తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Assembly Krmb Issue: కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు ఇచ్చేది లేదన్న ఉత్తమ్… అసెంబ్లీలో తీర్మానం

TS Assembly KRMB Issue: కృష్ణా బోర్డుకు ప్రాజెక్టులు ఇచ్చేది లేదన్న ఉత్తమ్… అసెంబ్లీలో తీర్మానం

Sarath chandra.B HT Telugu

12 February 2024, 12:10 IST

google News
    • TS Assembly KRMB Issue: సాగు నీటి ప్రాజెక్టుల్ని కృష్ణారివర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డుకు అప్పగించకూడదని తెలంగాణ అసెంబ్లీలో తీర్మానాన్ని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ప్రవేశపెట్టారు. 
కృష్ణాబోర్డుకు ప్రాజెక్టులు అప్పగించడంపై  అసెంబ్లీలో తీర్మానం
కృష్ణాబోర్డుకు ప్రాజెక్టులు అప్పగించడంపై అసెంబ్లీలో తీర్మానం

కృష్ణాబోర్డుకు ప్రాజెక్టులు అప్పగించడంపై అసెంబ్లీలో తీర్మానం

TS Assembly KRMB Issue: కెఆర్‌ఎంబి బోర్డుకు కృష్ణా ప్రాజెక్టులు అప్పగించ కూడదని తెలంగాణ అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తీర్మానం ప్రవేశపెట్టారు. పదేళ్ల బిఆర్‌ఎస్‌ పాలనలో తెలంగాణకు ఉమ్మడి రాష్ట్రంలో కంటే ఎక్కువ నష్టం వాటిల్లిందని ఆరోపించారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు నాగార్జున సాగర్‌ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బలగాల సాయంతో స్వాధీనం చేసుకుందని ఆరోపించారు. రాయలసీమ లిఫ్ట్‌ పేరుతో రోజుకు 3టిఎంసిలు నీళ్లు తీసుకు వెళ్లే జీవోలు ఇచ్చినా కేసీఆర్ స్పందించలేదన్నారు.

నదీ జలాల్లో తెలంగాణకు తీవ్రమైన అన్యాయం జరగడం వల్లే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నాటి యూపీఏ ప్రభుత్వం గుర్తించి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు అమోదం తెలిపారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేళ్లలో గతం కంటే ఎక్కువ అన్యాయం జరిగిందని ఉత్తమ్ కుమార్‌ రెడ్డి ఆరోపించారు.

కృష్ణా జలాల తరలింపు కోసం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ 11,150క్యూసెక్కుల సామర్థ్యంతో 1983లో ఎన్టీఆర్‌ సిఎంగా ఉన్నప్పుడు నిర్మాణం జరిగిందని, ఆ తర్వాత వైఎస్‌ హయంలో దానిని 40వేల క్యూసెక్కుల పెంచారని బిఆర్ఎస్‌ వచ్చాక శ్రీశైలం 840అడుగుల నీటిలో తరలించడానికి అంగీకరించారన్నారు.

2020లో పోతిరెడ్డి పాడు సామర్థ్యాన్ని జీవో 203 ద్వారా 92వేల500 క్యూసెక్కుల పెంచారని, రాయలసీమ లిఫ్ట్‌ స్కీమ్‌ ద్వారా రోజుకు 3టిఎంసిలను తరలించడానికి అనుమతులు జారీ చేశారన్నారు. తెలంగాణలో గత ప్రభుత్వం ఉన్నపుడే ఈ నిర్ణయాలు తీసుకున్నారని ఆరోపించారు. పోతిరెడ్డి పాడు నుంచి రోజుకు 8టిఎంసిల నీటిని తీసుకుపోతున్నా ఎందుకు బిఆర్‌ఎస్‌ స్పందించలేదన్నారు.

నది మొత్తాన్ని మళ్లిస్తున్నా బిఆర్ఎస్‌ ఎందుకు పట్టించుకోలేదని ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ప్రశ్నించారు. 2020 మే5న జీవో 203 వెలువడిందని, తెలంగాణకు నష్టం జరుగుతున్నా ఎందుకు పట్టించుకోలేదన్నారు. భవిష్యత్తులో నాగార్జున సాగర్ మొత్తం ఎండిపోతుందని హెచ్చరించారు.

