తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Free Current: ఆ హామీ నెరవేర్చాలంటే ఏడాదికి రూ.4200కోట్ల ఖర్చు…?

TS Free Current: ఆ హామీ నెరవేర్చాలంటే ఏడాదికి రూ.4200కోట్ల ఖర్చు…?

Sarath chandra.B HT Telugu

18 January 2024, 13:54 IST

    • TS Free Current: తెలంగాణలో ఉచిత విద్యుత్ హామీ నెరవేర్చాలంటే ఏటా రూ.4200కోట్ల రుపాయల భారాన్ని ప్రభుత్వం భరించాల్సి ఉంటుందని లెక్క తేల్చారు. 
ఉచిత విద్యుత్ పథకంపై అధ్యయనం
ఉచిత విద్యుత్ పథకంపై అధ్యయనం (Pixabay )

ఉచిత విద్యుత్ పథకంపై అధ్యయనం

TS Free Current: తెలంగాణలో కాంగ్రెస్‌ ఎన్నికల హామీల్లో ఒకటైన ఉచిత విద్యుత్ హామీ నెరవేర్చాలంటే ఏటా రాష్ట్ర ప్రభుత్వం రూ.4200కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందని లెక్కించారు.

ట్రెండింగ్ వార్తలు

10 Years Telangana: ఉమ్మడి రాజధాని గడువు మరో పక్షం రోజులే.. జూన్‌2 తర్వాత ఆస్తుల స్వాధీనం చేసుకోవాలని సిఎం రేవంత్ ఆదేశం

BRS RakeshReddy: బీఆర్ఎస్ లో 'రాకేశ్ రెడ్డి' పంచాయితీ!కోఆర్డినేషన్ మీటింగ్‌ కు ముఖ్య నేతలంతా డుమ్మా

TS CPGET 2024 : టీఎస్ సీపీగెట్ నోటిఫికేషన్ విడుదల, మే 18 నుంచి అప్లికేషన్లు ప్రారంభం

Road Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు- ఆరుగురు మృతి, 14 మందికి గాయాలు

అధికారంలోకి వస్తే ప్రతి నెలా 200 యూనిట్ల గృహావసర కరెంటు ఉచితంగా ఇస్తామన్న హామీ అమలుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. జనవరి ఒకటో తేదీ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో గృహావసర విద్యుత్తు కనె క్లన్లు కోటీ 31 లక్షల 48 వేలకు పైగా ఉన్నాయి.

వీటిలో నెలకు 200 యూనిట్ల వరకు వాడే కనెక్షన్లు 1.05కోట్ల కనెక్షన్ల వరకు ఉన్నాయి. 200 యూనిట్లలోపు కనెక్షన్ల నుంచి నెలనెలా కరెంటు బిల్లులపై డిస్కం లకు సుమారు రూ.350 కోట్లు బిల్లులుగా వినియోగదారులు చెల్లిస్తున్నారు.

ఇకపై కరెంటు ఉచితంగా ఇస్తే ఈ సొమ్మంతా పంపిణీ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ఈ మొత్తం చెల్లిం చాల్సి ఉంటుంది. తెలంగాణలో ఒక యూనిట్ కరెంటు సరఫరాకు సగటున రూ.7.07 ఖర్చు అవుతోంది. 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియో గించే వారికి సగటు ధరకంటే తక్కువ ఛార్జీలే వసూలు చేస్తున్నట్లు పంపిణీ సంస్థలు చెబుతున్నాయి.

నెలకు రూ.350కోట్ల చొప్పున ఏటా రూ.4200 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ పంపిణీ సంస్థలకు చెల్లిస్తేనే ఉచిత విద్యుత్తు సరఫరా సాధ్యమని అంచనా వేస్తున్నారు. విద్యుత్ కనీస ధర ప్రకారం చెల్లించాల్సి వస్తే ఈ మొత్తం పెరుగుతుంది.

ఉచిత విద్యుత్‌ పొందడానికి అర్హత ఉన్న 1.05 కోట్ల ఇళ్ల వివరాలను నమోదు చేయడానికి ప్రత్యేక పోర్టల్ అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ పథకంలో చేరే నియోగదారుల కనెక్షన్ల వివరా లన్నీ అందులో నమోదు చేస్తారు. ఎంత మందికి ఉచిత విద్యుత్ పథకాన్ని వర్తింప చేయాలనే దానిపై విధివిధానాలు త్వరలో ఖరారు చేయనున్నారు. మరోవైపు 200యూనిట్లలోపు వినియోగించే వారికి సోలార్‌ యూనిట్లను అందించే అవకాశాలను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోంది.

తదుపరి వ్యాసం