తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Tammineni Veerabhadram: తమ్మినేని వీరభద్రానికి గుండెపోటు.. హైదరాబాద్ తరలింపు

Tammineni Veerabhadram: తమ్మినేని వీరభద్రానికి గుండెపోటు.. హైదరాబాద్ తరలింపు

Sarath chandra.B HT Telugu

16 January 2024, 16:02 IST

    • Tammineni Veerabhadram: తెలంగాణ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అస్వస్థతకు గురయ్యారు. ఖమ్మంలో గుండెపోటుకు గురి కావడంతో హుటాహుటిన హైదరాబాద్ తరలించారు. 
తెలంగాణ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
తెలంగాణ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

తెలంగాణ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

Tammineni Veerabhadram: తెలంగాణ సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేనిsa వీరభద్రం గుండె పోటుకు గురయ్యారు. మెరుగైన వైద్యం కోసం తమ్మినేనిని వెంటనే హైదరాబాద్‌కు తరలించారు. హైదరాబాద్‌ ఏఐజీ ఇంటర్నేషనల్‌ ఆస్పత్రిలో తమ్మినేనికి చికిత్స అందిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

TS CPGET 2024 : టీఎస్ సీపీగెట్ నోటిఫికేషన్ విడుదల, మే 18 నుంచి అప్లికేషన్లు ప్రారంభం

Road Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు- ఆరుగురు మృతి, 14 మందికి గాయాలు

Mutton Bone Stuck : పెళ్లి విందులో మటన్ బోన్ మింగేసిన వృద్ధుడు, శస్త్ర చికిత్స చేసి తొలగించిన వైద్యులు

Farmers Protest : అకాల వర్షాలకు తడిసి ముద్దైన వడ్లు, పలు జిల్లాల్లో రోడ్డెక్కిన రైతన్నలు

గతంలోనే తమ్మినేనికి హార్ట్‌ స్ట్రోక్‌ రావడంతో స్టంట్‌ కూడా వేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. సీపీఎం నాయకుడు తమ్మినేని వీరభద్రం మంగళవారం గుండె పోటు కారణంగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.

తన స్వగ్రామం తెల్దారపల్లిలో ఉన్న సమయంలోనే తమ్మినేని అస్వస్థతకు గురయ్యారు. సోమవారం నుంచి తమ్మినేనికి నలతగా ఉండటంతో స్థానికంగా ఉన్న ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.

లంగ్స్‌ ఇన్ఫ్‌క్షన్‌తో పాటు మైల్డ్‌ హార్ట్‌ స్ట్రోక్‌ లక్షణాలను వైద్యులు గుర్తించారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు రిఫర్‌ చేశారు.ఆ వెంటనే అంబులెన్స్‌లో తమ్మినేనిని వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. గతంలో తమ్మినేనికి స్ట్రోక్‌ వచ్చిన నేపథ్యంలో అప్పుడు ఆయనకు వైద్యులు స్టంట్‌ వేశారు. తాజాగా మరోసారి మైల్డ్‌ స్ట్రోక్‌ రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.

తమ్మినేని వీరభద్రంను హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి.

తదుపరి వ్యాసం