తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Nalgonda Congress: బీసీలకు టిక్కెట్లు.. ఉదయ్‌పూర్‌ డిక్లరేషన్ సాధ్యమేనా..?

Nalgonda Congress: బీసీలకు టిక్కెట్లు.. ఉదయ్‌పూర్‌ డిక్లరేషన్ సాధ్యమేనా..?

HT Telugu Desk HT Telugu

01 September 2023, 12:55 IST

    • Nalgonda Congress: నల్గొండ కాంగ్రెస్‌లో బీసీ అభ్యర్థులకు టిక్కెట్ల కేటాయింపులో  వివాదాల తుట్టెను  ఎంపీ కోమటిరెడ్డి కదిలించారు. లోక్ సభ నియోజక వర్గ పరిధిలో రెండు సీట్ల కేటాయింపు సాధ్యమైనా..? ఉమ్మడి నల్గొండ జిల్లాలో నాలుగు సీట్లు బీసీలకు దక్కుతాయా అనే సందేహాలు నెలకొన్నాయి. 
కాంగ్రెస్‌లో ఉదయ్‌పూర్‌ డిక్లరేషన్‌ అమలు సాధ్యమేనా
కాంగ్రెస్‌లో ఉదయ్‌పూర్‌ డిక్లరేషన్‌ అమలు సాధ్యమేనా

కాంగ్రెస్‌లో ఉదయ్‌పూర్‌ డిక్లరేషన్‌ అమలు సాధ్యమేనా

Nalgonda Congress: తెలంగాణ శాసన సభకు జరగనున్న ఎన్నికల్లో విజయం సాధించి అధికారాన్ని దక్కించుకుంటామన్న ధీమాతో ఉన్న కాంగ్రెస్ పార్టీకి రోజుకో కొత్త తలనొప్పి తయారవుతోంది. ఒక వైపు పార్టీలోని సీనియర్ నేతలంతా తమ కుటుంబ సభ్యులకూ అవకాశం ఇవ్వాల్సిందేనని కోరుతుండడం, కొన్ని కుటుంబాల్లో, ఇద్దరు, ముగ్గురు టికెట్లు ఆశిస్తున్న నేపథ్యంలో దరఖాస్తులను వడబోసే పనిలో తెలంగాణ పీసీసీ నాయకత్వం ఉంది.

ట్రెండింగ్ వార్తలు

BC RJC CET Results 2024 : టీఎస్ బీసీ గురుకుల ఇంటర్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, రేపట్నుంచి కాలేజీల్లో రిపోర్ట్!

Bhongir Fire Accident : పెట్రోల్ బంక్ లో పేలిన లారీ డీజిల్ ట్యాంక్, తప్పిన పెను ప్రమాదం!

Sircilla Crime : పేగు బంధాన్ని తెంచుకున్న పేరెంట్స్, కూతురికి ఉరి వేసి హత్య!

Sundilla Parvathi Barrage : ఖాళీ అయిన సుందిళ్ల పార్వతి బ్యారేజీ, చేపల కోసం ఎగబడ్డ స్థానికులు

ఈ వివాదం కొనసాగతుండగానే.. ఇపుడు బీసీలకు ఎన్నిటికెట్లు ఇస్తారు అన్న ప్రశ్న కాంగ్రెస్ నాయకత్వాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. ముందు నుంచి కాంగ్రెస్ లో బీసీలకు దక్కిన సీట్ల సంఖ్య తక్కువే. ఇటీవలనే టికెట్లను ప్రకటించిన బీఆర్ఎస్ కూడా ఇదే విమర్శ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇలాంటి తరుణంలో కాంగ్రెస్ త్వరలో తమ అభ్యర్థులను ప్రకటించనుండడంతో బీసీ వివాదం తెరపైకి వచ్చింది.

వివాద తుట్టెను కదిల్చిన ఎంపీ కోమటిరెడ్డి…

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీగా 2014 లో కాంగ్రెస్ తామే అధికారంలోకి వస్తామని భావించింది. అనూహ్యంగా బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తిరిగి 2018 లో జరిగిన ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ తన సీట్ల సంఖ్యను పెంచుకుని మంచి మెజారిటీ సీట్లతో రెండో సారి అధికారం చేపట్టింది.

రాష్ట్ర ఆవిర్భావం తర్వాత జరగుతున్న మూడో ఎన్నికల్లోనూ విజయం సాధించి అధికారం చేపట్టాలని బీఆర్ఎస్ వేగంగా పావులు కదుపుతోంది. మరో వైపు బీఆర్ఎస్‌ను ధీటుగా ఎదుర్కొంటాం అధికారంలోకి తామే వస్తామని విశ్వాసం ప్రకటిస్తున్న కాంగ్రెస్‌కు ముందంతా ముళ్ల బాటే కనిపిస్తోంది.

