తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Mmts Trains : అలర్ట్… వారం రోజుల పాటు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు - రూట్లు ఇవే

MMTS Trains : అలర్ట్… వారం రోజుల పాటు ఎంఎంటీఎస్ రైళ్లు రద్దు - రూట్లు ఇవే

16 July 2023, 10:56 IST

    • Hyderabad MMTS Trains Cancellation : భాగ్యనగరంలోని నగరంలోని పలు​ రూట్లలో నడిచే ఎంఎంటీఎస్​ రైళ్లను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. ఈ మేరకు ఆయా రూట్ల వివరాలతో పాటు తేదీలను వెల్లడించింది.
ఎంఎంటీఎస్​ రైళ్లు రద్దు
ఎంఎంటీఎస్​ రైళ్లు రద్దు

ఎంఎంటీఎస్​ రైళ్లు రద్దు

Cancellation MMTS Train Services: ప్రయాణికులకు అలర్ట్ ఇచ్చింది దక్షిణ మధ్య రైల్వే. పలు రూట్లలో నడిచే ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. జులై 17 నుంచి 23వ తేదీ వరకు వారం పాటు 22 ఎంఎంటీఎస్‌ రైళ్ల సర్వీస్‌లను రద్దు చేసినట్లు పేర్కొంది. నిర్వహణ పనుల కోసం రద్దు చేసినట్లు ఓ ప్రకటనలో వెల్లడించింది. ప్రయాణికులు ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను ఎంచుకోవాలని సూచించింది.

ట్రెండింగ్ వార్తలు

TS Cabinet Expansion : సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో మరో ఆరుగురికి ఛాన్స్, ఎవరెవరికి చోటు దక్కనుంది?

Hyderabad Real Estate Scam: హైదరాబాద్ లో మరో ప్రీ లాంచ్ రియల్ ఎస్టేట్ స్కామ్, రూ.60 కోట్లు వసూలు చేసిన భారతి బిల్డర్స్

Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలు పని వేళల్లో మార్పులు, అధికారుల క్లారిటీ!

Love Fraud : : కి'లేడి' ప్రేమపేరుతో మోసం-ప్రియుడు ఆత్మహత్యాయత్నం

రూట్ల వివరాలు:

లింగంపల్లి - హైదరాబాద్(47129)

లింగంపల్లి - హైదరాబాద్ (47132)

లింగంపల్లి - హైదరాబాద్ (47133)

లింగంపల్లి - హైదరాబాద్ (47135)

హైదరాబాద్ - లింగంపల్లి(47136)

హైదరాబాద్ - లింగంపల్లి(47105)

హైదరాబాద్ - లింగంపల్లి(47108)

హైదరాబాద్ - లింగంపల్లి(47109)

ఉమద్ నగర్ - లింగంపల్లి(47110)

లింగంపల్లి - ఫలక్ నుమా(47112)

లింగంపల్లి- ఉమద్ నగర్(47165)

లింగంపల్లి - ఫలక్ నుమా(47189)

ఫలక్ నుమా- లింగంపల్లి(47178)

ఉమద్ నగర్ - లింగంపల్లి(47179)

లింగంపల్లి - ఉమద్ నగర్ (47158)

ఉమద్ నగర్ - లింగంపల్లి(47211)

రామచంద్రాపురం - ఫలక్ నుమా(47212)

ఫలక్ నుమా - లింగంపల్లి(47214)

ఉమద్ నగర్ - లింగంపల్లి(47177)

లింగంపల్లి- ఉమద్ నగర్(47181)

రద్దు చేసిన వాటిలో లింగంపల్లి-హైదరాబాద్మధ్య నడిచే రైళ్లు 12 ఉన్నాయి. లింగంపల్లి-హైదరాబాద్(47129, 47132, 47133, 47135, 47136, 47137) ట్రైన్లతో పాటు హైదరాబాద్ లింగంపల్లి (4711447105, 47108,47109, 47110, 47112) రైళ్లను రద్దు చేశారు. ఉదానగర్-లింగంపల్లి(47165), లింగంపల్లి-ఫలక్‌నుమా(47189), లింగంపల్లి-ఉదానగర్(47178,47181), లింగంపల్లి-ఫలక్‌నుమా(47179), ఫలక్‌నుమా-లింగంపల్లి(47158) మధ్య నడిచే పలు ఎంఎంటీస్ ట్రైన్లు రద్దు అయ్యాయి.

పలు రైళ్లు రద్దు…

విజయవాడ రూట్‌లో వెళ్లే పలు రైళ్లను రద్దు చేసింది దక్షిణ మధ్య రైల్వే. జూలై 17 నుంచి జూలై 23 వరకు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు పేర్కొంది. విజయవాడ పరిధిలో భద్రతకు సంబంధించిన మెయింటనెన్స్ పనుల కారణంగా రద్దు నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపింది. ఇందులో కాజీపేట, విజయవాడ, నిజమాబాద్, నాందేడ్, ఖమ్మం మీదుగా నడిచే రైళ్లు ఉన్నాయి.

తదుపరి వ్యాసం