తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Rera : ప్రీ లాంచింగ్ పేరుతో ప్లాట్ల అమ్మకాలు... 5 రియల్ ఎస్టేట్ సంస్థలకు 'రెరా' నోటీసులు

Telangana RERA : ప్రీ లాంచింగ్ పేరుతో ప్లాట్ల అమ్మకాలు... 5 రియల్ ఎస్టేట్ సంస్థలకు 'రెరా' నోటీసులు

24 August 2023, 21:01 IST

    • Telangana RERA: ఐదు రియల్ ఎస్టేట్ సంస్థలకు  తెలంగాణ 'రెరా' నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
తెలంగాణ రెరా
తెలంగాణ రెరా

తెలంగాణ రెరా

Telangana RERA Latest News: ఐదు రియల్ ఎస్టేట్ సంస్థలకు నోటీసులు జారీ చేసింది రెరా(రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ). ప్రీ లాంచింగ్ పేరుతో ప్లాట్ల అమ్మకాలు చేయడం, అనుమతి లేకుండా అదనపు నిర్మాణాలు చేపట్టడం సరికాదని తేల్చి చెప్పింది. రెరా రిజిస్ట్రేషన్ లేకుండా ప్లాట్ల విక్రయాలు చేస్తున్న రియల్ ఎస్టేట్ సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఆయా సంస్థలు 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది.

ట్రెండింగ్ వార్తలు

Pet Dog Attacked Infant : పెంపుడు కుక్క దాడిలో 5 నెలల పసికందు మృతి, రష్మి వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్!

Medak Crime : భర్తను వదిలి ప్రియుడితో సహజీవనం- పిల్లలు గుర్తొచ్చి మహిళ ఆత్మహత్య

Mahabubabad Crime : మంత్రాల నెపంతో దంపతులపై దాడి, మహబూబాబాద్ జిల్లాలో తరచూ దారుణాలు!

Mlc Kavitha Remand : దిల్లీ లిక్కర్ కేసులో కవితకు మళ్లీ షాక్, మే 20 వరకు రిమాండ్ పొడిగింపు

ఐదు సంస్థలు ఇవే:

-భువన తేజ ఇన్ఫ్రా,

-రాధే గ్రూప్ రియల్ ఎస్టేట్స్

-టీఎంఆర్ సంస్థ

-ఓం శ్రీ బిల్డర్లు డెవలపర్స్‌

-సువర్ణ భూమి ఇన్ఫ్రా డెవలపర్స్ కంపెనీలు రెరా నోటీసులు అందుకున్న వాటిల్లో ఉన్నాయి. రెరా నిబంధనలు పాటించని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులపై చర్యలు తప్పవని తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఎన్. సత్యనారాయణ హెచ్చరిచారు. ప్రీలాంచ్ ఆఫర్ల పేరుతో మోసాలు జరుగుతున్న నేపథ్యంలో రెరాలో నమోదు చేసుకున్న రియల్ ప్రాజెక్టుల్లో మాత్రమే ఇళ్లను కొనుగోలు చేయాలని కొనుగోలుదారులకు సూచించారు.

కేంద్రం స్థిరాస్థి నియంత్రణ ప్రాధికార సంస్థ (RERA: రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ) చట్టాన్ని 2017లో తీసుకొచ్చింది. రియల్ ఎస్టేట్ మోసాలను అరికట్టి కొనుగోలుదారులకు రక్షణ కల్పించేందుకు కేంద్రం ఈ చట్టం తెచ్చింది. ఈ చట్టం ఆధారంగా రాష్ట్రాలు చట్టం చేసి కట్టుదిట్టంగా అమలు చేస్తున్నాయి. ఇది ఇంటి కొనుగోలుదారులకు భద్రత కల్పించడంతో పాటు రియల్ ఎస్టేట్ పెట్టుబడులను కూడా ప్రోత్సహిస్తుంది.

RERA రక్షణ నిబంధనలు ఇలా..

500 చదరపు మీటర్లు, ఆపై విస్తీర్ణం గల స్థలంలో భవన నిర్మాణాలకు RERA గుర్తింపు తప్పనిసరి. అంటే సదరు ప్రతి ప్రాజెక్టును రెరా పరిధిలో నమోదు చేసుకోవాలి.

ప్రాజెక్టు మూలధన వివరాలు, భవన నిర్మాణ ప్రణాళిక, స్థల పత్రాలు, అనుభవం తదితర వివరాలు రెరా దరఖాస్తుతో పాటు సమర్పించాలి.

నిర్మాణానికి సహకరించే నిపుణుల వివరాలను కూడా దరఖాస్తుతో పాటు జత పరచాలి.

ఫ్లాటు బుకింగ్ కోసం ఫ్లాటు విలువలో పది శాతం కంటే ఎక్కువగా వసూలు చేయరాదు.

ప్రతి మూడు నెలలకోసారి నిర్మాణ ఖర్చులను రెరా సంస్థకు తెలియపరచాలి. కొనుగోలుదారుల నుంచి వసూలు చేసిన సొమ్మును ప్రత్యేక ఖాతాలో జమచేసి దాని నుంచి నిర్మాణ అవసరాలకు మాత్రమే వినియోగించాలి. ఒక ప్రాజెక్టు కోసం తీసుకున్న సొమ్మును ఇంకో ప్రాజెక్టు కోసం వినియోగించడం సాధ్యపడదు.

ఒప్పంద పత్రంలో ఫ్లాటు డెలివరీ తేదీ, వసతులు, సేవలు ప్రస్తావించాలి. దానికి అనుగుణంగానే బిల్డర్ సేవలు అందించాలి.

ప్లాన్‌లో ఎలాంటి మార్పులు చోటు చేసుకున్నా వినియోగదారుడికి ముందస్తుగా తెలియపరచాలి.

500 చదరపు మీటర్లలోపు విస్తీర్ణం గల స్థలంలో చేపట్టే భవనాలకు రెరా నుంచి మినహాయింపు ఉంటుంది. కేవలం 8 ఫ్లాట్లు మాత్రమే ఉండే భవనాలకు రెరా వర్తించదు.

తదుపరి వ్యాసం