తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Indian History Congress: కేయూలో రేపటి నుంచి ఇండియన్​ హిస్టరీ కాంగ్రెస్​

Indian History Congress: కేయూలో రేపటి నుంచి ఇండియన్​ హిస్టరీ కాంగ్రెస్​

HT Telugu Desk HT Telugu

27 December 2023, 9:02 IST

    • Indian History Congress: ప్రతిష్టాత్మక ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్ కు కాకతీయ యూనివర్సిటీ వేదికగా నిలిచింది. దేశంలోని ఎంతో మంది చరిత్రకారులు, పరిశోధకులు తరలిరానున్న ఈ మెగా సదస్సును రేపటి నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్నారు.
ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్‌కు కేయూ ఆతిథ్యం
ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్‌కు కేయూ ఆతిథ్యం

ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్‌కు కేయూ ఆతిథ్యం

Indian History Congress: ప్రతిష్టాత్మక ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్‌కు కాకతీయ యూనివర్శిటీ ఆతిథ్యం ఇవ్వనుంది. డిసెంబర్ 28, 29, 30 తేదీల్లో సాగనున్న ఈ 82వ ఇండియన్​ హిస్టరీ కాంగ్రెస్​ కు ఇప్పటికే కేయూను ముస్తాబు చేశారు. ఈ మేరకు వర్సిటీ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సదస్సుకు రాష్ట్ర మంత్రులతో పాటు వివిధ యూనివర్సిటీలకు చెందిన ప్రొఫెసర్లు ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించనున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Warangal Murder: ఆస్తి కోసం వృద్ధుడి దారుణ హత్య! కొడుకులతో కలిసి మామను చంపిన కోడలు, వరంగల్‌లో ఘోరం

BC RJC CET Results 2024 : టీఎస్ బీసీ గురుకుల ఇంటర్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, రేపట్నుంచి కాలేజీల్లో రిపోర్ట్!

Bhongir Fire Accident : పెట్రోల్ బంక్ లో పేలిన లారీ డీజిల్ ట్యాంక్, తప్పిన పెను ప్రమాదం!

Sircilla Crime : పేగు బంధాన్ని తెంచుకున్న పేరెంట్స్, కూతురికి ఉరి వేసి హత్య!

30 ఏళ్ల తరువాత కేయూలో హిస్టరీ కళ

ఇండియన్​ హిస్టరీ కాంగ్రెస్​ అనేది శాస్త్రీయంగా, చరిత్రను కాపాడేందుకు తోడ్పడే ప్రత్యేక వ్యవస్థ కాగా.. ఇందులో దేశవ్యాప్తంగా దాదాపు 35 వేల మంది చరిత్రకారులు, పరిశోధకులు సభ్యులుగా ఉన్నారు. 1935లో ఇండియన్​ హిస్టరీ కాంగ్రెస్​ ఏర్పడగా.. ప్రతి సంవత్సరం దేశంలోని ఒక్కోచోట ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. చివరిసారిగా 1993లో తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్​ జయశంకర్​ వైస్​ ఛాన్సలర్​ గా ఉన్న సమయంలో ఈ చరిత్రాత్మక సదస్సుకు కాకతీయ యూనివర్సిటీ వేదికగా నిలవగా.. దాదాపు 30 ఏళ్ల తరువాత మరోసారి ఓరుగల్లు గడ్డకు అవకాశం దక్కింది. దీంతో వీసీ ప్రొఫెసర్​ తాటికొండ రమేశ్, రిజిస్ట్రార్​ శ్రీనివాసరావు, ఇతర అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

తరలిరానున్న 2 వేల మంది చరిత్రకారులు

ఇండియన్ హిస్టరీ కాంగ్రెస్​ కు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 2 వేల మంది వరకు చరిత్రకారులు హాజరయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా మూడు రోజుల పాటు సాగే ఈ సదస్సులో 6 సెక్షన్లలో పలువురు పరిశోధకులు సుమారు 1,030 వరకు పరిశోధన పత్రాలు సమర్పించనున్నారు.

ప్రొఫెసర్లు కృష్ణమోహన్​ శ్రీమాలి, కుందన్​ లాల్​ తుతేజా ప్రత్యేక ప్రసంగాలు ఉంటాయని కేయూ అధికారులు తెలిపారు. ఇందులో కృష్ణమోహన్​ శ్రీమాలి సనాతన ధర్మంపై కీలక ప్రసంగం చేయనున్నారు. జేఎన్​ యూ ప్రొఫెసర్​ మహాలక్ష్మి, ప్రొఫెసర్​ సుబ్బరాయలు, ప్రొఫెసర్​ అరుణ్​ బందోపాధ్యాయ, తదితరులు భారతీయ చరిత్రపై ముఖ్య ప్రసంగాలు ఇస్తారు.

హాజరుకానున్న డిప్యూటీ సీఎం, మంత్రులు

గురు, శుక్ర, శనివారాల్లో నిర్వహించనున్న 82వ ఇండియన్​ హిస్టరీ కాంగ్రెస్​ కు కేయూ క్యాంపస్ లో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఏ ఈవెంట్​ కు ఇబ్బందులు కలగకుండా తగిన జాగ్రత్తలు చేపట్టారు. కాగా ఈ హిస్టారికల్​ ఈవెంట్​కు రాష్ట్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఆయన వెంట ఉమ్మడి వరంగల్ కు చెందిన రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీరాజ్​, గ్రామీణాభివృద్ధి, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క పాల్గొననున్నారు. ఈ మేరకు కాకతీయ యూనివర్సిటీ అధికారులు మంత్రులను ఆహ్వానించి, అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు పూర్తి చేశారు.

కీలక ఘట్టాలకు వేదిక

ఈ ఇండియన్​ హిస్టరీ కాంగ్రెస్​ పలు కీలక ఘట్టాలకు వేదిక కానుంది. జవహర్​ లాల్​ నెహ్రూ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్​ ఆదిత్య ముఖర్జీ ఇండియన్​ హిస్టరీ కాంగ్రెస్​ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఐదేళ్లకోసారి అందించే జీవన సాఫల్య పురస్కారాన్ని ప్రొఫెసర్​ రామచంద్ర గుహకు అందించనున్నారు.

రెండేళ్లకోసారి ఉత్తమ పుస్తకానికి అందించే పురస్కారాన్ని కృష్ణమోహన్​ శ్రీమాలి అందుకోనున్నారు. ఈ రెండు పురస్కారాలు పొందిన వీరిద్దరికి రూ.50 వేల నగదు బహుమతి కూడా ఉంటుంది. వీటితోపాటు మరో 11 మంది యువ పరిశోధకులకు కూడా ప్రశంసా పత్రాలు, బహుమతులు అందించనున్నారు.

(హిందుస్తాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

తదుపరి వ్యాసం