తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  St Reservations : గిరిజన రిజర్వేషన్ల పెంపు చట్టబద్ధం కాదు - సుప్రీంకోర్టులో పిటిషన్

ST Reservations : గిరిజన రిజర్వేషన్ల పెంపు చట్టబద్ధం కాదు - సుప్రీంకోర్టులో పిటిషన్

HT Telugu Desk HT Telugu

11 January 2023, 18:13 IST

    • ST Reservations : తెలంగాణ ప్రభుత్వం గిరిజన రిజర్వేషన్లు పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. పెంపు జీవో చట్ట బద్ధం కాదని, జీవో వల్ల ఆదివాసీలకు నష్టం జరుగుతుందని.. రాజ్యాంగ ధర్మాసనం తీర్పుకి విరుద్ధంగా ఉన్న జీవోని కొట్టివేయాలని పలు గిరిజన సంఘాలు సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరాయి.
సుప్రీం కోర్టు
సుప్రీం కోర్టు

సుప్రీం కోర్టు

ST Reservations : రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్లు పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టులో (Supreme Court of India) పిటిషన్ దాఖలైంది. గిరిజన రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోని కొట్టివేయాలని కోరుతూ.. గిరిజన సంఘాలు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. ఈ ఉత్తర్వులు గతంలో రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఉండరాదు అని విధించిన నిబంధనకు విరుద్ధంగా ఉన్నాయని... గిరిజన సంఘాల తరపున న్యాయవాది అల్లంకి రమేశ్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రిజర్వేషన్లలో 50 శాతం జనరల్ కాకుండా ఉండాలని, మిగిలిన 50 శాతం లోనే అన్ని కులాలు, మతాలకు రిజర్వేషన్లు కల్పించుకోవచ్చని గతంలో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం తీర్పు ఇచ్చిందని... అందుకు విరుద్ధంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించిందని పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు

10 Years Telangana: ఉమ్మడి రాజధాని గడువు మరో పక్షం రోజులే.. జూన్‌2 తర్వాత ఆస్తుల స్వాధీనం చేసుకోవాలని సిఎం రేవంత్ ఆదేశం

BRS RakeshReddy: బీఆర్ఎస్ లో 'రాకేశ్ రెడ్డి' పంచాయితీ!కోఆర్డినేషన్ మీటింగ్‌ కు ముఖ్య నేతలంతా డుమ్మా

TS CPGET 2024 : టీఎస్ సీపీగెట్ నోటిఫికేషన్ విడుదల, మే 18 నుంచి అప్లికేషన్లు ప్రారంభం

Road Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు- ఆరుగురు మృతి, 14 మందికి గాయాలు

తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిన జీవో 50 శాతానికి మించి రిజర్వేషన్లు ఇస్తున్నట్లు ఉందని, ఇది రాజ్యాంగ ధర్మాసనం తీర్పును ఉల్లంఘించడమే అని పిటిషన్ లో పేర్కొన్నారు. చెల్లప్ప కమిషన్ 9 శాతం వరకే రిజర్వేషన్లు పెంచుకోవచ్చు అని సిఫారసు చేసిందని, అందుకు సంబంధించిన బిల్లు పార్లమెంటులో పెండింగ్ లో ఉండగా జీఓ తీసుకురావడం చట్ట ప్రకారం చెల్లదన్నారు. రిజర్వేషన్లు పెంచుతూ జారీ చేసిన జీవో వల్ల ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన సుగాలి, లంబాడా, బంజారా గిరిజనులకు మాత్రమే లబ్ధి చేకూరుతుందని అన్నారు. రాజ్యాంగబద్ధంగా ఈ జీవో చెల్లదని, చట్టబద్దంగా అమలు సాధ్యం కానీ జీవో వల్ల గిరిజనులకు నష్టం చేకూరుతుందని పేర్కొన్నారు. ఎటువంటి లబ్ధి చేకూర్చని ఉత్తర్వులను కొట్టేయాలని సుప్రీంకోర్టును అభ్యర్థించారు.

ఆధార్ సొసైటీ, ఆదివాసీ గిరిజన ఉద్యోగుల సంక్షేమ అసోసియేషన్, ఆదిమ ఆదివాసుల సంక్షేమ, హక్కుల పరిరక్షణ సంఘాలు కలిసి సంయుక్తంగా సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశాయి. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో... గిరిజనులకు రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం గత ఏడాది సెప్టెంబర్ 30న ఉత్తర్వులు జారీ చేసింది. చెల్లప్ప కమిషన్ సిఫార్సుల మేరకు రాష్ట్రంలో గిరిజనుల ప్రత్యేక స్థితిగతులను పరిగణలోకి తీసుకుని.. వారి రిజర్వేషన్లను పెంచుతున్నట్లు పేర్కొంటూ... జీవో నంబర్ 33 జారీ చేసింది. ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయని, విద్య, ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో గిరిజనులకు పెంచిన రిజర్వేషన్లు అమలవుతాయని స్పష్టం చేసింది. దీంతో.. రాష్ట్రంలో విద్య, ఉద్యోగ, నియామకాల్లో రిజర్వేషన్లు 64 శాతానికి చేరాయి.

టాపిక్

తదుపరి వ్యాసం