తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Rera : 'రెరా' కొరడా... మరో 3 రియల్ ఎస్టేట్ సంస్థలకు నోటీసులు, డెడ్ లైన్ విధింపు

TS RERA : 'రెరా' కొరడా... మరో 3 రియల్ ఎస్టేట్ సంస్థలకు నోటీసులు, డెడ్ లైన్ విధింపు

05 September 2023, 13:44 IST

    • Telangana RERA: రాష్ట్రంలోని మరో మూడు రియల్ ఎస్టేట్ సంస్థలకు తెలంగాణ 'రెరా' నోటీసులు జారీ చేసింది. 15 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.
తెలంగాణ రెరా నోటీసులు
తెలంగాణ రెరా నోటీసులు

తెలంగాణ రెరా నోటీసులు

Telangana RERA Latest News: గత కొద్దిరోజులుగా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ(రెరా) దూకుడు పెంచింది. అనుమతులు లేకుండా లేదా రెరా నిబంధనలు ఉల్లంఘిస్తున్న పలు రియలస్ ఎస్టేట్ సంస్థలపై కొరడా ఝలిపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా రాష్ట్రంలోని మరో మూడు రియల్ ఎస్టేట్ సంస్థలకు కూడా నోటీసీలు ఇచ్చింది. ‘స్వర్గసీమ’ సంస్థ సహా మూడు ప్రాజెక్టులకు రెరా షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. నిబంధనల ఉల్లంఘనపై 15 రోజుల్లోగా సంజయిషీ ఇవ్వాలని ఆదేశించింది.

ట్రెండింగ్ వార్తలు

TS CPGET 2024 : టీఎస్ సీపీగెట్ నోటిఫికేషన్ విడుదల, మే 18 నుంచి అప్లికేషన్లు ప్రారంభం

Road Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు- ఆరుగురు మృతి, 14 మందికి గాయాలు

Mutton Bone Stuck : పెళ్లి విందులో మటన్ బోన్ మింగేసిన వృద్ధుడు, శస్త్ర చికిత్స చేసి తొలగించిన వైద్యులు

Farmers Protest : అకాల వర్షాలకు తడిసి ముద్దైన వడ్లు, పలు జిల్లాల్లో రోడ్డెక్కిన రైతన్నలు

రెరా అనుమతులు లేకుండానే షాద్‌నగర్‌ సమీపంలోని చెరుకుపల్లి, కొందుర్గులో స్వర్గసీమ శాండల్‌ ఉడ్‌ ఫార్మ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, స్వర్గసీమ సుకేతన పేరుతో నివాస ప్లాట్లు విక్రయించేందుకు పత్రికలు, ఎలక్ట్రానిక్‌ మీడియా ద్వారా ప్రచారం చేపట్టడంపై రెరా సీరియల్ అయింది. ఈ మేరకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసింది. మాదాపూర్‌లోని సాలార్‌పురియా సత్వా నాలెడ్జ్‌ పారులోని జేఎల్‌ఎల్‌ నిర్మాణ సంస్థలకు కూడా నోటీసులు జారీ అయ్యాయి. మహేశ్వరం, తుకాపూర్‌ గ్రామం, శ్రీనగర్‌ ప్రాంతాల్లో కాంస్టెల్లా రియల్‌ ఎస్టేట్‌ సంస్థలకు తాఖీదులు జారీ అయ్యాయి.

రెరా అనుమతి లేకుండా ప్లాట్ల విక్రయాలు చేపట్టిన 3 స్థిరాస్తి సంస్థలకు కొద్దిరోజుల కిందటే రెరా నోటీసులు జారీచేసింది. ఇందులో హైదరాబాద్‌లోని నాని డెవలపర్స్‌ (ఆలేరు, యాదాద్రిలో లక్ష్మీనరసింహ కంట్రీ-3 వెంచర్లు), ఖైరతాబాద్‌లోని ఆర్నా ఇన్‌ఫ్రా డెవలపర్స్‌ (మహేశ్వరం వద్ద వెంచర్‌), కర్మన్‌ఘాట్‌లోని అష్యూర్డ్‌ ప్రాపర్టీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ (నాగార్జునసాగర్‌ రహదారిలోని చింతపల్లి, శ్రీశైలం మార్గంలోని ఆమనగల్లు ప్రాంతంలో అరణ్య పేరుతో వెంచర్లు) సంస్థలు ఉన్నాయి. ఇదిలా ఉండగానే తాజాగా మరో మూడు సంస్థలకు నోటీసులు జారీ అయ్యాయి.

Telangana State Real Estate Regulatory Authority : ఇటీవలే తెలంగాణ రాష్ట్ర రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) కీలక నిర్ణయం తీసుకుంది. రియల్ ఎస్టేట్ కేసుల సత్వర విచారణకు వర్చువల్‌ విధానానికి శ్రీకారం చుట్టింది. ఇప్పటికే ఈ సేవలను ప్రారంభించింది. సీనియర్‌ సిటిజన్లు, దూరప్రాంతాల వారికి ఇబ్బందులు కలుగుతున్నందున.. వర్చువల్‌ విధానాన్ని ప్రారంభించినట్లు రెరా ఛైర్మన్‌ పేర్కొన్నారు. ఫిర్యాదుదారుల సౌలభ్యం కోసం నూతన టెక్నాలజీతో ఈ విధానాన్ని అమలు చేయనున్నామని వెల్లడించారు. ఫిర్యాదుదారులు ఎక్కడి నుంచైనా వర్చువల్‌ హియరింగ్‌కు హాజరుకావచ్చని స్పష్టం చేశారు.

ఇప్పటివరకూ కేసుల పరిష్కారానికి ఫిర్యాదుదారులు, కక్షిదారులు వ్యక్తిగతంగా రెరా బెంచి ముందు హాజరు కావాల్సి వచ్చేది. ఫలితంగా కక్షిదారులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. వీటన్నింటిని దృష్టిలో ఉంచుకున్న రెరా... ఈ దిశగా నిర్ణయం తీసుకుంది.

తదుపరి వ్యాసం