తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Akbaruddin Owaisi | అక్బరుద్దీన్‌ విద్వేషపూరిత వ్యాఖ్యల కేసు కొట్టేసిన నాంపల్లి కోర్టు

Akbaruddin Owaisi | అక్బరుద్దీన్‌ విద్వేషపూరిత వ్యాఖ్యల కేసు కొట్టేసిన నాంపల్లి కోర్టు

HT Telugu Desk HT Telugu

13 April 2022, 15:09 IST

    • విద్వేషపూరిత వ్యాఖ్యల కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీకి భారీ ఊరట కలిగింది. కేసును నాంపల్లి కోర్టు కొట్టివేసింది. పదేళ్ల నాటి రెండు కేసులను స్పెషల్ సెషన్స్ జడ్జి కొట్టివేశారు.
అక్బరుద్దీన్ ఓవైసీ
అక్బరుద్దీన్ ఓవైసీ

అక్బరుద్దీన్ ఓవైసీ

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ విద్వేషపూరిత కేసులో దాదాపు పదేళ్ల తర్వాత కోర్టు తీర్పు వెలువరించింది. రెండు కేసులను స్పెషల్ సెషన్స్ జడ్జి కొట్టివేశారు. అయితే ఈ సందర్భంగా న్యాయమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. కేసు కొట్టేసినంత మాత్రాన సంబరాలు చేసుకోవద్దని వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యాఖ్యలు మరోసారి చేయోద్దని.. అక్బరుద్దీన్‌ను కోర్టు ఆదేశించింది. దేశ సమగ్రతకు మంచిది కాదని పేర్కొంది. 30 మందికి పైగా సాక్షులను న్యాయస్థానం విచారించింది. తీర్పు దృష్ట్యా పాతబస్తీలో అదనపు బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Warangal Naimnagar Bridge : నయీంనగర్ బ్రిడ్జి పనుల పూర్తికి టైమ్ ఫిక్స్ - జూన్​ 15 డెడ్ లైన్​..!

AP TS Funeral Disputes: తెలుగు రాష్ట్రాల్లో ఆస్తి గొడవలతో ఆగిన అంత్యక్రియలు, ఆస్తుల కోసం అమానవీయ ఘటనలు

TS High Court Jobs 2024 : తెలంగాణ హైకోర్టు నుంచి 150 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ - దరఖాస్తులకు ఇవాళే చివరి తేదీ

NTR Property Dispute: ఆస్తి వివాదంలో ఎన్టీఆర్, బ్యాంకు వివాదంపై హైకోర్టులో పిటిషన్‌

ఏం జరిగిందంటే..?

దాదాపు పదేళ్ల క్రితం.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు ఇంకా ఆయనను వెంటాడుతూనే ఉన్నాయి. ఆ సమయంలో.. అక్బరుద్దీన్ చేసి వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. రెండు మతాల మధ్య చిచ్చు రేపినట్టైంది. అక్బరుద్ధీన్ తొమ్మిదేళ్ల క్రితం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అయిన నిర్మల్ లోను, నిజామాబాద్ పర్యటనలో హిందువులపై వ్యాఖ్యలు చేశారు. దీంతో వివాదం మెుదలైంది. అప్పట్లో కేసు నమోదైంది. దీనిపై.. కేసు కూడా నమోదైంది. నాంపల్లి కోర్టు సుదీర్ఘ విచారణ చేసింది. ఈ కేసు విషయంలో సుమారు 30 మంది సాక్షుల్ని విచారణ చేశారు. ఆయన వ్యాఖ్యాలపై పోలీసులే.. సుమోటోగా కూడా కేసు నమోదు చేశారు.

నిర్మల్‌లోని నిర్మల్ మున్సిపల్ గ్రౌండ్స్ లో 2012 డిసెంబరులో మజ్లిస్ పార్టీ బహిరంగ సమావేశం జరిగింది. ఈ సభలో ముఖ్యనేతలు పాల్గొన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ విద్వేషపూరిత ప్రసంగం చేశారు. ఈ అంశం అప్పట్లో దుమారం రేగింది. 'మీరు 100 కోట్ల మంది.. మేం కేవలం 25 కోట్ల జనాభా మాత్రమే. ఓ 15 నిమిషాలు మాకు అప్పగించండి. ఎవరు ఎక్కువో.. ఎవరు తక్కువో చూపిస్తాం.’ అని మాట్లాడారు.

ఈ ప్రసంగంపై ఐపీసీ 120- బీ నేరపూరిత కుట్ర, 153 ఏ రెండు గ్రూపుల మధ్య మతం పేరుతో విద్వేషం రెచ్చగొట్టేలా మాట్లాడడం, 295 ఏ ఉద్దేశపూర్వక, హానికరమైన చర్యలు, ఏ వర్గం వారి మతాన్ని లేదా మత విశ్వాసాలను అవమానించడం ద్వారా వారి మతపరమైన భావాలను ఆగ్రహానికి గురిచేయడం, 298 మతపరమైన భావాలను భంగం కలిగేలా మాట్లాడటంతోపాటు 188 సెక్షన్ కింద కేసులు నమోదయ్యాయి. ఆదిలాబాద్ లోనూ అక్బరుద్దీన్ హిందూ దేవతల వ్యాఖ్యలు చేశారు. వీటితో.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర చర్చ జరిగింది.

ఈ ప్రసంగం జరిగిన తర్వాత.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దుమారం రేగింది. కొన్ని రోజులకు అక్బరుద్దీన్ లండన్ వెళ్లారు. ఆ తర్వాత తిరిగి వచ్చాక.. పోలీసులు అరెస్టు చేశారు. సుమారు 40 రోజుల పాటు జైల్లోనే ఉన్నారు అక్బరుద్దీన్. అనంతరం బెయిల్ పై బయటకు వచ్చారు. దీనిపై.. నాంపల్లి కోర్టు సుదీర్ఘ విచారణ చేసింది. బుధవారం తీర్పు వస్తుందని.. అందరూ అనుకున్నారు. అయితే కోర్టు వాయిదా వేసింది. తాజాగా కేసును కొట్టివేస్తూ.. నిర్ణయం తీసుకుంది.

తదుపరి వ్యాసం