తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Congress Mla : ముర్ముకు ఓటేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క

Telangana Congress MLA : ముర్ముకు ఓటేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క

HT Telugu Desk HT Telugu

18 July 2022, 12:54 IST

    • తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ముకు ఓటేశారు.  బ్యాలెట్‌ పేపర్‌పై ప్రాధాన్యత నమోదు చేసిన  చేసిన పొరపాటు గుర్తించి అధికారుల్ని ఆశ్రయించారు.  పొరపాటు నమోదుకు తాము ఏమి చేయలేమని అధికారులు చెప్పడం బ్యాలెట్‌ పేపర్‌ను బాక్సులో వేయకుండానే వెనుదిరిగారు. 
రాష్ట్రపతి ఎన్నికల్లో సీతక్క పొరపాటు
రాష్ట్రపతి ఎన్నికల్లో సీతక్క పొరపాటు (Twitter)

రాష్ట్రపతి ఎన్నికల్లో సీతక్క పొరపాటు

రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే సీతక్క పొరపాటుగా ఎన్డీఏ అభ్యర్ధి ద్రౌపది ముర్ముకు ప్రాధాన్యత ఓటు వేశారు. బ్యాలెట్ బాక్సులో బ్యాలెట్ పత్రాన్ని వేసే ముందు చేసిన పొరపాటు గుర్తించి మరో పేపర్ ఇవ్వాలని అధికారుల్ని కోరారు. తాను చేసిన పొరపాటును కాంగ్రెస్ పార్టీ పోలింగ్ ఏజెంట్ మహేశ్వర్ రెడ్డికి వివరించారు. మరో బ్యాలెట్ పేపర్‌ ఇచ్చే అవకాశం లేదని అధికారులు ఎమ్మెల్యేకు స్పష్టం చేయడంతో తన బ్యాాలెట్ పేపర్‌ను బాక్సులో వేయకుండానే ఎమ్మెల్యే వెనుదిరిగారు.

ట్రెండింగ్ వార్తలు

TS Cabinet Meeting : తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి, కానీ!

TS TET 2024 Exams : రేపట్నుంచే తెలంగాణ టెట్ పరీక్షలు- ఎగ్జామ్ షెడ్యూల్, అభ్యర్థులకు మార్గదర్శకాలివే!

TG ITI Admissions 2024 : టెన్త్ విద్యార్థులకు అలర్ట్... ఐటీఐ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల, ముఖ్య తేదీలివే

Food Inspection in Hyderabad : పాడైపోయిన ఆహార పదార్థాలు, పాటించని ప్రమాణాలు - తనిఖీల్లో విస్తుపోయే విషయాలు..!

ద్రౌపది ముర్ముకు పొరపాటున ఓటేశానని చెప్పిన ఎమ్మెల్యే సీతక్క మరో అవకాశం ఇవ్వాలని అధికారులను కోరారు. నిబంధనల ప్రకారం ఒకరికి ఒక బ్యాలెట్ పేపర్‌ మాత్రమే ఇస్తారని, మరో పేపర్‌ ఇచ్చే అవకాశం లేదని అధికారులు తేల్చి చెప్పడంతో సీతక్క నిరాశగా వెనుకదిరిగారు. బ్యాలెట్ పేపర్‌ ఇచ్చే విషయంలో అధికారుల తీరుపై కాంగ్రెస్‌ పార్టీ నేతలు అభ్యంతరం తెలిపారు. మరోవైపు సీతక్క ఓటు వ్యవహారం కాంగ్రెస్‌ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసే సమయంలో అప్రమత్తంగా ఉండాల్సింది పోయి నిర్లక్ష్యంగా ఎలా ఓటు నమోదు చేస్తారని చర్చ జరుగుతోంది. పొరపాటున ముర్ముకు ఓటు నమోదు చేశారా, మరేదైనా కారణాలు ఉన్నాయా అనే చర్చ సాగుతోంది.

కాంగ్రెస్ పార్టీ నేతల అభ్యంతరాల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణలో పాల్గొంటున్న అధికారులు సమస్యను కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లారు. మరోవైపు తెలంగాణ అసెంబ్లీలో జరుగుతున్న రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార టిఆర్‌ఎస్‌తో పాటు కాంగ్రెస్‌ పార్టీ కూడా విపక్షాలు బలపరిచిన యశ్వంత్ సిన్హా అభ్యర్ధిత్వానికి మద్దతు ఇస్తున్నాయి ఈ నేపథ్యంలో సీతక్క తన ఓటును యశ్వంత్ సిన్హాకు ఓటు వేయాల్సి ఉండగా ద్రౌపది ముర్ముకు ఓటు వేసినట్లు చెబుతున్నారు.

పోలింగ్‌ అధికారులు మరో బ్యాలెట్ పత్రాన్ని ఇచ్చేందుకు అధికారులు నిరాకరించడంతో అదే పత్రాన్ని సీతక్క బ్యాలెట్ బాక్సులో వేయాల్సి వచ్చింది. ద్రౌపది ముర్ముకు ఓటు వేసినట్లు వచ్చిన వార్తల్ని ఆమె తోసిపుచ్చారు. తాము అనుకున్న వారికే ఓటు వేశానని ప్రకటించారు. బ్యాలెట్ పేపర్‌పై పెన్ను గీతలు పడటంతో మరో పేపర్ ఇవ్వాలని కోరానని చెప్పారు. పార్టీ ప్రతిపాదించిన అభ్యర్ధికి కాకుండా మరో అభ్యర్ధికి ఓటు వేశాననే వార్తల్ని ఆమె ఖండించారు. ప్రాధాన్యత నమోదు చేయడంలో ఎలాంటి పొరపాటు చేయలేదని తన ఓటు చెల్లుబాటు అవుతుందో లేదో అనే అనుమానంతో మరో పత్రాన్ని ఇవ్వాలని కోరానని, నిబంధనలు అంగీకరించవని చెప్పడంతో అదే పత్రాన్ని బ్యాలెట్ బాక్సులో వేసినట్లు చెప్పారు.

టాపిక్

తదుపరి వ్యాసం