ముచ్చుమర్రి 6500 క్యూసెక్కులు పెంచారని, కేసీ కెనాల్‌కు వెయ్యి క్యూసెక్కులు, మల్యాల దగ్గర 3వేల క్యూసెక్కుల నుంచి 6వేల క్యూసెక్కుల తరలింపుకు సామర్థ్యం పెంచారని వివరించారు.

తెలంగాణ ఏర్పడిన తర్వాత గతం కంటే ఎక్కువ అన్యాయం జరిగిందన్నారు. 2004 నుంచి 2014 వరకు బేసిన్‌లో లేని ప్రాంతాలకు మొత్తం 10665 టిఎంసిలలో 727 టిఎంసిలు వెళ్లాయని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 1200 టిఎంసిలను బేసిన్‌లో లేని ప్రాంతాలకు వెళ్లాయన్నారు. టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రాకు యాభై శాతం అదనంగా తరలించారన్నారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో బచావత్ ట్రిబ్యునల్ అవార్డు 811 టిఎంసిలు కేటాయించినపుడు తెలంగాణ ప్రయోజనాలకు భంగం కలిగించే బిఆర్‌ఎస్‌ పార్టీ 299 టిఎంసిల కేటాయింపుకు అమోదం చెప్పారని ఆరోపించారు.

బచావత్‌ ట్రిబ్యునల్ అవార్డు వచ్చిన తర్వాత 500కు పైగా టిఎంసిలు ఆంధ్రాకు అప్పగించి, చివరి ఏడాది సగం నీళ్లు కావాలని పోరాటాలు చేశారని ఎద్దేవా చేశారు. 299టిఎంసిల జలాల పంపిణీకి ఎందుకు ఒప్పుకున్నారో చెప్పాలన్నారు.

ప్రాజెక్టుల విషయంలో గత ప్రభుత్వాల విషయంలో తెలంగాణ, ప్రధానంగా దక్షిణ తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి చెప్పారు. ఏపీ, తెలంగాణలకు క్యాచ్‌మెంట్‌ ఏరియా,జనాభా, కరువు ప్రభావం ఆధారంగా కేటాయింపులు జరపాలని అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు.

2015 నుంచి ప్రతి ఏటా టిఆర్ఎస్‌ ప్రభుత్వం ఢిల్లీ వెళ్లి ఆంధ్రాకు 512, తెలంగాణకు 299 టిఎంసిల కేటాయింపుకు అమోదం తల ఊపారని మండిపడ్డారు. బచావత్‌ ట్రిబ్యునల్ రెండు రాష్ట్రాల మధ్య నదీ జలాల కేటాయింపుకు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని ఏపీకి 512 టిఎంసిలు ఇవ్వాలనే నిర్ణయానికి ఎందుకు అంగీకారం తెలిపారని ప్రశ్నించారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత కూడా తెలంగాణకు సాగునీటి విషయంలో తీవ్ర అన్యాయం జరిగిందన్నారు.

కృష్ణా పరివాహక ప్రాంతంలో అన్ని విధాలుగా ఎక్కువ జలాలను పొందడానికి తెలంగాణకు అర్హతలు ఉన్నా, ప్రభుత్వ అసమర్థత వల్ల ఆంధ్రప్రదేశ్‌ ఎక్కువ వాటా పొందిందన్నారు. టిఆర్‌ఎస్ అమోదం తెలిపడం వల్లే ఇప్పటికి కోర్టుల్లో ఆంధ్రా వాదన నెగ్గుతోందన్నారు. టెలిమెట్రి ఏర్పాటు చేయకపోవడం వల్ల పోతిరెడ్డి పాడు నుంచి ఎంత నీరు తరలిస్తున్నారో లెక్కలు తీసి ఉండాల్సిందన్నారు. ఆ డబ్బును కూడా ప్రభుత్వం ఇవ్వలేదన్నారు.

2016 సెప్టెంబర్ 21న జరిగిన అపెక్స్‌ కౌన్సిల్ సమావేశంలో ఉమాభారతి సమక్షంలో కేసీఆర్, చంద్రబాబులు 512 టిఎంసిలను ఏపీకి కేటాయించడానికి అమోదం తెలిపారన్నారు.

తదుపరి వ్యాసం