తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Advocate General : తెలంగాణ అడ్వొకేట్ జనరల్ గా సుదర్శన్ రెడ్డి - ఉత్తర్వులు జారీ

TS Advocate General : తెలంగాణ అడ్వొకేట్ జనరల్ గా సుదర్శన్ రెడ్డి - ఉత్తర్వులు జారీ

31 December 2023, 7:08 IST

    • Telangana Advocate General : తెలంగాణ రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ గా సుదర్శన్ రెడ్డిని నియమించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ మేరకు శనివారం ఉత్తర్వులను జారీ చేసింది. 
అడ్వొకేట్ జనరల్ గా సుదర్శన్ రెడ్డి
అడ్వొకేట్ జనరల్ గా సుదర్శన్ రెడ్డి

అడ్వొకేట్ జనరల్ గా సుదర్శన్ రెడ్డి

Telangana Advocate General : రాష్ట్ర అడ్వొకేట్‌ జనరల్‌గా సీనియర్‌ న్యాయవాది ఎ.సుదర్శన్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు శనివారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర హైకోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగానూ పనిచేశారు. సివిల్, క్రిమినల్ కేసుల్లో ప్రముఖ న్యాయవాదిగా పేరొందిన సుదర్శన్ రెడ్డి…. 2011-2014 మధ్య కాలంలో(కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో) ఉమ్మడి రాష్ట్ర హైకోర్టు చివరి అడ్వొకేట్‌ జనరల్‌గా కూడా సేవలందించారు. ఇయన 1985లో బార్‌ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకొని న్యాయవాది వృత్తిని ప్రారంభించారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన తొలి ఏజీగా గుర్తింపు పొందిన సుదర్శన్ రెడ్డిని… మరోసారి రాష్ట్ర ప్రభుత్వం ఏజీగా నియమించింది.

ట్రెండింగ్ వార్తలు

IRCTC Tamilnadu Tour Package : 6 రోజుల్లో తమిళనాడులోని ప్రముఖ దేవాలయాల సందర్శన, హైదరాబాద్ నుంచి ఐఆర్సీటీసీ టూర్ ప్యాకేజీ

Medak Crime News : దారుణం.. బెట్టింగ్‌ ఆడుతున్నాడని కుమారుడిని రాడుతో కొట్టి చంపిన తండ్రి

TS EAPCET 2024 Key : తెలంగాణ ఎంసెట్ అప్డేట్స్ - ఇంజినీరింగ్ స్ట్రీమ్ 'కీ' కూడా వచ్చేసింది, ఇదిగో డైరెక్ట్ లింక్

Indian students dead in US : జలపాతంలో మునిగి...! అమెరికాలో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి

తెలంగాణ ఏర్పాటు తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది. ఆ సమయంలో తన ఏజీ పదవికి రాజీనామా చేశారు సుదర్శన్ రెడ్డి. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం…. మరోసారి ఆయన్ను ఏజీగా నియమించింది. సుదర్శన్ రెడ్డిది జగిత్యాల జిల్లా సారంగాపూర్‌ మండలం రేచుపల్లి గ్రామం. హైదరాబాద్‌ సెయింట్‌ పాల్స్‌ స్కూలులో స్కూల్ ఎడ్యుకేషన్ పూర్తి చేయగా… నిజాం కాలేజీలో డిగ్రీ చదివారు. ఈ సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి(మాజీ సీఎం) క్లాస్ మేట్ గా ఉన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు సుదర్శన్ రెడ్డి. 1985 నుంచి ప్రాక్టిస్ ను మొదలుపెట్టారు.

తదుపరి వ్యాసం