తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Kvs Hyd Recruitment 2023: కేంద్రీయ విద్యాలయంలో టీచింగ్, నాన్ టీచింగ్ జాబ్స్.. కేవలం ఇంటర్వూనే

KVS Hyd Recruitment 2023: కేంద్రీయ విద్యాలయంలో టీచింగ్, నాన్ టీచింగ్ జాబ్స్.. కేవలం ఇంటర్వూనే

HT Telugu Desk HT Telugu

08 March 2023, 14:05 IST

    • KVS recruitment Hyderabad 2023: పలు ఉద్యోగాల భర్తీకి హైదరాబాద్‌ శివరాంపల్లిలోని కేంద్రీయ విద్యాలయం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది. ఈ మేరకు వివరాలను పేర్కొంది.
కేంద్రీయ విద్యాలయంలో టీచర్ పోస్టులు
కేంద్రీయ విద్యాలయంలో టీచర్ పోస్టులు

కేంద్రీయ విద్యాలయంలో టీచర్ పోస్టులు

Kendriya Vidyalaya Recruitment 2023: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది హైదరాబాద్‌ శివరాంపల్లిలోని కేంద్రీయ విద్యాలయం. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భాగంగా టీచింగ్ తో పాటు మరికొన్ని నాన్ టీచింగ్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. పోస్టును అనుసరించి బీఈడీ/ డిగ్రీ/ డిప్లొమా/ బీఈ/బీఎస్సీ/ డీఈడీ/ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ/ పీజీ డిగ్రీ/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు అవుతారు. ఎలాంటి రాతపరీక్ష లేకుండానే... ఇంటర్వూల ద్వారా ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ కేటగిరిలో ఆయా పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు.

ట్రెండింగ్ వార్తలు

10 Years Telangana: ఉమ్మడి రాజధాని గడువు మరో పక్షం రోజులే.. జూన్‌2 తర్వాత ఆస్తుల స్వాధీనం చేసుకోవాలని సిఎం రేవంత్ ఆదేశం

BRS RakeshReddy: బీఆర్ఎస్ లో 'రాకేశ్ రెడ్డి' పంచాయితీ!కోఆర్డినేషన్ మీటింగ్‌ కు ముఖ్య నేతలంతా డుమ్మా

TS CPGET 2024 : టీఎస్ సీపీగెట్ నోటిఫికేషన్ విడుదల, మే 18 నుంచి అప్లికేషన్లు ప్రారంభం

Road Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు- ఆరుగురు మృతి, 14 మందికి గాయాలు

ముఖ్య వివరాలు:

భర్తీ చేసే పోస్టులు - పీజీటీ , టీజీటీ, పీఆర్‌టీ, ఒకేషనల్ కోచ్‌, కంప్యూటర్ ఇన్‌స్ట్రక్టర్, మ్యూజిక్ టీచర్, డ్యాన్స్ టీచర్, స్పోర్ట్స్ కోచ్, ఆర్ట్స్ టీచర్, డాక్టర్, నర్స్, స్పెషల్ ఎడ్యుకేటర్ ఎడ్యుకేషనల్ కౌన్సిలర్.

విభాగాలు - ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, బయాలజీ, కంప్యూటర్ సైన్స్, కామర్స్, ఎకనామిక్స్, హిందీ, ఇంగ్లీష్.

అర్హతలు: పోస్టును అనుసరించి బీఈడీ/ బ్యాచిలర్స్ డిగ్రీ/ డిప్లొమా/ బీఈ/బీఎస్సీ/ డీఈడీ/ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ/ పీజీ డిగ్రీ/ మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత తప్పనిసరి. కొన్ని పోస్టులకు డెమోలు కూడా నిర్వహించే అవకాశం ఉంది.

వయోపరిమితి - 18-65 ఏళ్లు ఉండాలి.

దరఖాస్తు విధానం - ఆఫ్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం - రాత పరీక్ష లేదు. ఇంటర్వ్యూలో మెరిట్ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

జీతభత్యాలు - నెలకు రూ.21, 250 - రూ.27,500

ఇంటర్వ్యూ తేది: 10.03.2023.

ఇంటర్వ్యూ టైం: ఉదయం 8:30, మధ్యాహ్నం 12:30.

ఇంటర్వ్యూ వేదిక: KENDRIYA VIDYALAYANO SVP NPA, HYDERABAD - 500052.

NOTE: ఇందుకు సంబంధించిన ఇతర అప్డేట్స్ తో పాటు మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు https://npasvp.kvs.ac.in/ వెబ్ సైట్ ను సందర్శించండి.

తదుపరి వ్యాసం