తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Adilabad Mlas: ఆదిలాబాద్‌లో నియోజవర్గాలకి దూరంగా ఉంటున్న టిక్కెట్లు రాని ఎమ్మెల్యేలు

Adilabad Mlas: ఆదిలాబాద్‌లో నియోజవర్గాలకి దూరంగా ఉంటున్న టిక్కెట్లు రాని ఎమ్మెల్యేలు

HT Telugu Desk HT Telugu

28 September 2023, 13:33 IST

    • Adilabad Mlas: బిఆర్‌ఎస్‌ టిక్కెట్లు దక్కని ఆదిలాబాద్‌ ఎమ్మెల్యేలు తమ దారి తాము చూసుకునే ప్రయత్నాల్లో ఉన్నారు. మైనంపల్లితో పాటు కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. 
కడెం ప్రాజెక్టు పరిశీలిస్తున్న మంచిర్యాల ఎమ్మెల్యే
కడెం ప్రాజెక్టు పరిశీలిస్తున్న మంచిర్యాల ఎమ్మెల్యే

కడెం ప్రాజెక్టు పరిశీలిస్తున్న మంచిర్యాల ఎమ్మెల్యే

Adilabad Mlas: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బిఆర్‌ఎస్‌ మొదటి జాబితాలో టికెట్ రాని సిట్టింగ్ ఎమ్మెల్యేలు అయా నియోజక వర్గాల్లో జరిగే కార్యక్రమాలకు దూరాన్ని పాటిస్తున్నారు. గత వారం పది రోజులుగా నియోజవర్గాలో ఎక్కడ ఎమ్మెల్యేలు కనిపించలేదని స్థానికులు చర్చించుకుంటున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Food Inspection in Hyderabad : పాడైపోయిన ఆహార పదార్థాలు, పాటించని ప్రమాణాలు - తనిఖీల్లో విస్తుపోయే విషయాలు..!

Karimnagar Tourism : చారిత్రాత్మక ప్రదేశాలు, ప్రసిద్ధి చెందిన ఆలయాలు - కరీంనగర్ జిల్లాలో చూడాల్సిన ప్రాంతాలివే..!

19 May 2024 హైదరాబాద్ వాతావరణం ఎలా ఉంటుంది? పూర్తి సమాచారం తెలుసుకోండి

TS ECET 2024 Results : రేపు తెలంగాణ ఈసెట్ 2024 ఫలితాలు - ఇలా చెక్ చేసుకోండి

బిఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన మొదటి జాబితాలో ఆసిఫాబాద్, ఖానాపూర్, బోత్ నియోజవర్గ సిట్టింగ్ ఎమ్మెల్యేలకు దక్కలేదు. గతంలో తమ తమ నియోజకవర్గాల్లో జరిగే కార్యక్రమాలు తమ కనుసనల్లోనే జరగాలని, ఏ కార్యక్రమం కూడా తమ తెలియకుండా జరగరాదని అధికారులకు ఎమ్మెల్యేలు సూచించేవారు.

ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారింది. ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో జరిగే కార్యక్రమాలకు హాజరు కావడం లేదు. బుధవారం పది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నియోజవర్గంలోని పలు ప్రాంతాల్లో పాత ఇండ్లు కూలిపోగా, కొన్ని ప్రాంతాల్లో పంట నష్టం కూడా జరిగింది, ఖానాపూర్ నియోజకవర్గంలోని కడం ప్రాజెక్టు గేట్ నెంబర్ 15 రూప్ వైర్ తెగింది. ఇలాంటి సందర్భంలో కూడా ఎమ్మెల్యేలు దూరంగా ఉండడాన్ని ప్రజలు గమనిస్తున్నారు.

కేటీఆర్ బుజ్జగింపు లేకనే పార్టీకి దూరం...

మొదటి జాబితా విడుదల చేసిన తర్వాత తమకు సీటు లభించక పోగా ఎలాంటి బుజ్జగింపు దక్కలేదని టిక్కెట్టు దక్కని ఎమ్మెల్యేలు రేఖా నాయక్, రాథోడ్ బాపురావు, ఆత్రం సక్కులు పార్టీ కార్యక్రమంలో దూరంగా ఉంటున్నట్లు తెలుస్తుంది. జాబితా విడుదల చేసిన రోజు నుంచి పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటన నిమిత్తం 15 రోజులుగా అందుబాటులో లేరు.

ఈ క్రమంలో సీటు రాకపోయినా కేటీఆర్ వచ్చేంతవరకు నియోజవర్గాల్లో సానుభూతి చేపట్టేందుకు ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్, బూత్ ఎమ్మెల్యే బాబురావు, ఆసిఫాబాద్ ఎంమ్మెల్యే ఆత్రం సక్కు లు వారి వారి నియోజకవర్గాల్లో విస్తృతంగానే పర్యటించారు. విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన మంత్రి కేటీఆర్ సీటు దక్కని ఎమ్మెల్యేలకు ఎలాంటి ఫోన్ చేయలేదు. ఎవరితో కనీసం మాట్లాడలేదు.

పార్టీ మారుతామని సంకేతాలు వచ్చినా మంత్రి కేటీఆర్ స్పందించలేదని పార్టీలో తమకు విలువ లేదని నిజంగానే పార్టీ మారెందుకు చర్యకు పూనుకున్నారు. ఈ క్రమంలోని ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుతో పాటు తాము కాంగ్రెస్‌లో చేరుతామని ఢిల్లీ ప్రయాణమైన టు తెలుస్తుంది. రహస్యంగా మతనాలు జరుపుకొని ఎలాగైనా సీటు తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

ఉమ్మడి జిల్లాలో జిల్లాలో గత కొన్ని రోజులుగా విస్తృతంగా వర్షాలు కురుస్తున్నందున వివిధ ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరుతుంది. ఈ క్రమంలో కడం ప్రాజెక్టు వాటర్ ను విడుదల చేసేందుకు గేట్ నెంబర్ 15 పైకి లేపే క్రమంలో రోప్ వైరు తెగి ప్రమాదానికి గురైంది. ఈ సంఘటనను పరిశీలించడానికి పక్క నియోజకవర్గ మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్ రావు ప్రాజెక్టు స్థలానికి వచ్చారు.గురువారం కడెం ప్రాజెక్టును పరిశీలించి అధికారులను వివరాలి అడిగి తెలుసుకున్నారు. గేట్లకు మరమ్మతులు వెంటనే చేపట్టి మీరు వృధా కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

రిపోర్టర్ : కామోజీ వేణుగోపాల్, ఆదిలాబాద్

తదుపరి వ్యాసం