తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  తెలంగాణలో భారీ వర్షాలు.. ఆరెంజ్ అలెర్ట్, ఎల్లో అలెర్ట్ ఎక్కడెక్కడో తెలుసుకోండి

తెలంగాణలో భారీ వర్షాలు.. ఆరెంజ్ అలెర్ట్, ఎల్లో అలెర్ట్ ఎక్కడెక్కడో తెలుసుకోండి

HT Telugu Desk HT Telugu

20 July 2023, 7:57 IST

    • తెలంగాణలో రెండు రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురవనున్నాయి. ఈ నేపథ్యంలో భారత వాతావరణ శాక ఆరెంజ్ అలెర్ట్, ఎల్లో అలెర్ట్ జారీచేసింది.
హైదరాబాద్ లో వర్షాల కారణంగా ఇబ్బందులు పడుతున్న స్కూలు విద్యార్థులు
హైదరాబాద్ లో వర్షాల కారణంగా ఇబ్బందులు పడుతున్న స్కూలు విద్యార్థులు (AFP)

హైదరాబాద్ లో వర్షాల కారణంగా ఇబ్బందులు పడుతున్న స్కూలు విద్యార్థులు

హైదరాబాద్, జూలై 20: తెలంగాణ వ్యాప్తంగా రానున్న నేడు, రేపు విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ డాక్టర్‌ కె నాగరత్నం మాట్లాడుతూ.. ప్రస్తుతం ఒడిశాతో పాటు వాయువ్య బంగాళాఖాతం, పశ్చిమ మధ్య అఖాతం పరిసర ప్రాంతాల్లో వాయుగుండం ఏర్పడిందని వాతావరణ పరిస్థితులు సూచిస్తున్నాయి. రాబోయే 12 గంటల్లో ఇది ఆ ప్రాంతంలో అల్పపీడన వ్యవస్థగా మారే అవకాశం ఉంది. ఈ కారణంగా రానున్న రెండు రోజుల్లో తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించారు.

మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
ట్రెండింగ్ వార్తలు

TS Cabinet Expansion : సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో మరో ఆరుగురికి ఛాన్స్, ఎవరెవరికి చోటు దక్కనుంది?

Hyderabad Real Estate Scam: హైదరాబాద్ లో మరో ప్రీ లాంచ్ రియల్ ఎస్టేట్ స్కామ్, రూ.60 కోట్లు వసూలు చేసిన భారతి బిల్డర్స్

Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలు పని వేళల్లో మార్పులు, అధికారుల క్లారిటీ!

Love Fraud : : కి'లేడి' ప్రేమపేరుతో మోసం-ప్రియుడు ఆత్మహత్యాయత్నం

తెలంగాణలో కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వివరించారు. కొన్ని తూర్పు జిల్లాలు, ఈశాన్య జిల్లాలు, ఉత్తర జిల్లాలతో పాటు దాని పరిసర జిల్లాలైన సిద్దిపేట, వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కరీంనగర్, పెదపల్లి, పరిసర ప్రాంతాల్లో కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు.

‘గురువారం తెలంగాణాలో చాలా చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు, తెలంగాణలోని ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో ఒకటి లేదా రెండు చోట్ల అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది’ అని నాగరత్నం తెలిపారు. హైదరాబాద్ నగరంలో కూడా వర్షాలు కురుస్తాయని వివరించారు. ఈరోజు, రేపు హైదరాబాద్‌లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని.. నగరంలోని కొన్ని చోట్ల అక్కడక్కడా కుండపోతగా వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రస్తుతం హైదరాబాద్‌లో ఎల్లో అలర్ట్‌ జారీ అయిందని తెలిపారు.

ఎల్లో అలెర్ట్ ఉన్న ప్రాంతాలు:

హైదరాబాద్, జగిత్యాల, జనగాం, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, వరంగల్, యాదాద్రి భువనగిరి

ఆరెంజ్ అలెర్ట్ ఉన్న ప్రాంతాలు:

భద్రాద్రి కొత్త గూడెం, జయశంకర్, కరీంనగర్, మంచిర్యాల, ములుగు, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట

తదుపరి వ్యాసం