనే! సహకరించని గులాబీ​ నేతలు

Warangal Naimnagar Bridge : నయీంనగర్ బ్రిడ్జి పనుల పూర్తికి టైమ్ ఫిక్స్ - జూన్​ 15 డెడ్ లైన్​..!

AP TS Funeral Disputes: తెలుగు రాష్ట్రాల్లో ఆస్తి గొడవలతో ఆగిన అంత్యక్రియలు, ఆస్తుల కోసం అమానవీయ ఘటనలు

TS High Court Jobs 2024 : తెలంగాణ హైకోర్టు నుంచి 150 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ - దరఖాస్తులకు ఇవాళే చివరి తేదీ

డివిజినల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునేవారు.. TSPSC అధికారిక వెబ్ సైట్ లోకి వెళ్లాలి. అక్కడ దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసేందుకు సెప్టెంబర్ 6, 2022 సాయంత్రం 5 గంటల వరకు అవకాశం ఉంది. మొత్తం 53 ఖాళీలను భర్తీ చేస్తున్నారు. .

అప్లై చేసుకునేవారికి కనీస వయోపరిమితి 18 సంవత్సరాలు, గరిష్ట వయోపరిమితి 44 సంవత్సరాలు. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. విద్యార్హతల విషయానికొస్తే, అభ్యర్థులు భారతదేశంలోని గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి లేదా ఏదైనా సమానమైన అర్హతలను కలిగి ఉండాలి. అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు అన్ని కేటగిరీ అభ్యర్థులకు రూ.200గా ఉంది. ఆబ్జెక్టివ్ తరహా రాత పరీక్ష ఉంటుంది. మెరిట్ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. పరీక్షను డిసెంబర్‌లో నిర్వహించనున్నారు.

ఎలా అప్లై చేయాలంటే..

అధికారిక వెబ్‌సైట్ tspsc.gov.inని సందర్శించండి

వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న DAO అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేయండి

మీ లాగిన్ ID మరియు పుట్టిన తేదీని నమోదు చేయండి (రిజిస్టర్ చేయకుంటే పోర్టల్‌లో నమోదు చేసుకోండి)

దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి. పత్రాలను అప్‌లోడ్ చేసి.. రుసుము చెల్లించండి. చివరకు సబ్మిట్ కొట్టాలి.

తదుపరి వ్యాసం