తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Congress Janagarjana : కాంగ్రెస్ జనగర్జన సభకు అడ్డంకులు, ఎక్కడికక్కడే వాహనాలు నిలిపివేత- కాంగ్రెస్ నేతలు ఫైర్

Congress Janagarjana : కాంగ్రెస్ జనగర్జన సభకు అడ్డంకులు, ఎక్కడికక్కడే వాహనాలు నిలిపివేత- కాంగ్రెస్ నేతలు ఫైర్

02 July 2023, 16:55 IST

    • Congress Janagarjana : కాంగ్రెస్ సభకు ప్రజలు, పార్టీ శ్రేణులు హాజరుకాకుండా చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర చేస్తుందని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. సభకు వస్తున్న వాహనాలను పోలీసులు అడ్డుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
టి.కాంగ్రెస్ నేతలు
టి.కాంగ్రెస్ నేతలు

టి.కాంగ్రెస్ నేతలు

Congress Janagarjana : ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న జనగర్జన సభపై బీఆర్ఎస్ ప్రభుత్వం ఆంక్షలు విధించిందని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. టీఎస్ఆర్టీసీ బస్సులు అద్దెకు ఇవ్వకుండా అడ్డుకొన్నారని, ఆ తర్వాత ప్రైవేట్ వాహనాలపై ఆంక్షలు విధించారని ఆరోపించారు. ఖమ్మం జిల్లాలో రాత్రికి రాత్రి పలు చోట్ల చెక్ పోస్ట్‌లు పెట్టి, కాంగ్రెస్ సభకు జనం రాకుండా అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ వాహనాలపై పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. జూలూరుపాడు వద్ద వాహనాలను నిలిపివేసి కేసులు నమోదు చేశారని అంటున్నారు. నల్గొండ జిల్లా నుంచి వస్తున్న వాహనాలను అడ్డుకుంటున్నారన్నారు. అన్ని పత్రాలున్నా కావాలనే పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గీయులు అంటున్నారు. కాంగ్రెస్ జనగర్జన సభకు జనం రాకుండా చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీఏ, పోలీస్ సిబ్బందితో వాహనాలను అడ్డుకుంటున్నారని పొంగులేటి మండిపడుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Sundilla Parvathi Barrage : ఖాళీ అయిన సుందిళ్ల పార్వతి బ్యారేజీ, చేపల కోసం ఎగబడ్డ స్థానికులు

Wardhannapet Govt Hospital : వర్ధన్నపేటలో దారుణం-ఫోన్లో డాక్టర్ డైరెక్షన్ గర్భిణీకి నర్సులు డెలివరీ, శిశువు మృతి

TS Universities VCs : తెలంగాణలో వీసీల నియామకంపై కసరత్తు, 10 యూనివర్సిటీలకు 1382 అప్లికేషన్లు

WhatsApp Triple Talaq : వాట్సాప్ లో భార్యకు ట్రిపుల్ తలాక్, ఆదిలాబాద్ లో వ్యక్తి అరెస్టు

డీజీపీకి రేవంత్ రెడ్డి ఫిర్యాదు

ఖమ్మం సభకు కాంగ్రెస్‌ కార్యకర్తలు, ప్రజలు రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. పోలీసుల తీరుపై డీజీపీ అంజనీ కుమార్‌కు రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని రేవంత్‌ ఫైర్ అయ్యారు. ఖమ్మం సభకు వచ్చే వాహనాలను, కాంగ్రెస్‌ శ్రేణులను అడ్డుకోకుండా ఆదేశాలివ్వాలని డీజీపీని రేవంత్‌ రెడ్డి కోరారు. అయితే సభకు వెళ్లే వాహనాలను అడ్డుకోవద్దని ఆదేశాలిస్తామని కాంగ్రెస్ నేతలకు డీజీపీ హామీ ఇచ్చారు.

ఏం జరిగినా సీఎం కేసీఆర్ దే బాధ్యత- ఎంపీ కోమటిరెడ్డి

కాంగ్రెస్ జనగర్జన సభకు బీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తుందని ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. రాహుల్ గాంధీ సభకు అడుగడుగునా ఆంక్షలు విధించడమేంటని మండిపడ్డారు. ఖమ్మంలో కాంగ్రెస్ సభకు శనివారం రాత్రి నుంచి ఆంక్షలు పెట్టారని, బస్సులను ఖమ్మంలోకి రాకుండా సరిహద్దుల్లో అడ్డుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ శ్రేణులపై అక్రమ అరెస్టులు చేస్తున్నారన్నారు. కాంగ్రెస్ సభలకు ఆర్టీసీ వాహనాలు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ప్రైవేట్ వాహనాల్లో జనం సభకు వస్తుంటే ఆ వాహనాలను అడ్డుకోవడం కరెక్ట్ కాదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా సభ నిర్వహిస్తామన్నారు. ఏదైనా జరిగితే ప్రభుత్వం, ముఖ్యమంత్రిదే బాధ్యత అని కోమటిరెడ్డి హెచ్చరించారు.

రేణుక చౌదరి వాహనాన్ని అడ్డుకున్న పోలీసులు

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి రేణుక చౌదరి ఖమ్మంలో జరిగే కాంగ్రెస్ జన గర్జన బహిరంగ సభకు హాజరయ్యేందుకు బయలుదేరారు. అయితే ఖమ్మం నగరంలోని కరుణగిరి వద్ద రేణుక చౌదరి వాహనాన్ని పోలీసులు అడ్డగించారు. దీంతో ఆమె బారికేడ్లను తోసుకుని ఖమ్మం సభా ప్రాంగణానికి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా రేణుక చౌదరి మాట్లాడుతూ... పోలీసులు బారికేడ్లు పెడితే నేను అగుతానా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు సీఎం కేసీఆర్ నిజ స్వరూపం బయటపడిందని విమర్శించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఖమ్మం వస్తుండడంతో కేసీఆర్ కు భయంపట్టుకుందని విమర్శించారు.

తదుపరి వ్యాసం