గతేడాది మేలో రాజస్థాన్ రాష్ట్రం ఉదయ్ పూర్ లో జరిగిన కాంగ్రెస్ చింతన్ శిబిర్ లో ప్రకటన చేసింది. ఉదయ్ పూర్ డిక్లరేషన్ గా చెప్పుకుంటున్న ఆ ప్రకటనలో.. ప్రతి లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో రెండు స్థానాలను బీసీలకు కేటాయించాలని తీర్మానించారు.

ఇపుడు కాంగ్రెస్ లోని బీసీ నాయకత్వం ఉదయ్ పూర్ డిక్లరేషన్ ప్రకారం తమకు సీట్లను కేటాయించాలని డిమాండ్ చేస్తోంది. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాజాగా ఈ వివాదాల తేనెతుట్టెను కదలించారు. బీసీలకు సరిపడా టికెట్లు కేటాయిస్తామంటే తాను పోటీ చేయాలని భావిస్తున్న నల్లగొండ అసెంబ్లీ సీటును బీసీలకు త్యాగం చేస్తానని ప్రకటించారు.

అయితే, నేతలంతా ఈ పనిచేయాలని మెలిక పెట్టారు. కాంగ్రెస్ లో ఒక్కో నాయకుడు తమకు రెండేసి, మూడేసి టికెట్లు కావాలని దరఖాస్తులు చేయించడంతో ఇలా ఎక్కడ సాధ్యం అవుతుంతనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

చెప్పుకోదగిన స్థానాలు ఇవ్వనే లేదు…

ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో 12 అసెంబ్లీ స్థానాలకు గాను ఒక ఎస్టీ, రెండు ఎస్సీ రిజర్వుడు స్థానాలు పోను మిగిలిన తొమ్మది చోట్ల ఇప్పటి వరకు కాంగ్రెస్ లో బీసీలకు చెప్పుకోదగిన స్థానాలు ఇవ్వలేదు.

కాంగ్రెస్‌ గత చరిత్రను తవ్వినా.. ఒక్క ఆలేరులోనే బూడిద బిక్షమయ్య గౌడ్ మాత్రమే బీసీ ఎమ్మెల్యేగా కనిపిస్తారు. ఆయన 2009 ఎన్నికల్లో గెలిచారు. ఆ మరుసటి ఎన్నికల్లో పోటీ చేసినా ఓటమి పాలయ్యారు. మిగిలిన భువనగిరి, మునుగోడు, నల్లగొండ, సూర్యాపేట, కోదాడ, హుజూర్ నగర్, మిర్యాలగూడెం, నాగార్జున సాగర్ స్థానాల్లో బీసీలకు టికెట్లు ఇచ్చిన చరిత్రే కాంగ్రెస్‌ పార్టీకి లేదు.

మరిపుడు ఉదయ్ పూర్ డిక్లరేషన్ మేరకు నల్లగొండ లోక్ సభ స్థానం పరిధిలో రెండు, భువనగిరి లోక్ సభ నియోజకవర్గం పరిధిలో రెండు టికెట్లు కేటాయిస్తారా అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. భువనగిరి పరిధిలోని జనగామ అసెంబ్లీ స్థానం నుంచి పీసీసీ మాజీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యకు ఈ సారి కూడా టికెట్ దక్కొచ్చు. ఇదే ఎంపీ స్థానం పరిధిలోని ఆలేరు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బీర్ల ఐలయ్య యాదవ్ టికెట్ ఆశిస్తున్నారు. ఆయనకు దక్కుతుందో లేదో చెప్పలేని పరిస్థితులో ఉన్నాయి.

నల్లగొండ నుంచి ఆశావహులు ఎక్కువే

మరో వైపు నల్లగొండ పార్లమెంటులో పరిధిలో దేవరకొండ ఎస్టీ, రిజర్వుడు నియోజకవర్గాన్ని మినహాయిస్తే మిగిలిన ఆరు జరనల్ స్థానాలే ఉన్నాయి. ఎంపీ కోమటిరెడ్డి త్యాగం చేస్తానని చెబుతున్న నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తమకు టికెట్ కావాలని బీసీ నేతలు డాక్టర్ చెరుకు సుధాకర్ గౌడ్, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు తండు సైదుల గౌడ్, నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మీ తదిరతులు దరఖాస్తు చేసుకున్నారు.

ఇక్కడి నుంచే కాకుండా మునుగోడు, ఇతర నియోజకవర్గాల్లో బీసీలు టికెట్లు ఆశిస్తున్నారు. వీరందరినీ ఎలా సర్దుబాటు చేస్తారు..? నిజంగానే ఉదయ్ పూర్ డిక్లరేషన్ ను పరిగణలోకి తీసుకుని బీసీలకు నిర్ణీత సంఖ్యలో టికెట్లు ఇస్తారా అన్న ప్రశ్నలకు త్వరలోనే సమధానాలు దొరుకుతాయని కాంగ్రెస్ వర్గాలు ఎదురు చూస్తున్నాయి.

(రిపోర్టింగ్ క్రాంతీపద్మ, నల్లగొండ)

తదుపరి వ్యాసం