తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Hc Recruitment 2023: ఇంటర్ అర్హతతో 84, డిగ్రీ అర్హతతో 144 కోర్టు ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల, ముఖ్య తేదీలివే

TS HC Recruitment 2023: ఇంటర్ అర్హతతో 84, డిగ్రీ అర్హతతో 144 కోర్టు ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల, ముఖ్య తేదీలివే

HT Telugu Desk HT Telugu

17 May 2023, 7:25 IST

    • Telangana High Court Recruitment:పలు ఉద్యోగాల భర్తీకి తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఇందులో భాగంగా కాపీయిస్ట్, టైపిస్ట్ ఖాళీలను భర్తీ చేయనుంది. ఈ మేరకు ముఖ్య తేదీలను ప్రకటించింది. 
తెలంగాణ హైకోర్టు
తెలంగాణ హైకోర్టు

తెలంగాణ హైకోర్టు

Telangana High Court Recruitment 2023 Updates: గతేడాదే పలు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చిన తెలంగాణ హైకోర్టు... మరోసారి రిక్రూట్ మెంట్ ప్రకటనలను జారీ చేసింది. రాష్ట్రంలోని కోర్టుల్లో ఖాళీగా ఉన్న కాపీస్ట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 84 పోస్టులను భర్తీ చేయనుంది. ఇంటర్ అర్హతతో పాటు పాటు ఇంగ్లీష్ టైపింగ్ తప్పనిసరి. ఈ పోస్టుల భర్తీకి మే 25 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. జూన్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన వివరాలు చూస్తే....

ట్రెండింగ్ వార్తలు

Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలు పని వేళల్లో మార్పులు, అధికారుల క్లారిటీ!

Love Fraud : : కి'లేడి' ప్రేమపేరుతో మోసం-ప్రియుడు ఆత్మహత్యాయత్నం

Mallareddy Land Issue : సుచిత్రలో భూవివాదం- అల్లుడు, అనుచరులతో కలిసి మల్లారెడ్డి హల్ చల్-ఆపై అరెస్ట్!

Khammam Crime News : ఖమ్మం జిల్లాలో దారుణం.. ఆస్తి కోసం తల్లితో పాటు ఇద్దరు కుమార్తెల హత్య

ముఖ్య వివరాలు...

ఉద్యోగాలు - కాపియిస్ట్‌

మొత్తం ఖాళీల సంఖ్య - 84

జిల్లాలవారీగా ఖాళీలు - ఆదిలాబాద్ - 3, భద్రాద్రి కొత్తగూడెం-4, హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు-5, జనగామ-1, జయశంకర్ భూపాలపల్లి-2, గద్వాల-1, కామారెడ్డి-1, ఖమ్మం-01, కొమరంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా-02, మహబూబాబాద్ -01, మేడ్చల్-మల్కాజ్‌గిరి-10, ములుగు-02, నాగర్‌కర్నూలు-04, నారాయణపేట-03, నిజామాబాద్-02, పెద్దపల్లి-03, రంగారెడ్డి-19, సంగారెడ్డి-01, సిద్ధిపేట-04, సూర్యాపేట-04, వికారాబాద్-04, వనపర్తి-2, వరంగల్-3, యాదాద్రి భువనగిరి-2.

అర్హతలు - ఇంటర్మీడియట్‌ పాస్ అయి ఉండాలి. తెలంగాణ ప్రభుత్వ టెక్నికల్ ఇంగ్లీష్ షార్ట్‌హ్యాండ్ (హయ్యర్ గ్రేడ్) ఉత్తీర్ణులై ఉండాలి. నిమిషానికి 45 పదాలు టైప్ చేయగల్గాలి.

వయసు- 18-34 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది.

దరఖాస్తు రుసుం - జనరల్ అభ్యర్థులు రూ.600 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు రూ.400 చెల్లించాలి.

దరఖాస్తు విధానం- ఆన్‌లైన్‌

ఎంపిక విధానం - మొత్తం 100 మార్కులకు స్కిల్‌టెస్ట్ (టైపింగ్ టెస్ట్) నిర్వహిస్తారు. 10 నిమిషాల ఇంగ్లీష్ షార్ట్‌హ్యాండ్ టెస్ట్ ఉంటుంది. నిమిషానికి 45 పదాలు టైప్ చేయగలగాలి. అలాగే కంప్యూటర్ మీద 45 నిమిషాల ట్రాన్‌స్క్రిప్షన్ ఉంటుంది. హైకోర్టులో ఇప్పటికే పనిచేస్తున్నవారికి వెయిటేజీ వర్తిస్తుంది.

జీతం - నెలకు రూ.22,900-రూ.69,150 చెల్లిస్తారు.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ- 25 -05 -2023.

దరఖాస్తుకు చివరితేది: 5 -06 -2023.

స్కిల్‌ టెస్ట్‌ తేది: జూలైలో నిర్వహిస్తారు.

అధికారిక వెబ్ సైట్ - https://tshc.gov.in/

మరోవైపు వివిధ కోర్టుల్లో ఖాళీగా ఉన్న టైపిస్ట్ పోస్టుల భర్తీకి కూడా నోటిఫికేషన్ విడుదల చేసింది హైకోర్టు. ఈ ప్రకటన ద్వారా మొత్తం 144 టైపిస్ట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ అర్హతతోపాటు ఇంగ్లిష్ టైపింగ్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఈ పోస్టుల భర్తీకి మే 25 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభంకానుంది. జూన్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.

తదుపరి వ్యాసం