తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  New It Centre In Telangana: మరో ఐటీ సెంటర్... 1200 మందికి ఉద్యోగావకాశాలు

New IT Centre in Telangana: మరో ఐటీ సెంటర్... 1200 మందికి ఉద్యోగావకాశాలు

HT Telugu Desk HT Telugu

22 February 2023, 15:44 IST

    • Welspun India Limited advanced textile Unit: రంగారెడ్డి జిల్లా చందన్వెల్లిలో వెల్స్పన్ ఇండియా లిమిటెడ్ అధునాతన టెక్స్‌టైల్ యూనిట్ ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రూ. 500 కోట్ల పెట్టుబడితో ఈ టెక్స్‌టైల్ యూనిట్ ఏర్పాటైంది. ఈ సందర్భంగా సంబంధిత కంపెనీ కీలక ప్రకటన చేసింది.
చందన్వెల్లిలో వెల్ స్పన్ ఐటీ సెంటర్
చందన్వెల్లిలో వెల్ స్పన్ ఐటీ సెంటర్

చందన్వెల్లిలో వెల్ స్పన్ ఐటీ సెంటర్

Welspun India Limited advanced textile facility Unit: తెలంగాణలో పెట్టుబడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే పలు అంతర్జాతీయ కంపెనీలు కూడా భారీ ఎత్తున ఇక్కడ కంపెనీలను నెలకొల్పాయి. తాజాగా వెల్ స్పన్ కంపెనీ కీలక ప్రకటన చేసింది. రంగారెడ్డి జిల్లాలోని చందన్వెల్లిలో ఐటీ సెంటర్ ని ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు కంపెనీ చైర్మన్ బాల క్రిష్ణ గొయెంకా కంపెనీ నిర్ణయాన్ని వెల్లడించారు. చందన్వెల్లి ప్రాంతంలో ప్రస్తుతం వెల్ స్పన్ కంపెనీ కొనసాగిస్తున్న తమ పెట్టుబడులకు అదనంగా ఐటీ మరియు ఐటీఈయస్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు

Khammam Crime News : ఖమ్మం జిల్లాలో దారుణం.. ఆస్తి కోసం తల్లితో పాటు ఇద్దరు కుమార్తెల హత్య

TS Govt Jobs 2024 : ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఉద్యోగాలు... రికార్డ్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినెట్ ఖాళీలు, ముఖ్య తేదీలివే

TS EAPCET 2024 Results : తెలంగాణ ఎంసెట్ ఫలితాలు వచ్చేశాయ్ - ఈ డైరెక్ట్ లింక్ తో మీ ర్యాంక్ చెక్ చేసుకోండి

18 May 2024 హైదరాబాద్ వాతావరణం ఎలా ఉంటుంది? పూర్తి సమాచారం తెలుసుకోండి

ఈ కేంద్రంలో ఐటీ రంగంలో శిక్షణ అందించి ఉద్యోగాలు కల్పించే బాధ్యతను తమ కంపెనీ తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. ఐటీ ఉద్యోగాల కోసం హైదరాబాద్, బెంగళూరు వెళ్లే యువకులు... చందన్వెల్లిలోనూ పనిచేసే స్థాయిలో తమ ఐటి సెంటర్ ఉంటుందని స్పష్టం చేశారు. భవిష్యత్తులో చందన్వెల్లి ప్రాంతంలోనూ ఐటి కార్యకలాపాలు విస్త్రృతం అవుతాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. వెల్ స్పన్ కంపెనీ ఇప్పటికే ఐటి మరియు ఐటిఈఎస్ రంగంలో అహ్మదాబాద్, బొంబాయిలలో కార్యకలాపాలను కొనసాగిస్తున్నట్లు తెలిపారు. వీటికి అదనంగా చందనవెల్లిలో తమ పారిశ్రామిక ప్రాంగణంలో కొత్త ఐటీ సెంటర్ ను ఏర్పాటు చేస్తామన్నారు.

చందన్ వెల్లిలో ఐటీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించిన వెల్ స్పన్ కంపెనీకి మంత్రి కేటీఆర్ ధన్యవాదాలు తెలిపారు. హైదరాబాద్ తోపాటు రంగారెడ్డిజిల్లాలోని ఇతర ప్రాంతాలకు ఐటీ విస్తరించాలన్న తమ ప్రభుత్వ లక్ష్యాన్ని వెల్ స్పన్ నిర్ణయం బలోపేతం చేస్తుందన్నారు. ఫలితంగా గచ్చిబౌలి, కొండాపూర్, పైనాన్షియల్ డిస్ర్టక్ట్ లాంటి ప్రాంతాల మాదిరి ఐటి కంపెనీలు ఏర్పాటు కావాలన్న స్థానిక ప్రజల ఆకాంక్ష కూడా వెల్ స్పన్ కేంద్రం ఏర్పాటుతో నెరవేరుతుందన్నారు. ఇక్కడి స్థానిక యువకులు సైతం ఐటీ ఉద్యోగాలు చేసుకునేందుకు ఈ సెంటర్ తో అవకాశం లభిస్తుందన్నారు. దాదాపు 1000 నుంచి 1200 మందికి ఐటీ ఉద్యోగాలు కల్పించే విధంగా ఈ సెంటర్ ని ఏర్పాటు చేస్తున్న కంపెనీ యాజమాన్యానికి మంత్రి ధన్యవాదాలు తెలిపారు.

వెల్ స్పన్ కంపెనీ రాకముందు చందన్వెల్లి, సీతారాంపూర్ లాంటి ప్రాంతాల్లో మచ్చుకు ఒక్క పరిశ్రమ అయినా కనిపించేది కాదన్న కేటీఆర్... ఇవాళ ఈ రెండు ప్రాంతాల్లో అనేక కంపెనీలు భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టి కంపెనీలను ఎర్పాటు చేయడంతో ఈ ప్రాంతం రూపురేఖలు మారిపోయాయన్నారు. ఇప్పడు ఐటీ కేంద్రం ఏర్పాటుతో మరిన్ని చిన్న మద్య తరహ కంపెనీలు ఈ ప్రాంతపైపు దృష్టి సారిస్తాయన్న అశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రజిత్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డితో పాటు పలవురు ప్రజాప్రతినిధులు, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.

తదుపరి వ్యాసం