తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Scr Special Trains : 30 ప్రత్యేక రైళ్లు నడపనున్న దక్షిణ మధ్య రైల్వే

SCR Special Trains : 30 ప్రత్యేక రైళ్లు నడపనున్న దక్షిణ మధ్య రైల్వే

HT Telugu Desk HT Telugu

19 July 2022, 17:16 IST

    • దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనుంది. అధిక రద్దీని క్లియర్ చేసేందుకు.. వీక్లీ స్పేషల్ రైళ్లు 30 నడవనున్నాయి.
దక్షిణ మధ్య ప్రత్యేక రైళ్లు
దక్షిణ మధ్య ప్రత్యేక రైళ్లు

దక్షిణ మధ్య ప్రత్యేక రైళ్లు

అదనపు రద్దీని క్లియర్ చేయడానికి, దక్షిణ మధ్య రైల్వే (SCR) హైదరాబాద్-తిరుపతి, కాచిగూడ-నరసాపూర్, నరసపూర్- తిరుపతితో పాటు తిరుపతి-కాచిగూడ మధ్య 30 ప్రత్యేక రైళ్లను నడపనుంది.

ట్రెండింగ్ వార్తలు

BC RJC CET Results 2024 : టీఎస్ బీసీ గురుకుల ఇంటర్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, రేపట్నుంచి కాలేజీల్లో రిపోర్ట్!

Bhongir Fire Accident : పెట్రోల్ బంక్ లో పేలిన లారీ డీజిల్ ట్యాంక్, తప్పిన పెను ప్రమాదం!

Sircilla Crime : పేగు బంధాన్ని తెంచుకున్న పేరెంట్స్, కూతురికి ఉరి వేసి హత్య!

Sundilla Parvathi Barrage : ఖాళీ అయిన సుందిళ్ల పార్వతి బ్యారేజీ, చేపల కోసం ఎగబడ్డ స్థానికులు

హైదరాబాద్-తిరుపతి-హైదరాబాద్

హైదరాబాద్-తిరుపతి, తిరుపతి-హైదరాబాద్‌లను కలిపే రైళ్లు సికింద్రాబాద్, కాచిగూడ, ఉమ్దానగర్, షాద్‌నగర్, జడ్చర్ల, మహబూబ్‌నగర్, వనపర్తి రోడ్, గద్వాల్, కర్నూలు సిటీ, ధోనే, గూటి, తాడిపత్రి, యర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయి. హైదరాబాద్-తిరుపతి(07643) రైలు జులై 25న సోమవారం రాత్రి 07:00 హైదరాబాద్ నుంచి బయలుదేరి... మరుసటి రోజు ఉదయం 10 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. జులై 25 మంగళవారం రోజున తిరుపతి-హైదరాబాద్(07644) తిరుపతి నుంచి మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరుతుంది. తర్వాతి రోజు హైదరాబాద్ చేరుకుంటుంది. ఆగస్టు నెలలలోనూ ఈ ప్రత్యేక రైళ్లు నడుస్తాయి.

కాచిగూడ-నరసాపూర్‌ ప్రత్యేక రైళ్లు (07612)

కాచిగూడ, నరసాపూర్‌లను కలిపే రైలు మల్కాజిగిరి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడే, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, పాలకొల్లు స్టేషన్లలో ఆగుతుంది. కాచిగూడ-నరసాపూర్ రైలు.. జులై 25న కాచిగూడ నుంచి రాత్రి 11 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10:30 గంటలకు నరసాపూర్ చేరుకుంటుంది. ఆగస్టు నెలలలోనూ ఈ ప్రత్యేక రైలు ఉంటుంది.

నరసాపూర్-తిరుపతి(07613)

నరసాపుర్-తిరుపతిలను కలిపే రైలు పాలకొల్లు, వీరవాసరం, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది. నరసాపూర్-తిరుపతి రైలు జులై 26న నర్సాపూర్ నుంచి రాత్రి 8:45కు బయలుదేరుతుంది. మరుసటి రోజు ఉదయం 8 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఈ రైలు కూడా.. ఆగస్టు నెలలో ఉంటుంది.

తిరుపతి-కాచిగూడ(07614)

తిరుపతి నుంచి కాచిగూడ నడిచే రైలు పలు స్టేషన్లలో ఆగుతుంది. రేణిగుంట, రాజంపేట, కడప, ఎర్రగుంట్ల, తాడిపత్రి, గూటి, దోణే, కర్నూల్ సిటీ, గద్వాల్, వనపర్తి రోడ్, జడ్చర్ల, షాద్ నగర్ స్టేషన్లలో స్టాప్ ఉంది. జులై 27 తిరుపతి నుంచి మధ్యాహ్నం 3 గంటలకు బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 4 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. ఇది కూడా ఆగస్టు నెలలో నడుస్తోంది.

తదుపరి వ్యాసం