తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bjp Vs Trs : కేసీఆర్ ప్లాన్ 'ఏ' లేదా 'బీ'.. మరి బీజేపీ ప్లాన్ 'సీ'తో వస్తే..?

BJP Vs TRS : కేసీఆర్ ప్లాన్ 'ఏ' లేదా 'బీ'.. మరి బీజేపీ ప్లాన్ 'సీ'తో వస్తే..?

Anand Sai HT Telugu

25 July 2022, 14:49 IST

    • తెలంగాణ రాజకీయాల్లో కేసీఆర్ వర్సెస్ బీజేపీ రాజకీయం రోజురోజుకు కాక రేపుతోంది. ఎప్పుడు ఎలాంటి డెసిషన్స్ బయటకు వస్తాయో తెలియదు. అయితే కిందటి ఎన్నికల మాదిరి.. కేసీఆర్ ముందస్తుకు వెళ్తారా? అనేది ఎవరి ఆలోచనకు అందట్లేదు. ఏమో చెప్పలేం.. అనే సమాధానాలే వస్తున్నాయి.
కేసీఆర్ వర్సెస్ బీజేపీ
కేసీఆర్ వర్సెస్ బీజేపీ

కేసీఆర్ వర్సెస్ బీజేపీ

కేసీఆర్ ఆలోచన ఎవరికీ అంత ఈజీగా అర్థంకాదు. పక్కనున్న వాళ్లకే.. ఆయన వేసే నెక్ట్స్ స్టెప్ ఏంటని.. తెలియదు. జనంనాడి తెలిసిన నేత ఆయన. ఏం చేయాలో.. ఎప్పుడు చేయాలో.. ప్రత్యర్థులను ఎలా కట్టడి చేయాలో బాగా తెలుసు. కానీ కొన్ని రోజులుగా పరిస్థితి అలానే ఉందా? దీనికి సమాధానం కూడా చాలామంది నుంచి ఏమో అనే వినిపిస్తుంది. ఎందుకంటే.. పరిస్థితులు మారుతున్నాయి. మరోవైపు.. సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా బీజేపీలోకి వెళ్తున్నారనే.. ప్రచారంతో ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి. అయితే కేసీఆర్ ప్లాన్-ఏ లేదా ప్లాన్-బీ అమలు చేస్తారు. కానీ బీజేపీ ప్లాన్-సీతో వస్తేనే అసలు సమస్య.

ట్రెండింగ్ వార్తలు

10 Years Telangana: ఉమ్మడి రాజధాని గడువు మరో పక్షం రోజులే.. జూన్‌2 తర్వాత ఆస్తుల స్వాధీనం చేసుకోవాలని సిఎం రేవంత్ ఆదేశం

BRS RakeshReddy: బీఆర్ఎస్ లో 'రాకేశ్ రెడ్డి' పంచాయితీ!కోఆర్డినేషన్ మీటింగ్‌ కు ముఖ్య నేతలంతా డుమ్మా

TS CPGET 2024 : టీఎస్ సీపీగెట్ నోటిఫికేషన్ విడుదల, మే 18 నుంచి అప్లికేషన్లు ప్రారంభం

Road Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు- ఆరుగురు మృతి, 14 మందికి గాయాలు

ఇప్పటికే కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బీజేపీ వైపు చూస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయనతో రాజీనామా చేయించి ఉపఎన్నికకు సిద్ధం చేయాలని బీజేపీ అనుకుంటుందనే వార్తలు కూడా వస్తున్నాయి. కానీ నిజంగా బీజేపీ ఉపఎన్నిక కోరుకుంటుందా? సాఫీగా పని సాగిపోవాలనే ఆలోచనే ఉంటుందేమో బీజేపీకి. ఇతర రాష్ట్రాల్లో చూసినా అంతే. అయితే కోమటిరెడ్డి.. ఒకవేళ చేరితో ఈ విషయంపై క్లారిటీ వస్తుంది. ఉపఎన్నిక ప్రజల కోరుకుంటే వస్తుందనేది ఆయన కామెంట్.

