తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Set 2023 : తెలంగాణ 'సెట్' దరఖాస్తులు ప్రారంభం - ప్రాసెస్ ఇదే

TS SET 2023 : తెలంగాణ 'సెట్' దరఖాస్తులు ప్రారంభం - ప్రాసెస్ ఇదే

08 August 2023, 19:47 IST

    • TS SET 2023 Updates: తెలంగాణ సెట్ - 2023 దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. 
తెలంగాణ సెట్ దరఖాస్తులు
తెలంగాణ సెట్ దరఖాస్తులు

తెలంగాణ సెట్ దరఖాస్తులు

TS SET 2023 Applications: తెలంగాణ సెట్(TS SET-2023) నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఏడాది టీఎస్ సెట్ ను ఉస్మానియా యూనివర్సిటీ నిర్వహించనుంది. అసిస్టెంట్ ప్రొఫెసర్లు, డిగ్రీ కాలేజీ లెక్చరర్ల ఉద్యోగాలకు అర్హత సాధించేందుకు ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. అభ్యర్థులు ఆగ‌స్టు 5వ తేదీ నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.

ట్రెండింగ్ వార్తలు

Wardhannapet Govt Hospital : వర్ధన్నపేటలో దారుణం-ఫోన్లో డాక్టర్ డైరెక్షన్ గర్భిణీకి నర్సులు డెలివరీ, శిశువు మృతి

TS Universities VCs : తెలంగాణలో వీసీల నియామకంపై కసరత్తు, 10 యూనివర్సిటీలకు 1382 అప్లికేషన్లు

WhatsApp Triple Talaq : వాట్సాప్ లో భార్యకు ట్రిపుల్ తలాక్, ఆదిలాబాద్ లో వ్యక్తి అరెస్టు

TS Cabinet Meeting : తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి, కానీ!

సెట్ ను రెండు పేపర్లలో నిర్వహిస్తారు. పేప‌ర్-1లో 50 ప్రశ్నల‌కు 100 మార్కులు, పేప‌ర్-2లో 100 ప్రశ్నల‌కు 200 మార్కులతో నిర్వహిస్తారు. కంప్యూట‌ర్ బేస్డ్ ప‌ద్ధతిలో మూడు గంటల పాటు ప‌రీక్ష నిర్వహించ‌నున్నారు. టీఎస్ సెట్ నోటిఫికేష‌న్‌తో పాటు ఇతర స‌మాచారం కోసం www.telanganaset.org, www.osmania.ac.in అనే వెబ్‌సైట్లను విజిట్ చేయవచ్చు. ఈ ఏడాది అక్టోబర్ లో టీఎస్ సెట్ నిర్వహించనున్నారు. ఈ ఏడాది మార్చి 14, 15, 17వ తేదీల్లోనూ టీఎస్ సెట్ పరీక్షను నిర్వహించింది ఉస్మానియా యూనివర్సిటీ. ఈ సెట్ పరీక్షలకు మొత్తం 50,256 మంది అప్లై చేసుకోగా, 40,128 మంది హాజరయ్యారు.

తెలంగాణ సెట్ ముఖ్య తేదీలు

ప్రాసెస్ ఇదే…

అభ్యర్థులు ముందుగా http://telanganaset.org/index.htm వెబ్ సైట్ లోకి వెళ్లాలి.

అప్లయ్ ఆన్ లైన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయండి.

ఇక్కడ మీకు దరఖాస్తు ఫామ్ ఓపెన్ అవుతుంది.

మీ వివరాలతో పాటు విద్యార్హతలను ఎంటర్ చేయాలి. ఇందులోనే మీరు ఎగ్జామ్ సెంటర్ ను కూడా ఎంచుకోవాల్సి ఉంటుంది.

వివరాల ఎంట్రీ తర్వాత అప్లికేషన్ రుసుం చెల్లించాలి. ఆన్ లైన్ పేమెంట్ విధానం కూడా అందుబాటులో ఉంది.

ఫైనల్ గా సబ్మిట్ బటన్ పై నొక్కితే మీ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి అవుతుంది.

ముఖ్య వివరాలు:

'జనరల్ పేపర్ ఆన్ టీచింగ్ అండ్ రిసెర్చ్ ఆప్టిట్యూడ్ (పేపర్-1), జాగ్రఫీ, కెమికల్ సైన్సెస్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ అండ్‌ అప్లికేషన్స్, ఎకనామిక్స్, ఎడ్యుకేషన్, ఇంగ్లిష్, ఎర్త్ సైన్స్, లైఫ్ సైన్సెస్, జర్నలిజం అండ్‌ మాస్ కమ్యూనికేషన్, మేనేజ్‌మెంట్, హిందీ, హిస్టరీ, లా , మ్యాథమెటికల్ సైన్సెస్, ఫిజికల్ సైన్సెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్, ఫిలాసఫీ, పొలిటికల్ సైన్స్, సైకాలజీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, తెలుగు, ఉర్దూ, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, సంస్కృతం, సోషల్ వర్క్, ఎన్విరాన్‌మెంటల్ స్టడీస్, లింగ్విస్టిక్స్ సబ్జెక్టుల్లో సెట్ రాసుకోవచ్చు.

వయోపరిమితి: గరిష్ఠ వయోపరిమితి లేదు.

కంప్యూటర్‌ ఆధారిత టెస్టు (సీబీటీ) పద్ధతిలో జరిగే పరీక్షకు రెండు పేపర్లు ఉంటాయి.

పేపర్‌-1లో 50 ప్రశ్నలకు 100 మార్కులు, పేపర్‌-2లో 100 ప్రశ్నలకు 200 మార్కులు కేటాయించారు. పరీక్ష వ్యవధి మూడు గంటలు.

ఆబ్జెక్టివ్‌ తరహాలో 50 ప్రశ్నలకు పేపర్‌–1 ప్రశ్నపత్రం ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి 2 మార్కులు కేటాయిస్తారు. ఇందులో అభ్యర్థుల బోధన/పరిశోధన ఆప్టిట్యూడ్‌ను పరీక్షించే విధంగా ప్రశ్నలుంటాయి. అలాగే తార్కిక సామర్థ్యం, గ్రహణశక్తి, భిన్నమైన ఆలోచనల దృక్పథాన్ని పరిశీలించే విధంగా ప్రశ్నలు అడుగుతారు.

ఈ పేపర్‌లో అభ్యర్థులు ఎంపిక చేసుకున్న సబ్జెక్టు నుంచి ఆబ్జెక్టివ్‌ తరహాలో ప్రశ్నపత్రం ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి 2 మార్కుల చొప్పున 100 ప్రశ్నలను అడుగుతారు.

ఓసీలకు రూ.2000; బీసీ/ ఈడబ్ల్యూఎస్‌లకు రూ.1500; ఎస్సీ, ఎస్టీ, వీహెచ్‌, హెచ్‌ఐ, ఓహెచ్‌, ట్రాన్స్‌జెండర్‌లకు రూ.1000గా దరఖాస్తు రుసుం నిర్ణయించారు.

ఆదిలాబాద్, నిజామాబాద్, విజయవాడ, హైదరాబాద్, వరంగల్, కర్నూలు, కరీంనగర్, ఖమ్మం, తిరుపతి, మహబూబ్ నగర్, మెదక్, వైజాగ్, నల్గొండ, రంగారెడ్డి కేంద్రాల్లో పరీక్ష నిర్వహిస్తారు.

తెలంగాణ సెట్ అధికారిక వెబ్‌సైట్‌ : http://www.telanganaset.org/

తదుపరి వ్యాసం