తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Contractual Faculty : ఉద్యోగాల క్రమబద్ధీకరణకు కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు ఆందోళన

Contractual Faculty : ఉద్యోగాల క్రమబద్ధీకరణకు కాంట్రాక్ట్ ఉపాధ్యాయులు ఆందోళన

HT Telugu Desk HT Telugu

25 October 2023, 16:35 IST

    • Contractual University Teachers in Telangana: తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలంటూ ఓయూలో కాంట్రాక్టు ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. ఎన్నో రోజులుగా నిరసనలు చేస్తున్న తమ సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని వాపోయారు. తమ సమస్యలను పరిష్కారించాలని డిమాండ్ చేశారు.
కాంట్రాక్ట్ ఉపద్యాయులు ఆందోళన
కాంట్రాక్ట్ ఉపద్యాయులు ఆందోళన

కాంట్రాక్ట్ ఉపద్యాయులు ఆందోళన

Contractual University teachers in Telangana: తమ ఉద్యోగాలను ప్రభుత్వం క్రమబద్ధీకరణ చేయాలంటూ మంగళవారం ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎదుట కాంట్రాక్టు ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. 1,445 మంది యూనివర్సిటీ స్థాయి కాంట్రాక్ట్ ఉపాధ్యాయ సిబ్బందిని క్రమబద్దీకరణ చేయకుండా ప్రభుత్వం ఇబ్బంది పెడుతుందని కాంట్రాక్టు ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేశారు.రాష్ట్రంలోని 12 యూనివర్సిటీలకు చెందిన ఉపాధ్యాయులు తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేస్తూ గత కొన్ని నెలలుగా సమ్మెలు ,నిరసనలు,ఆందోళనలు చేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వాపోయారు.

ట్రెండింగ్ వార్తలు

Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలు పని వేళల్లో మార్పులు, అధికారుల క్లారిటీ!

Love Fraud : : కి'లేడి' ప్రేమపేరుతో మోసం-ప్రియుడు ఆత్మహత్యాయత్నం

Mallareddy Land Issue : సుచిత్రలో భూవివాదం- అల్లుడు, అనుచరులతో కలిసి మల్లారెడ్డి హల్ చల్-ఆపై అరెస్ట్!

Khammam Crime News : ఖమ్మం జిల్లాలో దారుణం.. ఆస్తి కోసం తల్లితో పాటు ఇద్దరు కుమార్తెల హత్య

జేఎన్టీయూ హైదరాబాద్ ఫ్యాకల్టీ సభ్యులు, తెలంగాణ ఆల్ యూనివర్సిటీ కాంట్రాక్ట్ టీచర్స్ అసోసియేషన్ ( టిఎయుసిటిఎ ) కన్వీనర్ బి. రాజేష్ ఖన్నా మాట్లాడుతూ… 30 ఏళ్లుగా పని చేస్తున్న క్రమబద్ధీకరణ చేయడం లేదన్నారు. UGC, AICTE మరియు PCI (ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా) నిబంధనల ప్రకారం చాలా మందికి అవసరమైన NET, SET మరియు PhD అర్హతలు ఉన్నాయన్నారు. అయినా ప్రభుత్వం తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరణ చేయడానికి నిరాకరిస్తుందని రాజేష్ ఖన్నా అన్నారు. ఇక ఇదే విషయంపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, టీఎస్‌ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి.వినోద్‌కుమార్‌లను తాము సంప్రదిస్తే సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చినట్లు తమతో చెప్పారని రాజేష్ ఖన్నా తెలిపారు..తాము ఇదే విషయంపై వినోద్‌కుమార్‌ను ప్రశ్నించగా ప్రభుత్వం మరియు వర్శిటీలు రెండు వేరు అని వినోద్ కుమార్ చెప్పారన్నారు. రిక్రూట్‌మెంట్‌లో నిబంధనలు పాటించడం లేదని, దాదాపు 30 ఏళ్ల క్రితం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం హయాంలో కాంట్రాక్టు సిబ్బంది అందరికీ పర్మినెంట్ ఉద్యోగాలు ఇవ్వలేదని వినోద్ కుమార్ సంబంధం లేని జవాబు ఇస్తున్నారని రాజేష్ ఖన్నా ఆరోపించారు. రాష్ట్రంలో అన్ని యూనివర్సిటీల్లో దాదాపు 1,445 మంది కాంట్రాక్టు ఉపాధ్యాయులు ఉండగా అందులో 545 మంది సెల్ఫ్ ఫైనాన్స్ కోర్టుల్లో ఉద్యోగాలు చేస్తున్నారన్నారు.మిగిలిన వారు మంజూరైన పోస్టుల్లో పనిచేస్తున్నారన్నారు.టెక్నికల్‌ యూనివర్సిటీల్లో కాంట్రాక్ట్‌ సిబ్బందిని నియమించే సమయంలో 100 పాయింట్ల రోస్టర్‌ మరియ రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌లను పాటించామని ఖన్నా తెలిపారు. తెలంగాణ, పాలమూరు వంటి సంప్రదాయ యూనివర్శిటీల్లో ప్రభుత్వం రూల్ ఆఫ్ రిజర్వేషన్‌ నిబంధనను ప్రభుత్వం పాటించలేదన్నారు.

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి

తెలంగాణకు రాష్ట్రావతరణ జరగక ముందు నుండే కాంట్రాక్టు లెక్చరర్ల సమస్య చాలా కాలంగా పెండింగ్‌లో ఉందన్నారు. కేసిఆర్ అసెంబ్లీ మరియు బయట అనేక సందర్బాలలో కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేస్తామని హామీనిచ్చి మారిచిపోయారాని రాజేష్ ఖన్నా అన్నారు. సుప్రీంకోర్టులో యూనిట్ల వారీగా రోస్టర్ పద్దతిపై చట్టపరమైన కౌంటర్లు దాఖలు చేయడానికి నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం కారణంగానే ఈ పరిస్థితికి దారి తీసింది అని చెప్పారు.టీఎస్‌పీఎస్‌సీ ద్వారా పరీక్షలను నిర్వహించి రాష్ట్ర విశ్వవిద్యాలయాల్లో రిక్రూట్‌మెంట్ బోర్డును ఏర్పాటు చేయాలని బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రయత్నించడం తీవ్ర గందరగోళానికి దారితీసిందని గుర్తు చేశారు.స్వయంప్రతిపత్తి కలిగిన విశ్వవిద్యాలయాలను ప్రభుత్వ నియామక ప్రక్రియలోకి తీసుకురావడం ఏంటని ఆయన ప్రశ్నించారు.ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 12 ఉనివర్సిటీల్లో ఉన్న 1445 మంది కాంట్రాక్ట్ ఉపాధ్యాయులను క్రమబద్ధీకరణ చేయాలని రాజేష్ ఖన్నాతో పాటు పలువురు కాంట్రాక్టు ఉపాధ్యాయులు డిమాండ్ చేశారు.

రిపోర్టర్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా

తదుపరి వ్యాసం