తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Irctc Tour Package: కూనూర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ ప్యాకేజీపై ఓ లుక్కేయండి

IRCTC Tour Package: కూనూర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? ఈ ప్యాకేజీపై ఓ లుక్కేయండి

HT Telugu Desk HT Telugu

29 September 2022, 16:55 IST

    • hyderabad conoor tour package: హైదరాబాద్ నుంచి కూనూర్ టూర్ ప్యాకేజీ ప్రకటించింది ఐఆర్‌సీటీసీ టూరిజం. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.
కన్నూరు హైదరాబాద్ టూర్ ప్యాకేజీ
కన్నూరు హైదరాబాద్ టూర్ ప్యాకేజీ (HT)

కన్నూరు హైదరాబాద్ టూర్ ప్యాకేజీ

irctc tourism coonoor ooty tour package from hyd: వేర్వురు ప్రదేశాలను దర్శించుకునేందుకు కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది ఐఆర్‌సీటీసీ టూరిజం. తాజాగా హైదరాబాద్ నుంచి కూనూర్ టూర్ ప్యాకేజీని ప్రకటించింది. Ultimate Ooty Ex Hyderabad పేరుతో ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. ట్రైన్ జర్నీ ద్వారా సాగే ఈ టూర్ లో... పలు పర్యాటక ప్రాంతాలను చూపించనుంది. కన్నూరుతో పాటు ఊటీ వంటి పలు పర్యాటక ప్రాంతాలు కవర్ అవుతాయి. ఇందుకు సంబంధించిన వివరాలు చూస్తే.....

ట్రెండింగ్ వార్తలు

BC RJC CET Results 2024 : టీఎస్ బీసీ గురుకుల ఇంటర్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, రేపట్నుంచి కాలేజీల్లో రిపోర్ట్!

Bhongir Fire Accident : పెట్రోల్ బంక్ లో పేలిన లారీ డీజిల్ ట్యాంక్, తప్పిన పెను ప్రమాదం!

Sircilla Crime : పేగు బంధాన్ని తెంచుకున్న పేరెంట్స్, కూతురికి ఉరి వేసి హత్య!

Sundilla Parvathi Barrage : ఖాళీ అయిన సుందిళ్ల పార్వతి బ్యారేజీ, చేపల కోసం ఎగబడ్డ స్థానికులు

hyderabad coonoor tour: అక్టోబర్ 11వ తేదీన ఈ టూర్ అందుబాటులో ఉంది. ప్రతి మంగళవారం తేదీల్లో ఈ టూర్ ను ఆపరేట్ చేసున్నారు. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది.

Day - 1: తొలిరోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ (శబరి ఎక్స్ ప్రెస్ - 17230) నుంచి రాత్రి 12.20 గంటలకు జర్నీ ప్రారంభం అవుతుంది. రాత్రంతా జర్నీలో ఉంటారు.

Day -2: రెండోరోజు కోయంబత్తురు రైల్వేస్టేషన్ కు చేరుకుంటారు. అక్కడ్నుంచి 90 కి.మీల దూరంలో ఉండే ఊటీకి వెళ్తారు. మధ్యాహ్నం బోటానికల్ గార్జెన్, ఊటీ లేక్ ను సందర్శించారు. రాత్రి ఊటీలోనే బస చేస్తారు.

Day -3 : మూడోరోజు హోటల్ లో బ్రేక్ ఫాస్ట్ అయిన తర్వాత దొడబెట్ట పీక్, టీ మ్యూజియం, పైకారా ఫాల్స్ ను చూస్తారు. ఈరోజు కూడా ఊటీలోనే ఉంటారు.

Day -4: నాల్గొ రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత కూనూర్ పలు పర్యాటక ప్రాంతాలను చూడాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఊటీకి తిరిగి వస్తారు. రాత్రి అక్కడే బస చేస్తారు.

Day - 5: ఐదో రోజు బ్రేక్ ఫాస్ట్ తర్వాత మధ్యాహ్నం సమయానికి కోయంబత్తూరు చేరుకుంటారు. అక్కడ 04.35 గంటలకు రైలు ఎక్కితే... ఆరో రోజు అర్ధరాత్రి 12:20 గంటలకు హైదరాబాద్ చేరుకోవటంతో టూర్ ప్యాకేజీ ముగుస్తుంది.

ధరలివే....

hyderabad coonoor tour cost సింగిల్ షేరింగ్ కు 28,670 ధర ఉండగా.. డబుల్ షేరింగ్ కు రూ. 17,460 ధరగా ప్రకటించారు. ట్రిపుల్ షేరింగ్ కు 14,120 గా నిర్ణయించారు. కంఫార్ట్ 3 టైర్ ఏసీ కోచ్ లో ఈ ధరలు ఉంటాయి. టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, వీసా ఛార్జీలు, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. పూర్తి వివరాలను కింద ఇచ్చిన జాబితాలో చూసుకోవచ్చు.

<p>ధరల వివరాలు&nbsp;</p>

NOTE:

లింక్ పై క్లిక్ చేసి ప్యాకేజీ పూర్తి వివరాలు తెలుసుకోవటంతో పాటు బుకింగ్ చేసుకోవచ్చు.

తదుపరి వ్యాసం