తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Traffic : వాహనదారులకు అలర్ట్.... నవంబర్ 11 వరకు ఈ రూట్‍లో ట్రాఫిక్ ఆంక్షలు

Hyderabad Traffic : వాహనదారులకు అలర్ట్.... నవంబర్ 11 వరకు ఈ రూట్‍లో ట్రాఫిక్ ఆంక్షలు

HT Telugu Desk HT Telugu

12 October 2023, 19:37 IST

    • Traffic Restrictions in Hyderabad : వాహనదారులకు అలర్ట్ ఇచ్చారు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. అడిక్‌మెట్ వంతనెను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు తెలిపింది. అక్టోబర్ 12 నుంచి నవంబర్ 12 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొంది.
ట్రాఫిక్ ఆంక్షలు
ట్రాఫిక్ ఆంక్షలు

ట్రాఫిక్ ఆంక్షలు

Traffic Restrictions Adikmet Flyover : నల్లకుంట అడిక్‌మెట్ వంతనకు మరమత్తు పనుల కారణంగా నెల రోజుల పాటు ( అక్టోబర్ 12 నుంచి నవంబర్ 12 వరకు )వంతనెను తాత్కాలికంగా మూసేయనున్నట్లు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ బుధవారం ప్రకటించింది. కాగా ప్రయాణికులకు ఆయా ప్రాంతాల్లో ఉన్న ట్రాఫిక్ మళ్లింపులను హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ సూచించింది. అలాగే ప్రజలు కూడా వంతనెను మూసేసిన కారణంగా వారి గమ్యస్థానాలకు చేరుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ అధికారులు సూచించారు.

ట్రెండింగ్ వార్తలు

Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలు పని వేళల్లో మార్పులు, అధికారుల క్లారిటీ!

Mallareddy Land Issue : సుచిత్రలో భూవివాదం- అల్లుడు, అనుచరులతో కలిసి మల్లారెడ్డి హల్ చల్-ఆపై అరెస్ట్!

Khammam Crime News : ఖమ్మం జిల్లాలో దారుణం.. ఆస్తి కోసం తల్లితో పాటు ఇద్దరు కుమార్తెల హత్య

TS Govt Jobs 2024 : ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు... రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినెట్ ఖాళీలు, ముఖ్య తేదీలివే

ట్రాఫిక్ మళ్లింపులు ఇలా ఉన్నాయి

• రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు విద్యానగర్ వై జంక్షన్ నుంచి రాంనగర్ టి జంక్షన్ రాంనగర్ గుండు వైపు వెళ్లే వాహనాలు రాంనగర్ గుండు మీదుగా రాంనగర్ క్రాస్ రోడ్డు కు మళ్లించబడతాయి. భారీ వాహనాలకు ఈ మార్గంలో అనుమతి ఉండదు.

• విద్యానగర్ వై జంక్షన్ నుంచి తార్నాక,చిలకలగూడ,సికింద్రాబాద్ వైపు వెళ్లే వాహనాలు రాంనగర్ టి జంక్షన్ వద్ద రాంనగర్ గుండు,లలిత నగర్,బౌద్ధ నగర్ ఎక్స్ రోడ్,వరసిగుడ,సీతాఫలమండి ఆర్ ఓ బి నుంచి ఉస్మానియా రోడ్ కు వెళతాయి.

• రాత్రి 10 నుంచి ఉదయం 5 గంటల వరకు తార్నాక జంక్షన్ నుంచి వచ్చే భారీ వాహనాలు సీతాఫలమండి టి జంక్షన్ వద్ద సీతాఫలమండి ఆర్ ఓ బి పైకి మళ్లించబడతాయి.

• తార్నాక,హబ్సిగూడ,సికింద్రాబాద్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులతో సహా ఇతర భారీ వాహనాలు విద్య నగర్ వై జంక్షన్ వద్ద విద్య నగర్ ఆర్ఓబి పై నుంచి ఎన్ సి సి మీదుగా ఉస్మానియా రోడ్డు వైపు వెళతాయి.

• విద్య నగర్ నుండి వచ్చే తేలిక వాహనాలు ప్రొఫెసర్ రాంరెడ్డి సెంటర్ మీదుగా బౌద్ధ నగర్ క్రాస్ రోడ్ కు మల్లించబడతాయి.

• తెల్లవారుజామున 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తార్నాక జంక్షన్ నుంచి విద్య నగర్ వైపు వచ్చే వాహనాలు ఆర్టీసీ బస్సులతో సహా ఇతర భారీ వాహనాలు ఓయూ వై జంక్షన్ వద్ధ యూనివర్సిటీ రోడ్ లోకి మళ్లించబడతాయి.

ప్రజలు,వాహనదారులు ట్రాఫిక్ పోలీసులకు సహకరించి వారు సూచించిన మార్గాలలో ప్రయాణించాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ కోరింది.

రిపోర్టర్: కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్

తదుపరి వ్యాసం