తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Sangareddy News : రోడ్ వెడల్పులో చెట్టు కొట్టకుండా అడ్డుకున్న బాలుడు, 7 గంటల పాటు చెట్టెక్కి కూర్చొని వినూత్న నిరసన!

Sangareddy News : రోడ్ వెడల్పులో చెట్టు కొట్టకుండా అడ్డుకున్న బాలుడు, 7 గంటల పాటు చెట్టెక్కి కూర్చొని వినూత్న నిరసన!

HT Telugu Desk HT Telugu

19 December 2023, 21:53 IST

    • Sangareddy News : రోడ్డు వెడల్పులో భాగంగా చెట్టును తొలగించేందుకు ప్రయత్నించిన మున్సిపల్ సిబ్బందిని ఓ బాలుడు అడ్డుకున్నాడు. ఆ చెట్టుపై తనకున్న ప్రేమను చూపాడు.
చెట్టెక్కి నిరసన తెలుపుతున్న బాలుడు
చెట్టెక్కి నిరసన తెలుపుతున్న బాలుడు

చెట్టెక్కి నిరసన తెలుపుతున్న బాలుడు

Sangareddy News : తమ ఇంటి పక్కనే ఉన్న చెట్టును రోడ్డు వెడల్పు చేయడానికి మున్సిపల్ అధికారులు తొలగించడానికి ప్రయత్నించగా, 12 ఏళ్ల బాలుడు వారిని అడ్డుకున్న సంఘటన సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రపురం మండలంలో జరిగింది. రామచంద్రపురం మండలంలోని కాకతీయ నగర్ ప్రాంతం, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలోకి వస్తుంది. అయితే ఈ ప్రాంతంలో అధికారులు, గత కొన్ని రోజుల క్రితం రోడ్డు వెడల్పు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. రోడ్డుకు అడ్డంగా ఉన్న కొన్ని చెట్లను కొట్టి, రోడ్డు వెడల్పు చేసే పనులు మొదలుపెట్టాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. అలా చెట్లు కొడుతు వెళ్తున్న అధికారులకు 12 ఏళ్ల బాలుడు అనిరుధ్ నుంచి అనుకోని నిరసన ఎదురైంది. తన ఇంటి ముందు ఉన్న చెట్టు నరికివేయద్దని, అధికారులతో ఆ బాలుడు వాగ్వివాదానికి దిగాడు. జీహెచ్ఎంసీ సిబ్బంది ఎంత చెప్పిన వినకుండా బాలుడు ఆ చెట్టు ఎక్కి దాని పైనే కూర్చున్నాడు. మంగళవారం స్కూల్ కి వెళ్లకుండా సుమారుగా 7 గంటలు చెట్టుపైన కూర్చున్నాడు.

ట్రెండింగ్ వార్తలు

Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలు పని వేళల్లో మార్పులు, అధికారుల క్లారిటీ!

Mallareddy Land Issue : సుచిత్రలో భూవివాదం- అల్లుడు, అనుచరులతో కలిసి మల్లారెడ్డి హల్ చల్-ఆపై అరెస్ట్!

Khammam Crime News : ఖమ్మం జిల్లాలో దారుణం.. ఆస్తి కోసం తల్లితో పాటు ఇద్దరు కుమార్తెల హత్య

TS Govt Jobs 2024 : ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు... రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినెట్ ఖాళీలు, ముఖ్య తేదీలివే

ఆ చెట్టుతో ఎంతో అనుబంధం

బాలుడి తండ్రి ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ... ఆ చెట్టు అంటే అనిరుధ్ కు చాలా ఇష్టమని తెలిపారు. చెట్టు కొమ్మపై ఒక మట్టి తొట్టెను పెట్టి, క్రమం తప్పకుండా పక్షుల దాహం తీర్చడానికి నీరు పోస్తుంటాడని తెలిపారు. అయితే, ఆ చెట్టునే నరుకుతున్నారని తెలియగానే అనిరుధ్ చాలా బాధపడ్డాడని, తాను ఎలానైనా ఆ చెట్టుని కాపాడుకుంటానని పట్టుదలతో ఉన్నాడన్నారు. ఇవాళ వచ్చిన జీహెచ్ఎంసీ సిబ్బందికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇచ్చిన పర్మిషన్ లెటర్ చూపించమని అడిగామని, వారు ఎటువంటి పర్మిషన్ లేకుండానే చెట్లు కొడుతున్నారన్నారు. అయితే రాత్రి కూడా అధికారులు చెట్టు కొట్టడానికి, ప్రయత్నం చేస్తే, అనిరుధ్ మరొకసారి అడ్డుకున్నాడని చెప్పారు. ఇంత చిన్న వయసులో అనిరుధ్ చూపిన పట్టుదల చూసి కాలనీ వాసులు మెచ్చుకున్నారు. అధికారులు మాత్రం, ఇక్కడ రోడ్డు చిన్నగా ఉండటం వలన కాలనీలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, వారి కోరిక మేరకే తాము రోడ్డు పెద్దగా చేస్తున్నామన్నారు. కొన్ని చెట్లు రోడ్డుకి అడ్డంగా ఉండటం వలన, వాటిని తొలగించకుండా రోడ్డు వేయలేని పరిస్థితి ఉందన్నారు. అయినా తాను ఆ చెట్టును కొట్టనిచ్చేది లేదని అనిరుధ్ అంటున్నాడు.

రిపోర్టింగ్ : హెచ్.టి.తెలుగు ప్రతినిధి, సంగారెడ్డి

తదుపరి వ్యాసం