తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Revanth Reddy House Arrest : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్

Revanth Reddy House Arrest : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్

HT Telugu Desk HT Telugu

02 January 2023, 11:18 IST

    • Revanth Reddy House Arrest తెలంగాణ పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గ్రామ పంచాయితీలకు నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి నిరసిస్తూ తెలంగాణ పీసీసీ ఆధ్వర్యంలో  ఇందిరాపార్క్ వద్ద ధర్నాకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది. దీంతో ముందస్తుగా పోలీసులు రేవంత్ రెడ్డిని గృహనిర్భంధం చేశారు.   మరోవైపు పోలీసులు అడ్డుకున్నా ఆందోళనలు కొనసాగిస్తామని  కాంగ్రెస్‌ నేతలు ప్రకటించారు. 
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్‌
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్‌

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్‌

Revanth Reddy House Arrest సర్పంచుల నిధుల కోసం ఆందోళనకు పిలుపునిచ్చిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ధర్నా చౌక్ వద్ద సర్పంచుల నిధుల సమస్యలపై రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ ఆధ్వర్యంలో ధర్నా తలపెట్టడంతో రేవంత్‌ రెడ్డిని పోలీసులు గృహనిర్భంధంలో ఉంచారు. సమస్యల పరిష్కారం కోసం ధర్నా చౌక్‌తో పాటు తెలంగాణ వ్యాప్తంగా ఆందోళన చేస్తామని టీపీసీసీ ప్రకటించింది.

ట్రెండింగ్ వార్తలు

Hyderabad Real Estate Scam: హైదరాబాద్ లో మరో ప్రీ లాంచ్ రియల్ ఎస్టేట్ స్కామ్, రూ.60 కోట్లు వసూలు చేసిన భారతి బిల్డర్స్

Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలు పని వేళల్లో మార్పులు, అధికారుల క్లారిటీ!

Love Fraud : : కి'లేడి' ప్రేమపేరుతో మోసం-ప్రియుడు ఆత్మహత్యాయత్నం

Mallareddy Land Issue : సుచిత్రలో భూవివాదం- అల్లుడు, అనుచరులతో కలిసి మల్లారెడ్డి హల్ చల్-ఆపై అరెస్ట్!

దీంతో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గ్రామ పంచాయితీలకు నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి నిరసిస్తూ ఇందిరాపార్క్ వద్ద ధర్నాకు కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు రేవంత్ రెడ్డిని గృహనిర్భంధం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నాయకుల ఇంటి వద్ద కూడా పోలీసులు మోహరించారు. వారిని గృహ నిర్బంధం చేశారు. పలు ప్రాంతాల్లో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

తెలంగాణ వ్యాప్తంగా సర్పంచ్ ల ధర్నాకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం, ముందస్తు అరెస్టులకు నిరసనగా జిల్లా, మండల కేంద్రాల్లో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తు నిరసనలు చేపట్టాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.సర్పంచుల నిధుల సమస్యలపై రాజీవ్ గాంధీ పంచాయతీ రాజ్ సంఘటన్ ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద ధర్నాకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే పోలీసులు ముందస్తు అరెస్ట్‌లు చేపట్టారు. రేవంత్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ధర్నా చౌక్ వద్ద నిరసనకు అనుమతి కోసం టీపీసీసీ దరఖాస్తు చేయగా.. పోలీసులు అనుమతి నిరాకరించారు. అనుమతి ఇవ్వకపోయినా ధర్నా నిర్వహించి తీరుతామని కాంగ్రెస్ తేల్చి చెప్పడంతో పోలీసులు గృహ‍ నిర్భందాలు అమలు చేశారు.

తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, కిసాన్ సెల్ నేత కోదండరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, అద్దంకి దయాకర్ డీసీసీ ప్రెసిడెంట్స్ ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.పోలీసుల తీరుపై కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు.

తదుపరి వ్యాసం