తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Group 2 Exam Postpone : గ్రూప్ 2 పరీక్షపై కమిషన్ తర్జన భర్జన - వాయిదా దిశగా యోచన..?

Group 2 Exam Postpone : గ్రూప్ 2 పరీక్షపై కమిషన్ తర్జన భర్జన - వాయిదా దిశగా యోచన..?

10 August 2023, 13:13 IST

    • TSPSC Latest News: అభ్యర్థుల ఆందోళన నేపథ్యంలో గ్రూప్ 2 పరీక్షపై కమిషన్ తర్జన భర్జన పడుతోంది. వాయిదా వేసే విషయంపై ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.
గ్రూప్ 2 వాయిదా
గ్రూప్ 2 వాయిదా

గ్రూప్ 2 వాయిదా

TSPSC Group 2 Exam Postpone: గ్రూప్ - 2 పరీక్షను వాయిదా వేయాలంటూ అభ్యర్థులు టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. గురువారం పెద్ద ఎత్తున అభ్యర్థులు తరలివచ్చారు. పరీక్షను వాయిదా వేయాల్సిందే అంటూ పట్టుబడుతున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో… పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ - 2 ఎగ్జామ్ నిర్వహణపై తర్జన భర్జన పడుతోంది. అభ్యర్థులు విజ్ఞప్తి మేరకు రెండు లేదా మూడు నెలలు వాయిదా వేయాలా..? వద్దా…? అనే అంశంపై ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.

ట్రెండింగ్ వార్తలు

TS Court Jobs 2024 : తెలంగాణ హైకోర్టు నుంచి మరో ఉద్యోగ నోటిఫికేషన్ - భారీగా వేతనం, ముఖ్య తేదీలివే

Online Job Fraud: ఆన్​ లైన్​ జాబ్​ పేరుతో మోసం, 12 లక్షలు పోగొట్టుకున్న బాధితుడు, వరంగల్‌లో పెరుగుతున్న సైబర్ మోసాలు

TS TET 2024 Hall Tickets : కాసేపట్లో తెలంగాణ టెట్‌ హాల్‌ టికెట్లు విడుదల - ఇలా డౌన్లోడ్ చేసుకోండి

Hyd Brutal Attack: హైదరాబాద్‌లో ఘోరం.. పెంపుడు కుక్క వివాదంతో భార్యాభర్తలపై యువకుల దాడి

గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలని TSPSC అధికారులకు అభ్యర్థులకు వినతిపత్రం ఇచ్చారు. ఈ సమయంలో TSPSC చైర్మన్ జానార్ధన్ రెడ్డి అందుబాటులో లేరని తెలుస్తోంది. రెండు రోజుల సమయం కావాలని… దీనిపై చర్చించి నిర్ణయం చెబుతామని అధికారులు చెప్పినట్లు సమాచారం.

గ్రూప్ 2 వాయిదా వేయలేదు - TSPSC

గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా ఎలాంటి ప్రకటన చేయలేదని పబ్లిక్ సర్వీస్ కమిషన్ తెలిపింది. అసత్య ప్రచారాలు నమ్మవద్దని స్పష్టం చేసింది. బంధువు చనిపోవడంతో ఛైర్మన్ జనార్థన్ రెడ్డి ఆ కార్యక్రమంలో ఉన్నారని తెలిపింది.

హైకోర్టులో పిటిషన్..

ఇదే అంశంపై పలువురు అభ్యర్థులను హైకోర్టును ఆశ్రయించారు. వాయిదా కోరుతూ 150 మంది విద్యార్థులు కలిసి ఈ పిటిషన్ వేశారు. ఇతర పరీక్షల ఉన్న నేపథ్యంలో… గ్రూప్ -2 ఎగ్జామ్ ను రీషెడ్యూల్ చేయాలని కోరారు.

గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. నిరుద్యోగుల ఆర్తనాదాలు వినకుండా తొమ్మిదేళ్లు నీరోను తలపించిన కేసీఆర్… ఎన్నికల ముందు ఓట్లు, సీట్లే లక్ష్యంగా ఉద్యోగార్ధులకు సన్నద్ధతకు సమయం ఇవ్వకుండా అగ్ని ‘పరీక్ష’పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రూప్ -2 పరీక్షల వాయిదాకు లక్షలాది మంది చేస్తోన్న డిమాండ్ పై సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు.

గ్రూప్ 2 పరీక్షకు సంబంధించి కొంతకాలంగా అభ్యర్థులు ఆందోళన చేస్తున్నారు. వాయిదా వేయాలని కోరుతున్నారు. వరుసగా పోటీ పరీక్షలు నిర్వహించడంతో టైం సరిపోక తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరీక్షకు పూర్తి స్థాయిలో సన్నద్ధం కాలేకపోతున్నామని అంటున్నారు. ప్రధానంగా ఆగస్టు 1 నుంచి గురుకుల పరీక్షలు జరుగుతున్నాయి. ఈ నెల 21వ తేదీ వరకు ఈ ఎగ్జామ్స్ ఉన్నాయి. వీటికి తోడుగా సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 3 వరకు జూనియర్ లెక్చరర్ పరీక్షలు పరీక్షలు ఉన్నాయి. ఇక ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్ 2 పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇలా వరుస దినాల్లో పరీక్షలు ఉండటంతో.... ఏ పరీక్షకు పూర్తిస్థాయిలో అట్టెంప్ట్ చేయాలో తెలియక ఆందోళనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే కీలకమైన గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ ఆగస్టు 10న అభ్యర్థులు ఛలో టీఎస్పీఎస్సీకి పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా... నిరుద్యోగులు భారీగా కార్యాలయానికి తరలివచ్చారు. వీరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.... స్టేషన్ కు తరలించారు.

తదుపరి వ్యాసం