తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Bansilalpet Stepwell In Hyd : 17వ శతాబ్ధం మెట్లబావి.. ఈనెల 5న ప్రారంభం

Bansilalpet stepwell in Hyd : 17వ శతాబ్ధం మెట్లబావి.. ఈనెల 5న ప్రారంభం

HT Telugu Desk HT Telugu

03 December 2022, 15:22 IST

    • Bansilalpet step well inauguration : బన్సీలాల్‌పేట మెట్లబావి ప్రారంభానికి సర్కార్ ముహుర్తం ఖరారు చేసింది. ఈనెల 5న మెట్లబావిని రాష్ట్ర మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. పర్యాటకులను ఆకర్షించే విధంగా ఈ మెట్లబావిని అధికారులు తీర్చిదిద్దారు.
బన్సీలాల్ పేట మెట్లబావి,
బన్సీలాల్ పేట మెట్లబావి, (twitter)

బన్సీలాల్ పేట మెట్లబావి,

Bansilalpet step well inauguration : బన్సీలాల్ పేట మెట్లబావి.... ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. బీఫోర్... ఆఫ్టర్ అంటూ రెండు ఫొటోలను తెగ షేర్లు చేశారు నెటిజన్లు. అయితే ఇక ఈ మెట్లబావి ఎప్పుడు ఓపెన్ చేస్తారా..? ఎప్పుడు చూద్దామా..? అనే వారికి గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ సర్కార్. ఈ నెల 5వ తేదీన ప్రారంభించేందుకు ఏర్పాట్లు సిద్ధం చేసింది. మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఈ మెట్లబావిని ప్రారంభించనున్నారు.

ట్రెండింగ్ వార్తలు

CM Revanth Reddy : తెలంగాణలో భూముల మార్కెట్ విలువ సవరణ…! కీలక ఆదేశాలు జారీ

TS LAWCET 2024 Updates : టీఎస్ లాసెట్ కు భారీగా దరఖాస్తులు - ఈ సారి 3 సెష‌న్ల‌లో ఎగ్జామ్, ఫైన్ తో అప్లికేషన్లకు ఛాన్స్

TSRTC Jeevan Reddy Mall : అద్దె ఒప్పందం రద్దు , జీవన్ రెడ్డి మాల్ స్వాధీనం - టీఎస్ఆర్టీసీ ప్రకటన

Telangana Rains : కరీంనగర్ జిల్లాలో గాలివాన బీభత్సం - పిడుగుపాటుతో ఇద్దరు మృతి

తెలంగాణ ప్రభుత్వం పురాతన కట్టడాలకు పూర్వవైభవం తీసుకొచ్చే పనిలో పడింది. శిథిలావస్థలో ఉన్న పురాతన కట్టడాలకు పునర్జీవనం అందించి వాటికి పునర్‌వైభవం తీసుకురావడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే హైదరాబాద్ బన్సీలాల్‌పేటలోని మెట్లబావిని పునరుద్ధరించింది. ఈ మెట్లబావిలో 22 లక్షల లీటర్ల నీరు నిల్వ చేయవచ్చు. సికింద్రాబాద్‌లోని ఈ బన్సీలాల్‌పేట్ మెట్ల బావిని 17వ శతాబ్దంలో నిర్మించారు. 53 అడుగుల లోతున్న ఈ బావిలో చుట్టూ నడిచేందుకు మండపం, అట్టడుగుకు వెళ్లే వరకూ మెట్లు ఉన్నాయి. 1970 లవరకూ వాడకంలో ఉన్న ఈ బావి ఆ తర్వాత నిర్లక్ష్యానికి గురయ్యింది. ఇందులో 2 లక్షల టన్నుల చెత్త పేరుకుపోయింది. దీన్ని పూర్తిస్థాయిలో చెత్తను తొలగించారు.

మ్యూజికల్ లైటింగ్...

అభివృద్ధి పనుల్లో భాగంగా బావి పరిసరాల్లోని అన్ని గృహాలకు నల్లా కనెక్షన్‌ ఇవ్వడంతో పాటు సీవరేజీ లైన్ల ఏర్పాటు, రహదారుల నిర్మాణం కూడా చేపట్టారు. ఇక్కడికి వచ్చే పర్యాటకుల కోసం మ్యూజికల్‌ లైటింగ్‌, బావి, పరిసరాలను వీక్షించే విధంగా గ్యాలరీ నిర్మాణం చేశారు. పలు పండుగలు, ప్రత్యేక రోజుల్లో సాంసృతిక కార్యక్రమాలు నిర్వహించేలా ఏర్పాట్లు కూడా చేస్తున్నట్లు అధికారులు వివరించారు. బావి చరిత్రను తెలియజేసేలా ఫొటో గ్యాలరీని కూడా ఏర్పాటు చేయనున్నారు. నగర వాసులే కాకుండా నగరానికి వచ్చిన ప్రతి ఒకరూ బన్సీలాల్‌ పేట బావిని చూడాలనిపించే విధంగా ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దారు.

బన్సీలాల్‌పేట మెట్లబావి

పర్యాటకులను ఆకర్షించే విధంగా మెట్ల బావి పరిసరాల్లోని అన్ని భవనాలకు ఒకే రకమైన పెయింటింగ్‌ వేశారు. ఇక్కడకు వచ్చే పర్యాటకుల వాహనాల పారింగ్‌ కోసం సమీపంలోని మున్సిపల్‌ గ్రౌండ్‌లో ఏర్పాట్లు చేశారు. ఇక ఏర్పాట్లను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. మెట్లబావికి ఎంతో చరిత్ర ఉందన్నారు. అసఫ్ జాయిలీ కాలంలో నిర్మించిన బావి అని చెప్పుకొచ్చారు. డిసెంబర్ 5వ తేదీన మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు.

తదుపరి వ్యాసం