తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Munugode Bypoll : ఈసీ వద్దకు టీఆర్ఎస్.. ఆ గుర్తులపై ఫిర్యాదు

Munugode Bypoll : ఈసీ వద్దకు టీఆర్ఎస్.. ఆ గుర్తులపై ఫిర్యాదు

HT Telugu Desk HT Telugu

10 October 2022, 21:42 IST

    • TRS Complaints To EC : మునుగోడు ఉప ఎన్నికల విషయంపై ఈసీ వద్దకు టీఆర్ఎస్ వెళ్లింది. కారును పోలిన గుర్తులను తొలగించాలంటూ ఫిర్యాదు చేసింది.
టీఆర్ఎస్
టీఆర్ఎస్

టీఆర్ఎస్

కారు(Car)ను పోలిన పలు గుర్తులను తొలగించాలంటూ ఈసీ(EC)ని ఆశ్రయించింది టీఆర్ఎస్. కారును పోలిన గుర్తులతో గతంలో టీఆర్ఎస్(TRS) అభ్యర్థులకు నష్టం జరిగిందని వెల్లడించారు. మునుగోడు ఉప ఎన్నిక(Munugode Bypoll)ల్లో కారును పోలిన 8 గుర్తులు ఉన్నాయని, అయితే వాటిని తొలగించాలని ఎన్నికల కమిషన్‌ను కోరారు. టీఆర్ఎస్ నేతలు దాస్యం వినయ్ భాస్కర్, భాను ప్రసాదరావు, భరత్ కుమార్.. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్‌కు కలిశారు. ఈ మేరకు వినతి పత్రం ఇచ్చారు.

ట్రెండింగ్ వార్తలు

TS Cabinet Expansion : సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో మరో ఆరుగురికి ఛాన్స్, ఎవరెవరికి చోటు దక్కనుంది?

Hyderabad Real Estate Scam: హైదరాబాద్ లో మరో ప్రీ లాంచ్ రియల్ ఎస్టేట్ స్కామ్, రూ.60 కోట్లు వసూలు చేసిన భారతి బిల్డర్స్

Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలు పని వేళల్లో మార్పులు, అధికారుల క్లారిటీ!

Love Fraud : : కి'లేడి' ప్రేమపేరుతో మోసం-ప్రియుడు ఆత్మహత్యాయత్నం

ఎన్నికల గుర్తులైన కెమెరా, చపాతీ రోలర్, డాలీ, రోడ్ రోలర్, సబ్బు డబ్బా, టీవీ, కుట్టుమిషన్, ఓడను తొలగించాల టీఆర్ఎస్ నేతలు వినతిపత్రం ఇచ్చారు. 48 గంటల్లో స్పందించకపోతే కోర్టు(Court)ను ఆశ్రయిస్తామని చెప్పారు. 2018 ఎన్నికల్లో కారును పోలిన గుర్తులతో టీఆర్ఎస్(TRS) అభ్యర్థులకు నష్టం జరిగిందని టీఆర్ఎస్ నేతలు చెప్పారు. ఈ గుర్తులతో బరిలో ఉన్న స్వతంత్ర అభ్యర్థులకే ఎక్కువ ఓట్లు వచ్చాయని ఈసీ దృష్టికి తీసుకొచ్చారు.

నర్సంపేట(Narsampeta), చెన్నూరు, దుబ్బాక, సిద్దిపేట, ఆసిఫాబాద్, బాన్సువాడ, నాగార్జునసాగర్‌లో కెమెరా గుర్తుకు కూడా బీఎస్పీ(BSP), సీపీఎం కన్నా ఎక్కువ ఓట్లు పడ్డాయని టీఆర్ఎస్ నేతలు అన్నారు. 8 గుర్తులను తొలగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా.. కేసీఆర్‌పై బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. బండి సంజయ్‌(Bandi Sanjay)పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

తదుపరి వ్యాసం