తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Google | గూగుల్‌తో ఒప్పందం.. హైదరాబాద్‌లోనే తొలి గ్రీన్ ట్రాఫిక్ జంక్షన్

Google | గూగుల్‌తో ఒప్పందం.. హైదరాబాద్‌లోనే తొలి గ్రీన్ ట్రాఫిక్ జంక్షన్

HT Telugu Desk HT Telugu

30 May 2022, 6:35 IST

    • భాగ్యనగరంలో కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ట్రాఫిక్ పోలీసులు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు గూగుల్‌తో ఒప్పందం కుదిరింది.
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు హైదరాబాద్ పోలీసులు చొరవ తీసుకున్నారు. దేశంలోనే తొలి గ్రీన్ ట్రాఫిక్ జంక్షన్ హైదరాబాద్‌లో ఏర్పాటు కానుంది. 150 ట్రాఫిక్ క్రాసింగ్‌లను పర్యావరణహితంగా తీర్చిదిద్దేందుకు గూగుల్‌తో ఒప్పందం కుదిరింది. జంక్షన్ సిగ్నలింగ్ సిస్టమ్‌లో మార్పులు, మెరుగుదల కార్బన్ డయాక్సైడ్ , కార్బన్ మోనాక్సైడ్ వంటి ఆటోమొబైల్స్ ద్వారా ఉత్పన్నమయ్యే టాక్సిన్‌లను తగ్గిస్తాయి.

ట్రెండింగ్ వార్తలు

CM Revanth Reddy : తెలంగాణలో భూముల మార్కెట్ విలువ సవరణ…! కీలక ఆదేశాలు జారీ

TS LAWCET 2024 Updates : టీఎస్ లాసెట్ కు భారీగా దరఖాస్తులు - ఈ సారి 3 సెష‌న్ల‌లో ఎగ్జామ్, ఫైన్ తో అప్లికేషన్లకు ఛాన్స్

TSRTC Jeevan Reddy Mall : అద్దె ఒప్పందం రద్దు , జీవన్ రెడ్డి మాల్ స్వాధీనం - టీఎస్ఆర్టీసీ ప్రకటన

Telangana Rains : కరీంనగర్ జిల్లాలో గాలివాన బీభత్సం - పిడుగుపాటుతో ఇద్దరు మృతి

గ్రీన్ ట్రాఫిక్ జంక్షన్ ప్రస్తుతం బ్రెజిల్‌లోని రియో ​​డి జనీరో, ఇజ్రాయెల్‌లోని హైఫాలో Googleతో రూపకల్పన చేస్తున్నారు. ఈ డేటా ఆధారంగా సిగ్నలింగ్ వ్యవస్థను మెరుగుపరిచినట్లయితే, జంక్షన్లలో వాహనదారులు వేచి ఉండే సమయం తగ్గుతుంది. వారంలో, ఇజ్రాయెల్ నగరమైన హైఫాలోని గ్రీన్ ట్రాఫిక్ జంక్షన్ వద్ద ట్రాఫిక్ అడ్డంకులు 2% తగ్గాయి. దేశంలోనే తొలి గ్రీన్ ట్రాఫిక్ జంక్షన్‌ను ప్రారంభించేందుకు గూగుల్‌తో ఒప్పందం కుదిరిందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.

హారన్ కొడితే అంతే

పెద్ద పెద్ద నగరాల్లో.. ట్రాఫిక్ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. దీనికోతోడు కొంతమంది విచిత్రమైన హారన్ లను తమ వాహనాలకు ఫిక్స్ చేయించుకుంటారు. తమ హారన్ సౌండ్ అందరూ వినాలనుకుని.. ఇష్టం వచ్చినట్టుగా మోగిస్తారు. ఇక ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఆగినప్పుడైతే..నరకమే. వెనకాల నుంచి హారన్ మోతలు మోగుతూనే ఉంటాయి. ముందున్న వారికి విసుగు వచ్చేస్తుంది. సిగ్నల్ రెడ్ పడినా... సరే.. ఇష్టం వచ్చినట్టుగా కొడుతూనే ఉంటారు. వాహనాలతో వాయు కాలుష్యమే కాకుండా.. శబ్ధ కాలుష్టం కూడా అవుతోంది. ఇలాంటి వారికి చెక్ పెట్టేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు.. సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. జూన్‌ 1 నుంచి నిషేధిత హారన్లు మోగించే డ్రైవర్, ఆ వాహన యజమానిపై ట్రాఫిక్‌ పోలీసులు చార్జిషీట్‌ దాఖలు చేస్తారు.

ఎయిర్, ప్రెషర్, మల్టీటోన్డ్‌ వంటి నిషేధిత హారన్‌ వినియోగిస్తూ ధ్వని కాలుష్యానికి పాల్పడైవారిపై చర్యలు తీసుకుంటారు. గతంలో హైకోర్టు సైతం.. నిషేధిత హారన్స్ వినియోగించేవారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఏప్రిల్ నుంచి.. దీనిపై.. పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. ఇప్పటివరకు 3,320కిపైగా వాహనాలకు నిషేధిత హారన్లను తొలగించారు.

అలాంటి వాహనదారులకు మోటర్ వెహికల్స్ యాక్ట్‌ 190 (2) సెక్షన్‌ ప్రకారం రూ.1,000 జరిమానా వేశారు. కేంద్ర మోటారు వాహనాల చట్టం (సీఎంవీఆర్‌)–1988 సెక్షన్‌ 52 ప్రకారం తయారీదారుల నుంచి వచ్చిన వాహన హారన్‌లో ఎలాంటి మార్పులు చేయోద్దు. వాహనాలకు ఎలక్ట్రిక్‌ హారన్‌ మాత్రమే ఉండాలి.

టాపిక్

తదుపరి వ్యాసం