తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Komatireddy Rajagopal: నేను కూడా మంత్రి అవుతానంటోన్న కోమటిరెడ్డి రాజగోపాల్

Komatireddy Rajagopal: నేను కూడా మంత్రి అవుతానంటోన్న కోమటిరెడ్డి రాజగోపాల్

Sarath chandra.B HT Telugu

07 December 2023, 11:07 IST

    • Komatireddy Rajagopal: రెండో విడత మంత్రి వర్గ విస్తరణలో తనకు కూడా మంత్రి పదవి దక్కుతుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. డిప్యూటీ సిఎం భట్టితో భేటీ అయిన కోమటిరెడ్డి తనకు కూడా మంత్రి పదవి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. 
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(ఫైల్ ఫొటో)
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(ఫైల్ ఫొటో)

కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(ఫైల్ ఫొటో)

Komatireddy Rajagopal: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం, మంత్రి వర్గ స్వీకారం జరుగుతున్న సమయంలో మాజీ ఎంపి కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మలివిడత విస్తరణలో తాను కూడా మంత్రి అవుతానంటూ ధీమా వ్యక్తం చేశారు. తన సోదరుడు వెంకటరెడ్డి మంత్రి పదవి వరించినా తనకు అడ్డం కాదన్నారు.

ట్రెండింగ్ వార్తలు

TS Cabinet Expansion : సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ లో మరో ఆరుగురికి ఛాన్స్, ఎవరెవరికి చోటు దక్కనుంది?

Hyderabad Real Estate Scam: హైదరాబాద్ లో మరో ప్రీ లాంచ్ రియల్ ఎస్టేట్ స్కామ్, రూ.60 కోట్లు వసూలు చేసిన భారతి బిల్డర్స్

Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలు పని వేళల్లో మార్పులు, అధికారుల క్లారిటీ!

Love Fraud : : కి'లేడి' ప్రేమపేరుతో మోసం-ప్రియుడు ఆత్మహత్యాయత్నం

రాజకీయాల్లో తనకు ఉన్న సామర్ధ్యాన్ని బట్టి తనకు కూడా మంత్రి పదవి వస్తుందని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విశ్వాసం వ్యక్తం చేశారు. తాను వచ్చిన తర్వాతే జిల్లా మొత్తాన్ని కాంగ్రెస్‌ పార్టీ స్వీప్ చేసినట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం కోసం తాము కొట్లాడామని, కోమటిరెడ్డి మంత్రి పదవిని సైతం వదులుకున్నారని చెప్పారు.

తాను కాంగ్రెస్‌ను వీడి బీజేపీలోకి వెళ్లినా అది కేసీఆర్‌ను గద్దె దించాలనే లక్ష్యంతోనే అన్నారు. ఆ ఆశయం కోసమే కాంగ్రెస్‌లోకి మళ్లీ వచ్చానని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆశీస్సులు తనకు ఉంటాయని చెప్పారు. సెకండ్ ఫేజ్‌లో తనకు కూడా మంత్రి పదవి అవకాశం వస్తుందని సమాచారం ఉందని, తాను కూడా మంత్రి అవుతానని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రాన్ని నంబర్ వన్ చేస్తానని కేసీఆర్‌ అప్పుల పాలు చేశాడని ఆరోపించారు. కేసీఆర్ రాష్ట్రాన్ని ఆగం చేశాడని, శ్రీధర్‌బాబు, భట్టి, తాను టీమ్‌గా రేవంత్‌‌తో కలిసి రాష్ట్రం కోసం పనిచేస్తామని చెప్పారు.

తదుపరి వ్యాసం