ఆ విషయం పక్కనపెడితే.. కిందటిసారి ముందస్తు ఎన్నికలు వెళ్లారు కేసీఆర్. 2018లో ముందుగానే అసెంబ్లీ రద్దు చేసి.. ప్రజా ఆశీర్వాదం కోసం జనం దగ్గరకు పోయారు. నిజానికి ఆ సమయంలో కేసీఆర్ ఒంటిచెత్తో ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారు. కేసీఆర్ ను చూసే.. జనం ఓట్లు వేశారనే అభిప్రాయాలూ ఉన్నాయి. అధికారంలోకి వచ్చేశారు. అయితే జనరల్ ఎలక్షన్స్ తోపాటు జరగడం కంటే.. ముందుగా ఎన్నికలకు వెళ్తేనే.. లాభం అనేది కేసీఆర్ ఆలోచన అని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు ముందస్తుకు వెళ్తే.. కుదురుతుందా? అనే ప్రశ్నలు వస్తున్నాయి.

ఈసారి కూడా.. కేసీఆర్ ను చూసే ఓట్లు వేసే పరిస్థితి వచ్చిందనే అభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత అక్కడక్కడా కనిపిస్తోంది. అయితే సార్వత్రిక ఎన్నికలతోపాటు జరిగితే.. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఎమ్మెల్యేల రిపోర్ట్ ఇప్పటికే.. కేసీఆర్ తెప్పించుకునే ఉంటారు. అయితే వ్యతిరేకత ఉన్న వారికి టికెట్లు కేటాయిస్తారా? ఒకవేళ వారికి ఇవ్వకుంటే వాళ్లంతా బీజేపీలోకి వెళ్తారా? ఇలాంటి ప్రశ్నలు మెుదలవుతున్నాయి. వెళ్లినా.. కేసీఆర్ పెద్దగా పట్టించుకోరనే అభిప్రాయం ఉంది. ప్రజా వ్యతిరేకత ఉన్నవాళ్లు.. బీజేపీలోకి వెళ్తే.. కేసీఆర్ కే కలిసొచ్చే అంశం. అయితే ముందస్తుకు వెళ్లినా ప్రమాదమే.

ఇటీవలే మీడియా సమావేశంలో డైరెక్ట్ గా చేప్పేశారు కేసీఆర్. ఎన్నికలకు మేం రెడీ.. మీరు రెడీనా అని కేంద్రానికి సవాల్ విసిరారు. సమయం గడుస్తున్న కొద్దీ.. ప్రభుత్వ వ్యతిరేకత పెరిగి.. బీజేపీ బలపడే అవకాశం ఉంది.

ఒకవేళ కేసీఆర్ ప్లాన్ ఏ ప్రకారం.. అసెంబ్లీ రద్దు చేసి.. ముందస్తు ఎన్నికలకు వెళ్తే.. పెద్ద చిక్కుల్లో పడే అవకాశం ఉందనే అభిప్రాయాలు ఉన్నాయి. లేదా ప్లాన్ బీ ప్రకారం.. జనరల్ ఎలక్షన్స్ తో పాటుగా.. తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు వస్తే.. అది కూడా సమస్యే అని విశ్లేషకులు అంటున్నారు. అప్పటి వరకూ బీజేపీ పుంజుకునేందుకు అన్ని వైపులా ప్రయత్నాలు చేస్తుంది. అయితే కేసీఆర్ ప్లాన్ ఏ ప్రకారం.. అసెంబ్లీని రద్దు చేస్తే.. బీజేపీ ప్లాన్ 'సీ'తో వస్తే టీఆర్ఎస్ చాలా ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుందంటున్నారు విశ్లేషకులు.

అసెంబ్లీ రద్దు చేస్తే.. బీజేపీ ప్లాన్ ప్రకారం రాష్ట్రపతి పాలన పెట్టేస్తే.. అప్పుడు పరిస్థితి ఏంటనే ప్రశ్నలు వస్తున్నాయి. రాష్ట్రపతి పాలనతో ఈజీగా బీజేపీ పై చేయి సాధిస్తుంది. టీఆర్ఎస్ ను ఎక్కడికక్కడ కట్టడి చేయగలదు. దీంతో పెద్ద దెబ్బే పడుతుందనే అభిప్రాయాలు ఉన్నాయి. కానీ సార్వత్రిక ఎన్నికల వరకూ వెయిట్ చేస్తే.. అప్పటి పరిస్థితి కూడా మరోలా ఉంటుంది. ఎంతోకొంత బీజేపీ బలపడుతుంది. సో.. ఏం జరుగుతుందో చూస్తూ లెక్కలు వేసుకోవడమే.. ఎందుకంటే.. కేసీఆర్ నిర్ణయాలు ఎలా ఉంటాయో ఎవరికీ అంత తేలిగ్గా అర్థంకావు. బీజేపీ ఎలాంటి స్టెప్స్ వేస్తుందో.. చివరి వరకూ తెలియదు.

తదుపరి వ్యాసం