తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyd Real Estate : ఇక్కడైతే ఎకరం 50 కోట్లు.. అక్కడైతే 4 కోట్లే..! డల్లాస్, ఆస్టిన్ నగరాలవైపు తెలుగు Nriల చూపు

Hyd Real Estate : ఇక్కడైతే ఎకరం 50 కోట్లు.. అక్కడైతే 4 కోట్లే..! డల్లాస్, ఆస్టిన్ నగరాలవైపు తెలుగు NRIల చూపు

16 September 2023, 12:57 IST

    • Hyderabad Real Estate: భాగ్యనగరంలో భూమి ధరలు చుక్కలు చూపిస్తున్న సంగతి తెలిసిందే. ఏకంగా ఎకర భూమి వంద కోట్లు అమ్ముడుపోయిందంటే పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే అధిక ధరల నేపథ్యంలో తెలుగు ఎన్ఆర్ఐలు ఇక్కడ పెట్టుబడులు పెట్టే విషయంలో వెనకడుగు వేస్తున్నారట..!
హైదరాబాద్ రియల్ ఎస్టేట్
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ (Twitter)

హైదరాబాద్ రియల్ ఎస్టేట్

Hyderabad Real Estate: హైదరాబాద్‌లో విపరీతంగా భూముల ధరలు పెరిగిపోయాయి. ఇండ్లు, భూములపై పెట్టుబడి పెట్టాలంటేనే భయపడిపోతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటీవలే ప్రభుత్వం కోకాపేటలో వేసిన భూవేలం ప్రక్రియంలో ఎకరం భూమి ఏకంగా వందకోట్లకు అమ్ముడుపోయింది. ఇది సర్వత్రా చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. ఇక నగరంలోని ఐటీ కారిడార్ లోనూ భారీగా ధరలు పలుకుతున్నాయి. ఈ నేపథ్యంలో అనేక ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

TS CPGET 2024 : టీఎస్ సీపీగెట్ నోటిఫికేషన్ విడుదల, మే 18 నుంచి అప్లికేషన్లు ప్రారంభం

Road Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు- ఆరుగురు మృతి, 14 మందికి గాయాలు

Mutton Bone Stuck : పెళ్లి విందులో మటన్ బోన్ మింగేసిన వృద్ధుడు, శస్త్ర చికిత్స చేసి తొలగించిన వైద్యులు

Farmers Protest : అకాల వర్షాలకు తడిసి ముద్దైన వడ్లు, పలు జిల్లాల్లో రోడ్డెక్కిన రైతన్నలు

గతంలో విదేశాల్లో స్థిరపడిన ఎన్ఆర్ఐలు... హైదరాబాద్ లేదా చుట్టుపక్కల ప్రాంతాల్లో భూములు కొనడం లేదా అపార్ట్ మెంట్లు కట్టడం, విల్లాలు కొనుగోలు చేయటం ఎక్కవగా కనిపించేది. కానీ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఎన్ఆర్ఐలు కూడా వెనకడుగు వేస్తున్నారట..! హైదరాబాద్ లో భూములు కొనటం కంటే.. వారు స్థిరపడిన నగరాల్లోనే తక్కువ ధరలకే విక్రయించవచ్చనే భావనను వ్యక్తం చేస్తున్నట్లు ఓ నివేదిక పేర్కొంది.

తెలుగు ఎన్ఆర్ఐ కమ్యూనిటీలోని చాలా మంది అమెరికాలోని డల్లాస్, ఆస్టిన్ నగరాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారట..! హైదరాబాద్ లోని ఐటీ కారిడార్ పరిధిలో సగటును ఎకరానికి 50 కోట్లకుపైగా అమ్ముడుపోతుంది. కాని డల్లాస్, ఆస్టిన్ వంటి నగరాల్లో మాత్రం... ఎకరం నాలుగు నుంచి 6 కోట్ల మధ్యలోనే ధర ఉంది. హైదరాబాద్ లో పెట్టుబడిగా పెట్టే బదులు... అదే డబ్బుతో తక్కువ ధరలో పెట్టుబడి పెట్టి లాభాలు ఆర్జించవచ్చని ఎన్ఆర్ఐలు భావిస్తున్నారట..! దీంతో అమెరికాలోని వివిధ ప్రాంతాలలో నివసిస్తున్న సీనియర్ కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్‌లు, వైద్యులు, న్యాయవాదులు, వ్యాపారవేత్తలు ఇలాంటి నగరాలను పెట్టుబడి పెట్టేందుకు ఎంచుకునేందుకు ఆసక్తి కనబర్తుస్తున్నట్లు ఆ నివేదికలో పేర్కొంది. తాజా పరిస్థితులపై అక్కడ స్థిరపడిన ఓ వైద్యుడు స్పందిస్తూ... "ఇండియాలో గణనీయంగా భూముల ధరల పెరగడంతో ప్రత్యామ్నాయా మార్గాలను ఎంచుకోవాల్సి వస్తుంది" అని చెప్పినట్లు రాసుకొచ్చింది.

ఇక హైదరాబాద్ మాదిరి వాతావరణమే డల్లాస్ నగరంలో ఉండటం కూడా కలిసివచ్చే అంశంగా ఎన్ఆర్ఐలు భావిస్తున్నారట. తక్కవ వ్యయంతోనే ఇక్కడ జీవించే అవకాశం కూడా ఉండటం కలిసివచ్చే అంశంగా మారింది. అంతేకాకుండా... కీలకమైన అంతర్జాతీయ కంపెనీలు... ఆస్టిన్, డల్లాస్ నగరాల చుట్టు కొలువుదీరుతుండటంతో పెట్టుబడులు సంఖ్య కూడా పెరిగుతున్నట్లు అక్కడి ఎన్ఆర్ఐలు చెబుతున్నారు. ఈ నగరాల్లో రియల్ భూమ్ ఉండటంతో కొందరు మోసకారులు కూడా తెరపైకి వస్తున్నారట. అయితే ఆర్థిక వ్యవహారాల విషయం కావటంతో కొనుగోలుదారులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్న పరిస్థితులు అక్కడ కనిపిస్తున్నాయట..!

తదుపరి వ్యాసం