తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Eve Teasers Arrest: గణేష్‌ ఉత్సవాల్లో అతివలపై ఆకతాయిల వేధింపులు, పలువురి అరెస్ట్

Eve Teasers Arrest: గణేష్‌ ఉత్సవాల్లో అతివలపై ఆకతాయిల వేధింపులు, పలువురి అరెస్ట్

HT Telugu Desk HT Telugu

22 September 2023, 8:01 IST

    • Eve Teasers Arrest: వినాయక చవితి వేడుకల్లో పాల్గొంటున్న మహిళల్ని వేధిస్తున్న పలువురిని షీ టీమ్స్‌ అదుపులోకి తీసుకున్నాయి.  రద్దీ ప్రాంతాల్లో మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న వారిని  గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. బాడీ కెమెరాలతో మఫ్టీలో పర్యటిస్తూ ఆకతాయిలను గుర్తిస్తున్నారు. 
వినాయక చవితి వేడుకల్లో ఆకతాయిల వేధింపులు
వినాయక చవితి వేడుకల్లో ఆకతాయిల వేధింపులు

వినాయక చవితి వేడుకల్లో ఆకతాయిల వేధింపులు

Eve Teasers Arrest: వినాయక చవితి ఉత్సవాల్లో ఆడవారితో అసభ్యంగా ప్రవర్తించిన 55 మందిని షీ టీం పోలీసులు అదుపులో తీసుకున్నారు. రద్దీ ప్రదేశాల్లో మఫ్టీలో తిరుగుతూ వీడియో ఆధారాలతో నిందితులను అరెస్ట్ చేశారు. ఖైరతాబాద్ పోలిస్టేషన్ పరిధిలో వేధింపులకు పాల్పడుతున్న పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలు పని వేళల్లో మార్పులు, అధికారుల క్లారిటీ!

Love Fraud : : కి'లేడి' ప్రేమపేరుతో మోసం-ప్రియుడు ఆత్మహత్యాయత్నం

Mallareddy Land Issue : సుచిత్రలో భూవివాదం- అల్లుడు, అనుచరులతో కలిసి మల్లారెడ్డి హల్ చల్-ఆపై అరెస్ట్!

Khammam Crime News : ఖమ్మం జిల్లాలో దారుణం.. ఆస్తి కోసం తల్లితో పాటు ఇద్దరు కుమార్తెల హత్య

పోలీసులకు పట్టుబడిన వారిలో ఆటో డ్రైవర్లు, ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. గణేష్ విగ్రహాల ఊరేగింపు వెళుతున్న సమయంలో ఆకతాయిలు మహిళల్ని వేధిస్తున్నారు. మహిళలు గుంపుగా ఉన్న చోటును ఎంచుకొని వారితో అసభ్యంగా ప్రవర్తించడం, వారిని తాకుతూ ఇబ్బంది పెడుతున్నారని షీ టీమ్ పొలీసులు తెలిపారు.

మహిళలపై అసభ్యంగా ప్రవర్తించిన వారిపై సంబంధిత కేసులు నమోదు చేసి కౌన్సెలింగ్ నిర్వహించి కోర్టులో హాజరు పరుస్తామన్నారు.జార్ఖండ్‌కు చెందిన శ్యామ్ బిహారీ మహ్తో అనే వ్యక్తి కూడా అనుమానాస్పద స్థితిలో తిరుగుతుండగా పట్టుకున్నారు. అతని నుండి 4 దొంగిలించిన మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నాన్నారు. నిందితులను ఖైరతాబాద్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించినట్టు తెలిపారు. ఎవరైనా వేధింపులకు గురైతే వెంటనే హైదరాబాద్ సిటీ పోలీస్ వాట్సాప్ నంబర్ 9490616555 ను సంప్రదించాలని మరీ అత్యవసర పరిస్థితుల్లో అయితే 100కి డయల్ చేయవచ్చని సూచించారు.

తదుపరి వ్యాసం