తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Double Bedroom Houses: నేటి నుంచి మూడో విడత డబుల్ బెడ్ ఇళ్ల పంపిణీ

Double bedroom Houses: నేటి నుంచి మూడో విడత డబుల్ బెడ్ ఇళ్ల పంపిణీ

HT Telugu Desk HT Telugu

02 October 2023, 10:23 IST

    • Double bedroom Houses: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్  పరిధిలో నేడు మూడో విడత డబుల్ బెడ్రూం ఇండ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. మూడో విడత లో మొత్తం 36,884 లబ్ధిదారులను ఎంపిక చేశారు. 
మూడో విడత డబుల్ బెడ్‌ రూమ్ ఇళ్ల పంపిణీ
మూడో విడత డబుల్ బెడ్‌ రూమ్ ఇళ్ల పంపిణీ

మూడో విడత డబుల్ బెడ్‌ రూమ్ ఇళ్ల పంపిణీ

Double bedroom Houses: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో నేడు మూడో విడత డబుల్ బెడ్రూం ఇండ్లను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. మూడో విడత లో మొత్తం 36,884 లబ్ధిదారులను జిల్లా కలెక్టర్లు , అధికారులు ఎంపిక చేశారు. అందులో 19020 మందికి ఇండ్లను అందించి మిగతా 17864 మందికి అక్టోబర్ 5న అందించనున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Love Fraud : : కి'లేడి' ప్రేమపేరుతో మోసం-ప్రియుడు ఆత్మహత్యాయత్నం

Mallareddy Land Issue : సుచిత్రలో భూవివాదం- అల్లుడు, అనుచరులతో కలిసి మల్లారెడ్డి హల్ చల్-ఆపై అరెస్ట్!

Khammam Crime News : ఖమ్మం జిల్లాలో దారుణం.. ఆస్తి కోసం తల్లితో పాటు ఇద్దరు కుమార్తెల హత్య

TS Govt Jobs 2024 : ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు... రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినెట్ ఖాళీలు, ముఖ్య తేదీలివే

మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్,సబితా ఇంద్రా రెడ్డి, మొహమ్మద్ అలీ,నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్, మరియు డిప్యూటీ స్పీకర్ పద్మా రావులు నేడు జరిగే ఇళ్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. వివిధ ప్రాంతాల్లో మొత్తం 19,020 డబుల్ బెడ్రూం ఇండ్లను లబ్ధిదారులకు అందించనున్నారు.

మొదటి విడతలో నగర వ్యాప్తంగా 11,700 ఇండ్లను లబ్దిదారులకు అందించారు. రెండో విడతలో 13,300 ఇండ్లను ప్రభుత్వం పంపిణీ చేసింది. నగరంలో ఇప్పటివరకు మొత్తం 44,020 ఇండ్లను లబ్ధిదారులకు ప్రభుత్వం అందించారు. ఎన్నికలోపు నగరంలో లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లు పంపిణీ లక్ష్యమని మంత్రి కేటీఆర్ ఇటీవలే ప్రకటించారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ ప్రక్రియ ఎంతో పారదర్శకంగా జరుగుతుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. డబుల్ బెడ్రూం ఇండ్ల ఎంపిక లో ఎమ్మెల్యేలు మరియు ఇతర ప్రజా ప్రతినిధులు ప్రమేయం లేదన్నారు.

మొదటి, రెండో విడతల్లో చేసినట్టుగా ర్యండైజేషన్ సాఫ్ట్వేర్ ను వాడి లక్కీ డ్రా ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేశామని మంత్రి తలసాని అన్నారు.లక్కీ డ్రా లో పేర్లు రాని వారు నిరాశకు గురికావొద్ధన్నారు. ఒక్క GHMC పరిధిలోనే ప్రభుత్వం సుమారు రూ.9,600 కోట్ల వ్యయంతో పేదలకు నాణ్యమైన ఇండ్లను నిర్మించిందని ఆయన పేర్కొన్నారు.

మూడో విడతలో ఇళ్ల పంపిణీ ఇలా..

• దుండిగల్ - 3,142

• శంకర్‌పల్లి - 1,361

• మన్సన్‌పల్లి - 2,099

• నల్లగండ్ల - 344

• నార్సింగి - 356

• కొల్లూరు-II - 6,067

• అహ్మద్‌గూడ - 1,965

• రాంపల్లి - 3,214

• అబ్దుల్లాపూర్ - 472 ఇళ్ళను లభ్దిదారులకు అందిస్తారు.

నగరంలోని పలు ప్రాంతాల్లో మొత్తం మొత్తం - 19,020 ఇళ్లను నేడు కేటాయించనున్నార.

(రిపోర్టింగ్ తరుణ్, హైదరాబాద్)

తదుపరి వ్యాసం