తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Irctc Kashi Tour : హైదరాబాద్ నుంచి కాశీ విశ్వనాథ్ టూర్ ప్యాకేజీ.. వివరాలివే

IRCTC Kashi Tour : హైదరాబాద్ నుంచి కాశీ విశ్వనాథ్ టూర్ ప్యాకేజీ.. వివరాలివే

HT Telugu Desk HT Telugu

10 December 2022, 16:30 IST

    • IRCTC Tour From Hyderabad : ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీలు ప్రకటిస్తోంది. హైదరాబాద్ నుంచి ప్రధాన ఆలయాలను దర్శించేందుకు కొత్తగా ప్యాకేజీ ప్రకటించింది. ఈ ప్యాకేజీకి సంబంధించిన ఇలా ఉన్నాయి.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (unsplash)

ప్రతీకాత్మక చిత్రం

IRCTC Jai Kashi Viswanath Gange Tour Package : దేశంలోని ముఖ్యమైన ఆలయాలను దర్శించుకునేందుకు ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీలను ప్రకటిస్తోంది. అందుబాటులో ధరలో సందర్శన చేయిస్తుంది. కొత్త కొత్త ప్యాకేజీలను ప్రకటిస్తోంది. తాజాగా హైదరాబాద్(Hyderabad) నుంచి జై కాశీ విశ్వనాథ్(Kashi Viswanath) టూర్ ప్యాకేజీని ప్రకటించింది. ఈ టూర్ లో ప్రయాగ్ రాజ్(PRAYAGRAJ), సార్ నాథ్(SARNATH), వారణాసి(VARANASI) లాంటి ప్రాంతాలను సందర్శించోచ్చు. డిసెంబర్ 18న ఈ టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఆదివారం తేదీల్లో ఈ టూర్ ఉంటుంది. 5 రాత్రులు, 6 రోజుల టూర్ ప్యాకేజీ ఇది.

ట్రెండింగ్ వార్తలు

WhatsApp Triple Talaq : వాట్సాప్ లో భార్యకు ట్రిపుల్ తలాక్, ఆదిలాబాద్ లో వ్యక్తి అరెస్టు

TS Cabinet Meeting : తెలంగాణ కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి, కానీ!

TS TET 2024 Exams : రేపట్నుంచే తెలంగాణ టెట్ పరీక్షలు- ఎగ్జామ్ షెడ్యూల్, అభ్యర్థులకు మార్గదర్శకాలివే!

TG ITI Admissions 2024 : టెన్త్ విద్యార్థులకు అలర్ట్... ఐటీఐ ప్రవేశాల నోటిఫికేషన్ విడుదల, ముఖ్య తేదీలివే

Day 1 : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 9.25 గంటలకు బయల్దేరుతారు. రాత్రి మొత్తం జర్నీ ఉంటుంది.

Day 2 : మధ్యాహ్నం 1.30 గంటల వారణాసి(Varanasi) స్టేషన్ కు చేరుకుంటారు. హోటల్ లో చెకిన్ అయిన తర్వాత... సాయంత్రం గంగా హారతి ఉంటుంది. రాత్రికి వారణాసిలోనే బస చేస్తారు.

Day 3 : మూడో రోజు వారణాసిలో కాశీ విశ్వనాథ్ మందిర్, కాల భైరవ మందిర్, బీహెచ్ యూ మందిర్ లను సందర్శిస్తారు. షాపింగ్(Shopping) చేసుకునే సమయం కూడా ఉంటుంది. రాత్రి వారణాసిలోనే ఉంటారు.

Day 4 : హోటల్ నుంచి చెక్ అవుట్ అయిన తర్వాత సార్ నాథ్ వెళ్తారు. అక్కడ నుంచి ప్రయాగ్ రాజ్ కు వెళ్తారు. మార్గమధ్యంలో వింద్యాచల్ ఆలయాన్ని సందర్శించుకోవచ్చు. రాత్రి వరకు ప్రయాగరాజ్ చేరుకుంటారు. అక్కడే బస చేస్తారు.

Day 5 : ఉదయం త్రివేణి సంగమానికి వెళ్తారు. అనంతరం హోటల్ కి వెళ్లి.. మధ్యాహ్నం చెక్ అవుట్ అవుతారు. అనంతరం ఆనంద్ భవన్, కుస్రో బాగ్ కు వెళ్తారు. సాయంత్రం వరకు ప్రయాగ్ రాజ్ రైల్వే జంక్షన్ కు చేరుకుంటారు. అక్కడ నుంచి తిరిగి హైదరాబాద్(Hyderabad) బయల్దేరుతారు. రాత్రి మొత్తం జర్నీ ఉంటుంది.

Day 6 : రాత్రి 09.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటారు. దీంతో టూర్ అయిపోతుంది.

సింగిల్ ఆక్యూపెన్సీకి రూ.28,030 ధరగా ఉంది. డబుల్ ఆక్యూపెన్సీకి రూ. 17,080 ధరగా నిర్ణయించారు. ట్రిపుల్ ఆక్యూపెన్సీకి రూ.13,800 గా ఉంది. 3AC కోచ్ లో ఈ ధరలు ఉంటాయి. టూర్ ప్యాకేజీలో టికెట్లు, హోటల్‌లో వసతి, బ్రేక్‌ఫాస్ట్(Breakfast), లంచ్, డిన్నర్ కవర్ అవుతాయి. మరిన్ని వివరాలకు ఐఆర్‌సీటీసీ(IRCTC) వెబ్ సైట్ వెళ్లి చెక్ చేసుకోవచ్చు.

తదుపరి వ్యాసం