తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Eamcet Counselling 2023 : టీఎస్ ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ పూర్తి, అలాట్‌మెంట్ లెటర్స్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి!

TS EAMCET Counselling 2023 : టీఎస్ ఎంసెట్ రెండో విడత కౌన్సెలింగ్ పూర్తి, అలాట్‌మెంట్ లెటర్స్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి!

31 July 2023, 14:48 IST

    • TS EAMCET Counselling 2023 : తెలంగాణ ఎంసెట్ రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తైంది. రెండో దశ కౌన్సెలింగ్ లో సీట్లు పొందిన విద్యార్థులు ఎంసెట్ వెబ్ సైట్ లో అలాంట్మెంట్ ఆర్డర్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఆగస్టు 4 నుంచి తుది విడత కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది.
టీఎస్ ఎంసెట్ కౌన్సెలింగ్
టీఎస్ ఎంసెట్ కౌన్సెలింగ్

టీఎస్ ఎంసెట్ కౌన్సెలింగ్

TS EAMCET Counselling 2023 : తెలంగాణ ఎంసెట్(ఇంజినీరింగ్) రెండో విడత సీట్ల కేటాయింపు పూర్తైందని అధికారులు తెలిపారు. సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ లో 85.47 శాతం సీట్లు భర్తీ అయ్యాయని ప్రకటించారు. రెండో విడత‌లో కొత్తగా 7,417 మంది విద్యార్థుల‌కు సీట్లు కేటాయించినట్లు నిర్వాహకులు తెలిపారు. ఆగస్టు 4 నుండి తుది విడత కౌన్సెలింగ్ ప్రారంభం అవుతుందని వెల్లడించారు. రెండో విడత కౌన్సెలింగ్ లో 25,148 మంది విద్యార్థులు త‌మ సీట్లను మార్చుకున్నారు. ఇంకా 12,013 ఇంజినీరంగ్ సీట్లు మిగిలినట్లు ఎంసెట్ కన్వీనర్ ప్రకటించారు. నాలుగు యూనివ‌ర్సిటీలు, 28 ప్రైవేటు కాలేజీల్లో వంద శాతం సీట్లు భర్తీ అయ్యాయని తెలిపారు. కౌన్సెలింగ్ లో సీట్లు పొందిన విద్యార్థులు ఆగ‌స్టు 2 లోపు ఆయా కాలేజీల్లో రిపోర్ట్ చేయాల‌ని క‌న్వీన‌ర్ సూచించారు. ఆగ‌స్టు 4 నుంచి ఎంసెట్ ఇంజినీరింగ్ తుది విడుత కౌన్సెలింగ్ ప్రారంభం కానుందని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు

TS Cabinet Expansion : సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో మరో ఆరుగురికి ఛాన్స్, ఎవరెవరికి చోటు దక్కనుంది?

Hyderabad Real Estate Scam: హైదరాబాద్ లో మరో ప్రీ లాంచ్ రియల్ ఎస్టేట్ స్కామ్, రూ.60 కోట్లు వసూలు చేసిన భారతి బిల్డర్స్

Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలు పని వేళల్లో మార్పులు, అధికారుల క్లారిటీ!

Love Fraud : : కి'లేడి' ప్రేమపేరుతో మోసం-ప్రియుడు ఆత్మహత్యాయత్నం

ఐటీ కోర్సుల్లో 94.40 శాతం సీట్లు భర్తీ

ఇప్పటి వరకూ కంప్యూట‌ర్ సైన్స్, ఐటీ సంబంధిత కోర్సుల్లో 94.40 శాతం సీట్లు, ఎల‌క్ట్రానిక్స్, ఎల‌క్ట్రిక‌ల్ ఇంజినీరింగ్ కోర్సుల్లో 78.03 శాతం, సివిల్, మెకానికల్ ఇంజినీరింగ్ కోర్సుల్లో 43.48 శాతం, ఇతర కోర్సుల్లో 60.02 శాతం సీట్లు భ‌ర్తీ అయ్యాయని ఎంసెట్ కన్వీనర్ ప్రకటించారు. రెండో విడత కౌన్సెలింగ్ లో సీట్లు పొందిన విద్యార్థులు.... ఎంసెట్ అధికారిక వెబ్‌సైట్ నుంచి అలాట్‌మెంట్ లెటర్ డౌన్‌లోడ్ చేసుకోని, అందులో పేర్కొన్న ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం సీటు క‌న్ఫర్మేష‌న్ అవుతుంది.

అలాట్‌మెంట్ డౌన్‌లోడ్ చేయడం ఎలా?

  • టీఎస్ ఎంసెట్ అధికారిక వెబ్‌సైట్, tseamcet.nic.in 2023ని సందర్శించండి
  • హోమ్‌పేజీలో, అభ్యర్థి లాగిన్ లింక్‌పై క్లిక్ చేయండి
  • అభ్యర్థి రిజిస్ట్రేషన్ నంబర్, పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి
  • TS EAMCET సెకండ్ ఫేజ్ సీట్ల కేటాయింపు డిస్ ప్లే అవుతుంది. అభ్యర్థులకు కేటాయించిన కాలేజీ వివరాలను తనిఖీ చేయండి
  • సీటు అలాట్‌మెంట్ లెటర్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఫీజు చెల్లించండి

TS EAMCET కౌన్సెలింగ్ 2023- ఫేజ్ 3 షెడ్యూల్

సీటు కేటాయించని అభ్యర్థులు మూడో దశ కౌన్సెలింగ్ కు నమోదు చేసుకోవచ్చు.

  • ఆగస్టు 4 - ప్రాథమిక సమాచారం ఆన్‌లైన్ ఫైలింగ్, ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు, స్లాట్ బుకింగ్
  • ఆగస్టు 5 - ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకున్న అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్
  • ఆగస్టు 4 నుంచి ఆగస్టు 6 వరకు- సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత వెబ్ ఆప్షన్ ఎంపిక
  • ఆగస్ట్ 6 - ఆప్షన్‌లు ఫ్రీజింగ్
  • ఆగస్టు 9 - ఇంజినీరింగ్ సీట్లు తాత్కాలిక కేటాయింపు
  • ఆగస్టు 9 నుంచి ఆగస్టు 11 వరకు- వెబ్‌సైట్ ద్వారా ట్యూషన్ ఫీజు చెల్లించి, కాలేజీల్లో సెల్ఫ్ రిపోర్టింగ్

తదుపరి వ్యాసం