తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Sankranti Special Trains 2024 : రైల్వే ప్రయాణికులకు అలర్ట్- సంక్రాంతికి మరో 32 ప్రత్యేక రైళ్లు

Sankranti Special Trains 2024 : రైల్వే ప్రయాణికులకు అలర్ట్- సంక్రాంతికి మరో 32 ప్రత్యేక రైళ్లు

02 January 2024, 18:52 IST

    • Sankranti Special Trains 2024 : సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా సౌత్ సెంట్రల్ రైల్వే 32 ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి.
సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు
సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు

సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు

Sankranti Special Trains 2024 : సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే 32 స్పెషల్ ట్రైన్స్ నడుపుతున్నట్లు ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు ఈ రైళ్లు నడపనున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Wardhannapet Govt Hospital : వర్ధన్నపేటలో దారుణం-ఫోన్లో డాక్టర్ డైరెక్షన్ గర్భిణీకి నర్సులు డెలివరీ, శిశువు మృతి

TS Universities VCs : తెలంగాణలో వీసీల నియామకంపై కసరత్తు, 10 యూనివర్సిటీలకు 1382 అప్లికేషన్లు

WhatsApp Triple Talaq : వాట్సాప్ లో భార్యకు ట్రిపుల్ తలాక్, ఆదిలాబాద్ లో వ్యక్తి అరెస్టు

TS Cabinet Meeting : తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి, కానీ!

32 ప్రత్యేక రైళ్లు

  • 1. 07089 -సికింద్రాబాద్ నుంచి బ్రహ్మపూర్ వరకు- జనవరి 7, 14వ తేదీల్లో
  • 2. 07090-బ్రహ్మాపూర్ నుంచి వికారాబాద్ వరకు- జనవరి 8, 15వ తేదీల్లో
  • 3. 07091- వికారాబాద్ నుంచి బ్రహ్మపూర్ వరకు - జనవరి 9, 16వ తేదీల్లో
  • 4. 07092 -బ్రహ్మాపూర్ నుంచి సికింద్రాబాద్ వరకు - జనవరి 10, 17వ తేదీల్లో
  • 5. 08541 - విశాఖపట్నం నుంచి కర్నూలు సిటీ వరకు - జనవరి 10, 17, 24 తేదీల్లో
  • 6.08542-కర్నూల్ సిటీ నుంచి విశాఖపట్నం వరకు - జనవరి 11, 18, 25 తేదీల్లో
  • 7.08547- శ్రీకాకుళం నుంచి వికారాబాద్ వరకు - జనవరి 12, 19, 26 తేదీల్లో
  • 8. 08548-వికారాబాద్ నుంచి శ్రీకాకుళం వరకు - జనవరి 13, 20, 27 తేదీల్లో
  • 9.02764- సికింద్రాబాద్ నుంచి తిరుపతి వరకు -జనవరి 10, 17వ తేదీల్లో
  • 10. 02763-తిరుపతి నుంచి సికింద్రాబాద్ వరకు - జనవరి 11, 18వ తేదీల్లో
  • 11. 07271-సికింద్రాబాద్ - కాకినాడ టౌన్- జనవరి 12వ తేదీన
  • 12. 07272-కాకినాడ టౌన్-సికింద్రాబాద్- జనవరి 13వ తేదీన
  • 13.07093-సికింద్రాబాద్ - బ్రహ్మపూర్- జనవరి 08, 15వ తేదీల్లో
  • 14.07094-బ్రహ్మాపూర్ - సికింద్రాబాద్- జనవరి 09, 16వ తేదీల్లో
  • 15.07251-నర్సాపూర్ - సికింద్రాబాద్- జనవరి 10వ తేదీన
  • 16.07252- సికింద్రాబాద్ - నర్సాపూర్-జనవరి 11వ తేదీన

ఏ స్టేషన్లలో ఆగుతాయంటే?

  • రైలు నం. 07089 / 07090 / 07091/07092 ప్రత్యేక రైళ్లు (08 సర్వీసులు)- ఈ ప్రత్యేక రైళ్లు లింగంపల్లిలో (07090 / 07091 మాత్రమే) ఆగుతాయి. నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి, శ్రీకాకుళం రోడ్డు, పలాస, సోంపేట, ఇచ్ఛాపురం స్టేషన్లలో ఇరుమార్గాల్లో ఆగుతాయి.
  • రైలు నెం. 08541 / 08542 విశాఖపట్నం - కర్నూలు - విశాఖపట్నం స్పెషల్స్ (06 సర్వీసులు)- ఈ ప్రత్యేక రైళ్లు దువ్వాడ, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లె, మిర్యాలగూడ, నల్గొండ,కాచిగూడ, ఉమ్దానగర్ , షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, వనపర్తి రోడ్, గద్వాల్ స్టేషన్లలో ఇరువైపులా ఆగుతాయి.
  • రైలు నెం. 08547 / 08548- శ్రీకాకుళం - వికారాబాద్ - శ్రీకాకుళం స్పెషల్స్ (06 సర్వీసులు) - ఈ ప్రత్యేక రైళ్లు పొందూరు, చీపురుపల్లి, విజయనగరం, కొత్తవలస, పెందుర్తి, సింహాచలం, దువ్వాడ, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, మిర్యాలగూడ, నల్గొండ, సికింద్రాబాద్, బేగంపేట, లింగంపల్లి స్టేషన్లలలో ఇరువైపులా ఆగుతాయి.
  • రైలు నెం. 02764/02763 సికింద్రాబాద్ - తిరుపతి - సికింద్రాబాద్ ప్రత్యేక రైళ్లు (04 సర్వీసులు) - ఈ ప్రత్యేక రైళ్లు జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయి.
  • రైలు నం. 07271- సికింద్రాబాద్ - కాకినాడ టౌన్ ప్రత్యేక రైలు (01 సర్వీసు)- ఈ ప్రత్యేక రైలు జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, రాయనపాడు, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, రాజమండ్రి, సామర్లకోట్ స్టేషన్లలో ఆగుతుంది.
  • రైలు నెం. 07272 కాకినాడ టౌన్ - సికింద్రాబాద్ ప్రత్యేక రైలు (01 సర్వీసు)- ఈ ప్రత్యేక రైలు సామర్లకోట, రాజమండ్రి, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ స్టేషన్లలో ఆగుతాయి.
  • రైలు నెం. 07093/07094- సికింద్రాబాద్-బ్రహ్మాపూర్-సికింద్రాబాద్ ప్రత్యేక రైళ్లు (04 సర్వీసులు) - ఈ ప్రత్యేక రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, పి. అన్నవరం, పి. కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి, శ్రీకాకుళం రోడ్డు, పలాస, సోంపేట, ఇచ్ఛాపురం స్టేషన్లు ఇరువైపులా రైళ్లు ఆగుతాయి.
  • రైలు నెం. 07251 నర్సాపూర్ - సికింద్రాబాద్ ప్రత్యేక రైలు (01 సర్వీసు)- ఈ ప్రత్యేక రైలు పాలకొల్లు, భీమవరం జంక్షన్, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ స్టేషన్లలో ఆగనున్నాయి.
  • రైలు నెం. 07252 సికింద్రాబాద్ - నర్సాపూర్ ప్రత్యేక రైలు (01 సర్వీసు)- ఈ ప్రత్యేక రైలు జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, కొండపల్లి, విజయవాడ, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, భీమవరం జంక్షన్, పాలకొల్లు స్టేషన్లలో ఆగనున్నాయి.
  • ఈ రైళ్లలో ఫస్ట్ AC, 2AC, 3AC, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి.

తదుపరి వ్యాసం