తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Lawcet 2023 : అలర్ట్... లాసెట్‌ కౌన్సెలింగ్‌ దరఖాస్తు గడువు పొడిగింపు - కొత్త తేదీలివే

TS LAWCET 2023 : అలర్ట్... లాసెట్‌ కౌన్సెలింగ్‌ దరఖాస్తు గడువు పొడిగింపు - కొత్త తేదీలివే

22 November 2023, 9:50 IST

    • TS LAWCET Registration2023 : తెలంగాణ లాసెట్ - 2023 కు సంబంధించి రిజిస్ట్రేషన్ తేదీలను పొడిగించారు. ఈ మేరకు అధికారులు ప్రకటన విడుదల చేశారు. 
తెలంగాణ లాసెట్ - 2023
తెలంగాణ లాసెట్ - 2023

తెలంగాణ లాసెట్ - 2023

TS LAWCET Counselling Schedule 2023 : రాష్ట్రంలో న్యాయ కళాశాలాల్లో ప్రవేశాలకు సంబంధించి నిర్వహించిన లాసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇప్పటికే విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నెల 14 నుంచి ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ ప్రారంభమైంది. అయితే ముందుగా ప్రకటించిన గడువు ప్రకారం రిజిస్ట్రేషన్ ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. ఈ నేపథ్యంలో… రిజిస్ట్రేషన్ తో పాటు వెరిఫికేష్ గడువును పొడిగిస్తూ అధికారులు ప్రకటన విడుదల చేశారు. తొలి విడత కౌన్సెలింగ్‌లో పాల్గొనే అభ్యర్థులకు ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌, ధ్రువపత్రాల పరిశీలనకు దరఖాస్తు గడువును నవంబరు 23వ తేదీ వరకు పొడిగించినట్లు తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు

TS Cabinet Meeting : తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి, కానీ!

TS TET 2024 Exams : రేపట్నుంచే తెలంగాణ టెట్ పరీక్షలు- ఎగ్జామ్ షెడ్యూల్, అభ్యర్థులకు మార్గదర్శకాలివే!

TG ITI Admissions 2024 : టెన్త్ విద్యార్థులకు అలర్ట్... ఐటీఐ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల, ముఖ్య తేదీలివే

Food Inspection in Hyderabad : పాడైపోయిన ఆహార పదార్థాలు, పాటించని ప్రమాణాలు - తనిఖీల్లో విస్తుపోయే విషయాలు..!

తెలంగాణ లాసెట్ - 2023 కౌన్సెలింగ్ షెడ్యూల్:

-అర్హత సాధించిన అభ్యర్థులు నవంబరు 23 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

-నవంబరు 30న మొదటి విడత సీట్లు కేటాయించనున్నారు.

-సీట్లు పొందిన అభ్యర్థులు డిసెంబరు 2 వరకు ఫీజు చెల్లించి ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలనకు కళాశాలల్లో రిపోర్టింగ్ రిపోర్టింగ్ చేయాలి.

- డిసెంబరు 4 నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి.

- https://lawcet.tsche.ac.in/ వెబ్ సైట్ ద్వారా వెబ్ ఆప్షన్లను ఎంచుకోవాలి.

మూడేళ్ల ఎల్‌ఎల్‌బీకి 20,234 మంది అర్హత సాధించగా… 22 కాలేజీల్లో 4,790 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఐదేళ్ల ఎల్‌ఎల్‌బీ పరీక్షలో 6,039 మంది అర్హత సాధించగా, 19 కాలేజీల్లో 2,280 సీట్లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. పీజీఎల్‌సెట్‌కు 2,776 మంది అర్హత సాధించగా…,17 కాలేజీల్లో 930 సీట్లు అందుబాటులో ఉన్నాయి. https://lawcet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లి పూర్తి వివరాలు తెలుసుకోవాలి.

తదుపరి వ్యాసం