తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Police Jobs: ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలు.. సిలబస్, పరీక్ష విధానం తెలుసుకోండి..

Police Jobs: ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలు.. సిలబస్, పరీక్ష విధానం తెలుసుకోండి..

HT Telugu Desk HT Telugu

26 April 2022, 14:02 IST

    • TS Police Recruitment 2022:పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది. 16,614 ఉద్యోగాల భర్తీకి ప్రకటన జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. నోటిఫికేషన్ లో పరీక్షకు సంబంధించిన సిలబస్ వివరాలను www.tslprb.in వెబ్ సైట్ లో పొందవచ్చు.
ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల సిలబస్
ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల సిలబస్

ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల సిలబస్

syllabus for ts police jobs: పోలీసుశాఖలో పలు ఉద్యోగాల భర్తీకి ప్రకటన వెలువడింది. ఇందులో ఎస్ఐ, కానిస్టేబుల్ భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఆయా పోస్టుల ఖాళీలు, రాత పరీక్ష కోసం సిలబస్ ను వెల్లడించింది. సంబంధించిన వివరాలు చూస్తే కింది విధంగా ఉన్నాయి.

ట్రెండింగ్ వార్తలు

TS Cabinet Expansion : సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో మరో ఆరుగురికి ఛాన్స్, ఎవరెవరికి చోటు దక్కనుంది?

Hyderabad Real Estate Scam: హైదరాబాద్ లో మరో ప్రీ లాంచ్ రియల్ ఎస్టేట్ స్కామ్, రూ.60 కోట్లు వసూలు చేసిన భారతి బిల్డర్స్

Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలు పని వేళల్లో మార్పులు, అధికారుల క్లారిటీ!

Love Fraud : : కి'లేడి' ప్రేమపేరుతో మోసం-ప్రియుడు ఆత్మహత్యాయత్నం

ప్రిలిమ్స్, మెయిన్స్

కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ 41ని విడుదల చేసింది రిక్రూట్ మెంట్ బోర్డు. ఇందులో సివిల్‌, ఏఆర్‌, ఎస్‌ఏఆర్‌ సీపీఎల్‌, టీఎస్‌ఎస్పీ, స్పెషల్‌ పోలీసు, అగ్ని మాపక, వార్డర్ ఉద్యోగాలు ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ పరిధిలోని ఉద్యోగాల సంబంధించిన సిలబస్ ను అందుబాటులో ఉంచింది.

మొదటగా ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. ఇందులో 200 ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లీష్‌, అరిథ్‌మెటిక్‌, జనరల్‌సైన్స్‌, భారతదేశ చరిత్ర- సంస్కృతి - జాతీయ ఉద్యమం, భారతదేశ భౌగోళిక స్వరూపం, భారత రాజ్యాంగం, ఎకానమీ, జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలు, రీజినింగ్‌/మెంటల్‌ ఎబిలిటీ, తెలంగాణ రాష్ట్ర అంశాలపై ప్రశ్నలు ఉంటాయి

ప్రిలిమ్స్ తో పాటు ఈవెంట్స్ అర్హత సాధిస్తేనే మెయిన్స్ ఎగ్జామ్స్ రాయటానికి వీలు ఉంటుంది. ఇందులోనూ 200 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ప్రిలిమినరీ సిలబస్‌తో కొన్ని వ్యక్తిత్వంతో పాటు సున్నితమైన అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.

కానిస్టేబుల్‌ (ఐటీ, కమ్యూనికేషన్లు) సాంకేతిక పరిజ్ఞాన రాతపరీక్షలో 200 మార్కులకు 200 ప్రశ్నలు అడుగుతారు. ఇందులో ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్‌-రేడియో, కంప్యూటర్‌ బేసిక్‌, టెలిఫోన్‌ సిస్టమ్‌ సిలబస్‌ నుంచి ప్రశ్నలు వస్తాయి. ఇక కానిస్టేబుల్‌ (మెకానిక్‌) కోసం ప్రిపేర్ అయ్యే వారు..రాతపరీక్షలో 200 మార్కులకు పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఆటోమొబైల్‌ పరిచయం, స్పార్క్‌ ఇగ్నీషియన్‌ ఇంజిన్‌, పెట్రోలతో పాటు ఇతర ఇంధన పరికారలపై ప్రశ్నలు వస్తాయి. కానిస్టేబుల్‌ (డ్రైవర్‌) పోస్టులకు వాహన నిర్వహణ, డ్రైవింగ్‌ విధులు, రోడ్డు చట్టాలు, నిబంధనలు తదితర అంశాలపై 200 ప్రశ్నలు అడుగుతారు.

