తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Medak Mp Resignation: ఎంపీ పదవికి రాజీనామా చేసిన కొత్త ప్రభాకర్ రెడ్డి

Medak MP Resignation: ఎంపీ పదవికి రాజీనామా చేసిన కొత్త ప్రభాకర్ రెడ్డి

HT Telugu Desk HT Telugu

13 December 2023, 12:53 IST

    • Medak MP Resignation: మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్తప్రభాకర్ రెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. లోక్ సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లాకు తన రాజీనామా లేఖను అందించారు.
స్పీకర్‌కు రాజీనామా లేఖ సమర్పించిన కొత్త ప్రభాకర్ రెడ్డి
స్పీకర్‌కు రాజీనామా లేఖ సమర్పించిన కొత్త ప్రభాకర్ రెడ్డి

స్పీకర్‌కు రాజీనామా లేఖ సమర్పించిన కొత్త ప్రభాకర్ రెడ్డి

Medak MP Resignation: మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్తప్రభాకర్ రెడ్డి తన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. లోక్ సభ స్పీకర్ ఓం ప్రకాష్ బిర్లాకు తన రాజీనామా లేఖను అందించారు. 2014 లో జరిగిన ఉపఎన్నికలో ప్రభాకర్ రెడ్డి మెదక్ ఎంపీగా ఎన్నికయ్యారు. 2019 లోనూ రెండవసారి మరల అదే స్థానం నుండి భారీ మెజారిటీతో గెలుపొందారు.

ట్రెండింగ్ వార్తలు

Love Fraud : : కి'లేడి' ప్రేమపేరుతో మోసం-ప్రియుడు ఆత్మహత్యాయత్నం

Mallareddy Land Issue : సుచిత్రలో భూవివాదం- అల్లుడు, అనుచరులతో కలిసి మల్లారెడ్డి హల్ చల్-ఆపై అరెస్ట్!

Khammam Crime News : ఖమ్మం జిల్లాలో దారుణం.. ఆస్తి కోసం తల్లితో పాటు ఇద్దరు కుమార్తెల హత్య

TS Govt Jobs 2024 : ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు... రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినెట్ ఖాళీలు, ముఖ్య తేదీలివే

మెదక్ పార్లమెంటు సభ్యుడిగా రెండు పర్యాయాలు చేసి, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో దుబ్బాక నియోజకవర్గం నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటి చేశారు. తన సమీప ప్రత్యర్థి సిట్టింగ్ ఎమ్మెల్యే రఘునందన్ రావు భారీ ఆధిక్యంతో ఘన విజయం సాధించారు. దీంతో ఆయన మెదక్ పార్లమెంటు సభ్యుడిగా సభ్యత్వాన్ని ఉపసంహరించుకుంటూ రాజీనామా పత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఆయన భావోద్వేగానికి గురయ్యారు. మెదక్ ఎంపిగా తాను ప్రజలకు చేసిన సేవలు,అభివృద్ధి పనులు, 10 ఏళ్ళు గా పార్లమెంట్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ఈ క్రమంలో రెండు సార్లు భారీ మెజార్టీ తో గెలిపించి సేవ చేసుకునే అవకాశం కల్పించిన మెదక్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.

రెండు పర్యాయాలు ఎంపీగా రికార్డు మెజార్టీలే ....

దుబ్బాక ఎమ్మెల్యేగా గెలుపొందిన కొత్త ప్రభాకర్‌రెడ్డి బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు నమ్మినబంటు. వ్యాపారవేత్తగా ఉన్నత స్థాయిలో ఉన్న కొత్త ప్రభాకర్‌రెడ్డి కేసీఆర్‌ పిలుపుతో రాజకీయాల్లోకి అడుగుపెట్టారు.

2014లో మెదక్‌ పార్లమెంటు ఉప ఎన్నికల్లో ప్రభాకర్‌రెడ్డికి అత్యధికంగా 3,61,277 ఓట్ల రికార్డు మెజార్టీతో అప్పటి కాంగ్రెస్‌ అభ్యర్థి సునీతాలక్ష్మారెడ్డిపై ఘన విజయం సాధించారు. అలాగే 2019 పార్లమెంటు ఎన్నికల్లో సైతం మెదక్‌ నుంచే మళ్లీ 3,16,427 ఓట్ల భారీ మెజార్టీతో కాంగ్రెస్‌ అభ్యర్థి గాలి అనిల్‌ కుమార్‌పై గెలుపొందడం విశేషం.

్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్న ప్రభాకర్‌రెడ్డి కేసీఆర్‌ ఆదేశాల మేరకు దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థిగా బీఆర్‌ఎస్‌ నుంచి పోటీ చేసి 53,513 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. ఇప్పటి వరకు తన రాజకీయ జీవితంలో ఓటమి ఎరుగని నేతగా ప్రభాకర్‌రెడ్డి ముందుకుసాగుతున్నారు.

ప్రభాకర్‌ రెడ్డికి మొదటి నుంచి ఎమ్మెల్యే కావాలనే కోరిక ఉండేది. ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ కల నెరవేరినట్లయింది. రామలింగారెడ్డి మరణంతో 2020 ఉప ఎన్నికల్లో 1079 ఓట్ల స్వల్ప మెజార్టీతో బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా రఘునందన్‌రావు గెలుపొందారు. ఇప్పుడు ఆయనపై ప్రభాకర్‌రెడ్డిని పోటీకి దింపడంతో భారీ మెజార్టీతో విజయం సాధించారు.

తదుపరి వ్యాసం