తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad: గణేష్ నిమజ్జనం... భక్తుల కోసం ప్రత్యేక Mmts సర్వీసులు - రూట్ల వివరాలివే

Hyderabad: గణేష్ నిమజ్జనం... భక్తుల కోసం ప్రత్యేక MMTS సర్వీసులు - రూట్ల వివరాలివే

27 September 2023, 9:20 IST

    • MMTS Special Services in Hyderabad: గణేష్ నిమజ్జనం వేళ దక్షిణ మధ్య రైల్వే చర్యలు చేపట్టింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని హైదరాబాద్ లో ఎంఎంటీఎస్ ప్రత్యేక సర్వీసులను ప్రకటించింది. ఈ మేరకు రూట్ల వివరాలను పేర్కొంది.
ఎంఎంటీఎస్ ప్రత్యేక రైళ్లు
ఎంఎంటీఎస్ ప్రత్యేక రైళ్లు

ఎంఎంటీఎస్ ప్రత్యేక రైళ్లు

MMTS Special services :గణేష్ నిమజ్జనం వేళ ప్రయాణికులకు అలర్ట్ ఇచ్చింది దక్షిణ మధ్య రైల్వ. హైదరాబాద్ నగరంలో రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేకంగా ఎంఎంటీెస్ రైళ్లను ప్రకటించింది. సెప్టెంబర్ 28, 29 తేదీల్లో నగరంలో భారీ ఎత్తున వినాయక నిమజ్జనాలు ఉన్న నేపథ్యంలో… ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. నగరం నలుమూలాల నుంచి నిమజ్జన వేడుకలను వీక్షించేందుకు భక్తులు ట్యాంక్ బండ్‌కు తరలివస్తుంటారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని నగరంలోని ఆయా ప్రాంతాల మధ్య ఈ ప్రత్యేక సర్వీసులను నడపనున్నట్టు దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది.

ట్రెండింగ్ వార్తలు

Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలు పని వేళల్లో మార్పులు, అధికారుల క్లారిటీ!

Love Fraud : : కి'లేడి' ప్రేమపేరుతో మోసం-ప్రియుడు ఆత్మహత్యాయత్నం

Mallareddy Land Issue : సుచిత్రలో భూవివాదం- అల్లుడు, అనుచరులతో కలిసి మల్లారెడ్డి హల్ చల్-ఆపై అరెస్ట్!

Khammam Crime News : ఖమ్మం జిల్లాలో దారుణం.. ఆస్తి కోసం తల్లితో పాటు ఇద్దరు కుమార్తెల హత్య

వివరాలివే:

సెప్టెంబర్‌ 28 గురువారం రాత్రి 11 గంటల నుంచి సెప్టెంబర్‌ 29 ఉదయం 4 గంటల వరకు ఈ ప్రత్యేక ఎంఎంటీఎస్‌ సర్వీసులు నడపాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. హైదరాబాద్‌- లింగంపల్లి, సికింద్రాబాద్‌- హైదరాబాద్‌, లింగంపల్లి- ఫలక్‌నుమా మధ్య మొత్తం ఎనిమిది రైళ్లు ప్రత్యేక సేవలందిస్తాయని పేర్కొంది.

హైదరాబాద్ - లింగపల్లి(GHL -5 ట్రైన్ నెంబర్)

సికింద్రాబాద్ - హైదరాబాద్(GHL -1)

లింగంపల్లి - ఫలక్ నుమా(GHL -6)

హైదరాబాద్ - లింగంపల్లి(GHL -2)

లింగంపల్లి - హైదరాబాద్(GHL -3)

ఫలక్ నుమా - సికింద్రాబాద్(GHL -7)

హైదరాబాద్ - సికింద్రాబాద్(GHL -4)

సికింద్రాబాద్ - హైదరాబాద్(GHL -8)

టీఎస్ఆర్టీసీ 535 ప్రత్యేక బస్సులు…

TSRTC Special Buses : హైదరాబాద్ లో ఈ నెల 28న గణేష్ నిమజ్జనం, శోభాయాత్ర సందర్భంగా భక్తుల కోసం 535 ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని ఒక్కో డిపో నుంచి 15 నుంచి 20 బస్సులను ఏర్పాటు చేశామన్నారు. వినాయకుడి నిమజ్జనంలో పాల్గొనే భక్తుల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. ప్రత్యేక బస్సులకు సంబంధించిన సమాచారం కోసం సికింద్రాబాద్ రేతిఫైల్‌ బస్‌ స్టేషన్‌లో 9959226154, కోఠి బస్‌ స్టేషన్‌లో 9959226160 నంబర్లను సంప్రదించగలరన్నారు.

వినాయక చవితి సందర్భంగా కొలువు తీరిన లంబోదరుడి విగ్రహాల నిమజ్జనానికి భాగ్యనగరం సిద్ధమవుతోంది. గణేష్ నిమజ్జనం నేపథ్యంలో విగ్రహాలను తరలించే మార్గాలను సీపీ సివి ఆనంద్ పరిశీలించారు. ఎంజే మార్కెట్‌కు సమీపంలోని కన్వర్జెన్స్ పాయింట్ వద్ద సమష్టిగా పని చేయాలని సీవీ ఆనంద్ జోనల్ డీసీపీలను ఆదేశించారు. బాలాపూర్ నుండి హుస్సేన్ సాగర్ మార్గంలో చాంద్రాయణగుట్ట, చార్మినార్, నయాపూల్, ఎంజే మార్కెట్, తెలుగు తల్లి ఫ్లైఓవర్, సెక్రటేరియట్, పీపుల్స్ ప్లాజా వరకు పోలీసుల తనిఖీలు సాగాయి. క్లిష్టమైన జంక్షన్లలో ఊరేగింపు కదలికలను పర్యవేక్షించాలని సూచించారు.

చార్మినార్ మరియు తెలుగు తల్లి ఫ్లైఓవర్ సమీపంలోని ప్రాథమిక ఊరేగింపు మార్గాలను పరిశీలించిన సందర్భంగా, విగ్రహాలను తీసుకువెళ్లే వాహనాలకు వాటి ఎత్తుకు తగినట్టుగా స్పష్టమైన సూచనల్ని పాటించేలా చూడాలని ఆదేశించారు. విగ్రహాల ఎత్తు పరిమితులను ధృవీకరించడం, తక్కువ ఎత్తులో ఉన్న వైర్లను గుర్తించి అడ్డంకులను పరిష్కరించడం మరియు ఊరేగింపుకు ఆటంకం కలిగించే అడ్డంకులను గుర్తించాలని అధికారులకు ఆదేశించారు.

తదుపరి వ్యాసం