తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Chest Pain : దగ్గితే ప్రాణాలు నిలుస్తాయి-గుండెనొప్పి వచ్చినప్పుడు చేయాల్సింది ఇదే!

Chest Pain : దగ్గితే ప్రాణాలు నిలుస్తాయి-గుండెనొప్పి వచ్చినప్పుడు చేయాల్సింది ఇదే!

HT Telugu Desk HT Telugu

10 January 2024, 19:27 IST

    • Chest Pain :ఒంటరిగా ఉన్న సమయంలో మనకు ఒకవేళ గుండె నొప్పి వస్తే చేసుకోవాల్సిన ప్రథమ చికిత్స గురించి ప్రముఖ వైద్యురాలు గీతా క్రిష్ణ స్వామి ఓ వ్యాసంలో తెలిపారు. బాగా దగ్గితే ప్రాణాలు నిలుపుకోవచ్చని తెలిపారు.
దగ్గుతున్న మహిళ
దగ్గుతున్న మహిళ (unsplash )

దగ్గుతున్న మహిళ

Chest Pain : బాగా దగ్గితే ప్రాణాలు నిలుస్తాయి. ఆశ్చర్యంగా ఉంది కదూ! ఇది ముమ్మాటికీ నిజం. ఒంటరిగా ఉన్న సమయంలో మనకు ఒకవేళ గుండె నొప్పి వస్తే మనకు మనం చేసుకోవాల్సిన ప్రథమ చికిత్స ఇదేనట. ఈ ప్రథమ చికిత్స గురించి ప్రముఖ వైద్యురాలు గీతా క్రిష్ణ స్వామి రాసిన విషయాన్ని చదివి తెలుసుకుందాం. గుండెపోటు వచ్చినప్పుడు సహాయం చేయడానికి కనుచూపు మేరలో ఎవరూ లేని పక్షంలో హాస్పిటల్ చికిత్స అందేలోపు ఒకరికి ఒకరు వెంటనే ఇచ్చే సీపీఆర్ చికిత్స గురించి తెలిసినా కూడా ఎవరికి వారే చికిత్స చేసుకోవడం సాధ్యమయ్యే పని కాదు. ఇలాంటి సమయాల్లో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్న దుస్థితి నెలకొంది. ఇలాంటి పరిస్థితిలో మన ప్రాణాలను మనమే ఎలా కాపాడుకోవచ్చు? ఇది చదివిన తర్వాత అది చాలా సులభమని తెలిసిపోతుంది. క్లిష్టమైన ఆ ఘడియల్లో గుండె కొట్టుకోవటంలో లయ తప్పుతోందని మనకు అర్థం అవుతోంది. ఆ సమయంలో దగ్గరలో ఎలాంటి సహాయం అందే మార్గం లేనప్పుడు ఇక స్పృహ కోల్పోతామేమో అనే దశలోనూ మన ప్రాణాలను మనమే నిలబెట్టుకోవచ్చు. ఓ పది సెకండ్ల సమయం మాత్రమే మన చేతిలో ఉందనగా చేయాల్సింది ఒక్కటే. ఆ పది సెకండ్ల అమూల్యమైన సమయంలో మనం చేయవలసినది కేవలం దగ్గటం మాత్రమే. ఆశ్చర్యంగా ఉంది కదూ. పెద్దగా దగ్గుతూ ఆ దగ్గును రిపీట్ చేస్తుండటమే ఇక్కడ చేసుకోవాల్సిన ప్రథమ చికిత్స.

ట్రెండింగ్ వార్తలు

10 Years Telangana: ఉమ్మడి రాజధాని గడువు మరో పక్షం రోజులే.. జూన్‌2 తర్వాత ఆస్తుల స్వాధీనం చేసుకోవాలని సిఎం రేవంత్ ఆదేశం

BRS RakeshReddy: బీఆర్ఎస్ లో 'రాకేశ్ రెడ్డి' పంచాయితీ!కోఆర్డినేషన్ మీటింగ్‌ కు ముఖ్య నేతలంతా డుమ్మా

TS CPGET 2024 : టీఎస్ సీపీగెట్ నోటిఫికేషన్ విడుదల, మే 18 నుంచి అప్లికేషన్లు ప్రారంభం

Road Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు- ఆరుగురు మృతి, 14 మందికి గాయాలు

ఆగకుండా దగ్గాలి

దగ్గే ముందు ఊపిరి బాగా పీల్చుకుంటూ దగ్గుతుండాలి. ఒకసారి ఊపిరి పీల్చుకుని దగ్గటానికి రెండు సెకండ్ల చొప్పున కేటాయిస్తూ బాగా లోతు నుంచి దగ్గాలి. ఒక వేళ కఫం ఉన్నట్లయితే అది బయటకు వచ్చేటట్లు ఎలా దగ్గుతామో అంత ఉద్ధృతంగా, ఆగకుండా దగ్గాలి. మనకు ఏదైనా సహాయం అందే వరకూ దగ్గుతూనే ఉండాలి. ఈలోగా గుండెలో సరైన మార్పు వచ్చి మాములుగా కొట్టుకోవటం కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇలా దగ్గటం మనకు ఎంతలా సహాయపడుతుందంటే మనం గట్టిగా ఊపిరి పీల్చినప్పుడు, మన ఊపిరితిత్తులు, ప్రాణ వాయువుతో(ఆక్సిజన్) పూర్తిగా నిండిపోతాయి. దీంతో గుండె మీద తీవ్రమైన ఒత్తిడి పెరుగుతుంది. ఆ ఒత్తిడి వల్ల గుండెలో ఉన్న రక్త నాళాలు స్పందించి, మరల సరైన రీతిలో రక్త ప్రసరణ జరిగుతుంది. ఈ ఫలితంగా గుండె కొట్టుకోవటంలో లయ మళ్లీ యథా స్థితికి చేరుకోవటానికి తోడ్పడుతుంది. అంటే చికిత్స అందేలోపల మనకు మనమే ప్రథమ చికిత్స చేసుకుంటూ ఇలా ప్రాణాలను నిలుపుకోవచ్చన్నమాట. ఆ తర్వాత హాస్పిటల్ కి వెళితే వైద్యులు చికిత్స అందించి ప్రాణాన్ని గట్టెక్కిస్తారు. గుండెల్లో నొప్పి వచ్చిన క్రమంలో ఏం చేయాలో తెలియక చాలా మంది ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితిని చూస్తున్నాం. ఇలాంటి చిన్నపాటి "ట్రిక్"తెలిస్తే కొద్ది మందికైనా ఉపకరిస్తుంది.

రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఖమ్మం

తదుపరి వ్యాసం