ఎస్సై ఉద్యోగాలు..మెయిన్స్ లో 4 పేపర్లు

ఇక ఎస్సై ఉద్యోగాల సంబంధించిన నోటిఫికేషన్ నంబర్ 42లో వివరాలను వెల్లడించింది. ఇందులో సివిల్‌, ఏఆర్‌, ఎస్‌ఏఆర్‌ సీపీఎల్‌, టీఎస్‌ఎస్పీ, ఎస్‌పీఎఫ్‌, అగ్నిమాపక, డిప్యూటీ జైలర్‌ కేడర్ పోస్టులు ఉన్నాయి.

ఇందులో మొదటగా ప్రిలిమినరీ పరీక్ష రాయాల్సి ఉంటుంది. 200 ప్రశ్నలు.. 200 మార్కులకు ఉంటాయి. ఈ పరీక్షలో అరిథ్‌మెటిక్‌ రీజినింగ్‌ / మెంటల్‌ ఎబిలిటీపై 100 ప్రశ్నలు, జనరల్‌ స్టడీస్‌పై 100 ప్రశ్నలు ఇస్తారు. జనరల్‌ స్టడీస్‌లో జనరల్‌ సైన్స్‌, జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలు, దేశ చరిత్ర, తెలంగాణ చరిత్ర, జాతీయ ఉద్యమం, సామాజిక, ఆర్థిక, గ్రామీణాభివృద్ధి వంటి పలు అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయియ

మెయిన్స్ పరీక్ష భిన్నంగా ఉంటుంది. ఇందులో మొత్తం 4 పేపర్లు ఉంటాయి. పేపర్ 1 లో ఆంగ్లం ఉంటుంది. 100 మార్కుల్లో భాగంగా ఆబ్జెక్టివ్ తో పాటు డిస్ట్రిప్టివ్ పార్ట్ ఉంటుంది. ఆబ్జెక్టివ్ (50 ప్రశ్నలు 25 మార్కులు), డిస్క్రిప్టివ్‌ (75 మార్కులు) ప్రశ్నలు ఉంటాయి. పదోతరగతి స్థాయి సిలబస్‌ గా ఉంటుంది. అడుగుతారు. డిస్క్రిప్టివ్‌లో లేఖలు రాయడం, నివేదికలు, వ్యాసరూపం వంటి అంశాలు ఉంటాయి. ఇక పేపర్‌-2లో తెలుగుతో పాటు ఉర్దూ భాషా పరిజ్ఞానంపై ప్రశ్నలు ఉండగా.. పేపర్‌-3లో 200 ప్రశ్నలు అరిథ్‌మెటిక్‌, రీజినింగ్‌, మెంటల్‌ ఎబిలిటీల్లో వస్తాయి. 

పేపర్‌-4లో ప్రిలిమ్స్ మాదిరిగానే జీఎస్‌లో.. జనరల్‌ సైన్స్‌, జాతీయ, అంతర్జాతీయ సమకాలీన అంశాలు ఉంటాయి. దేశ చరిత్ర, జాతీయ ఉద్యమం, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, రాజకీయ అంశాలు, దేశ భౌగోళిక స్వరూపం, జాతీయ ఆర్థిక, రాజకీయ వ్యవస్థ, గ్రామీణాభివృద్ధి, ప్రణాళిక-ఆర్థిక సంస్కరణలు, తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు అంశాలతో పాటు వ్యక్తిత్వంపై ప్రశ్నలు వస్తాయి. వ్యక్తిత్వ పరీక్షలో విలువలు, మానసిక సామర్థ్యంతో పాటు సున్నితమైన అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.

 

ఈవెంట్స్(ఫిజికల్ టెస్ట్స్) వివరాల కోసం కింద ఇచ్చిన ఆర్టికల్ లింక్ ను ఓపెన్ చేయండి…

టాపిక్

తదుపరి వ్యాసం