తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ou Distance Admissions : ఓయూ దూర విద్యలో డిగ్రీ, పీజీ ప్రవేశాలు - దరఖాస్తుల గడువు పొడిగింపు

OU Distance Admissions : ఓయూ దూర విద్యలో డిగ్రీ, పీజీ ప్రవేశాలు - దరఖాస్తుల గడువు పొడిగింపు

12 October 2023, 13:44 IST

    • OU Distance Education Admissions 2023: దూర విద్యలో డిగ్రీ, పీజీ, ఎంబీఏ, ఎంసీఏ చేయాలనుకునేవారికి అలర్ట్ ఇచ్చింది ఉస్మానియా వర్శిటీ. దరఖాస్తుల గడువును పొడిగించింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
ఓయూ దూర విద్యలో డిగ్రీ, పీజీ ప్రవేశాలు
ఓయూ దూర విద్యలో డిగ్రీ, పీజీ ప్రవేశాలు

ఓయూ దూర విద్యలో డిగ్రీ, పీజీ ప్రవేశాలు

Prof. G. Ram Reddy Centre for Distance Education News: ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి కీలక అప్డేట్ ఇచ్చింది ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్‌ జి.రాంరెడ్డి సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ విభాగం. 2023–24 విద్యా సంవత్సరానికి సంబంధించి వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతూ ఇప్పటికే ప్రకటన విడుదల చేసింది. డిగ్రీ, పీజీ కోర్సులతో పాటు ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తోంది. జులై 20 నుంచి దరఖాస్తుల ప్రక్రియ మొదలుకాగా... గడువు ముగిసింది. అయితే ఈ తేదీని అక్టోబరు 20వ తేదీ వరకు పొడిగిస్తున్నట్లు అధికారులు ప్రకటన విడుదల చేశారు.

ట్రెండింగ్ వార్తలు

TS Cabinet Meeting : తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి, కానీ!

TS TET 2024 Exams : రేపట్నుంచే తెలంగాణ టెట్ పరీక్షలు- ఎగ్జామ్ షెడ్యూల్, అభ్యర్థులకు మార్గదర్శకాలివే!

TG ITI Admissions 2024 : టెన్త్ విద్యార్థులకు అలర్ట్... ఐటీఐ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల, ముఖ్య తేదీలివే

Food Inspection in Hyderabad : పాడైపోయిన ఆహార పదార్థాలు, పాటించని ప్రమాణాలు - తనిఖీల్లో విస్తుపోయే విషయాలు..!

ముఖ్య వివరాలు:

యూనివర్శిటీ - ప్రొఫెసర్‌ జి.రాంరెడ్డి సెంటర్‌ ఫర్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌, ఉస్మానియా వర్శిటీ

కోర్సుల వివరాలు: ఎంబీఏ, ఎంసీఏ, ఎంఏ, ఎంకాం, ఎమ్మెస్సీ, బీఏ, బీకాం, బీబీఏ, పీజీ డిప్లొమా కోర్సులు.

కోర్సుల వ్యవధి: ఆయా కోర్సులను అనుసరించి ఏడాది నుంచి మూడేళ్ల వరకు ఉంటుంది. డిప్లోమా కోర్సుల వ్యవధి సంవత్సరం

మీడియం : కొన్ని కోర్సులు తెలుగు మీడియంలో, మరికొన్ని ఇంగ్లీష్ మీడియాలో ఉన్నాయి.

అర్హత: కోర్సులను అనుసరించి ఇంటర్మీడియట్‌ (10+2) / తత్సమాన, గ్రాడ్యుయేషన్, బీకాం, టీఎస్‌ ఐసెట్‌/ ఏపీఐసెట్‌ ఎంట్రెన్స్ లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం - జులై 20 , 2023

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 20.10.2023

అధికారిక వెబ్ సైట్ - http://www.oucde.net/

ఇలా దరఖాస్తు చేసుకోండి...

-దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు మొదటగా http://www.oucde.net/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.

'-Click Here Below Link For Online Admission' అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఇక్కడ యూజీ, పీజీ, డిప్లోమా, ఎంబీఎం, ఎంసీఏ అనే ఆప్షన్లు కనిపిస్తాయి. మీరు ఏ కోర్సులో చేరాలనుకుంటున్నారో దానిపై క్లిక్ చేయాలి.

-ఇక్కడ మీరు రిజిస్ట్రేషన్ కావాలి. ఈ మెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ తప్పనిసరి. ఆ తర్వాత కోర్సు ఎంపిక చేసుకోవటం, ప్రాసెసింగ్ ఫీజు చెల్లించుకోవాలి. ఇక కోర్సుల ఫీజు సెమిస్టర్ల వారీగా కట్టుకోవచ్చు.

తదుపరి వ్యాసం