తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ts Winter Climate: తెలంగాణలో పెరుగుతున్న చలి తీవ్రత..

Ts Winter Climate: తెలంగాణలో పెరుగుతున్న చలి తీవ్రత..

HT Telugu Desk HT Telugu

14 December 2023, 9:48 IST

    • Ts Winter Climate: తెలంగాణ లో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతూ వస్తుంది.బుధవారం రోజు ఈ చలి మరింత పెరిగింది.మరోవైపు రాబోయే మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిచింది.
తెలంగాణలో పెరుగుతున్న చలి తీవ్రత
తెలంగాణలో పెరుగుతున్న చలి తీవ్రత

తెలంగాణలో పెరుగుతున్న చలి తీవ్రత

Ts Winter Climate: తెలంగాణ వ్యాప్తంగా రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గుతున్నాయి. డిసెంబర్ 17 తరువాత ఈ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.రానున్న మూడు రోజుల్లో చలికి తోడు చలి గాలులు కూడా విస్తాయని అధికారులు చెబుతున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో రైలు పని వేళల్లో మార్పులు, అధికారుల క్లారిటీ!

Love Fraud : : కి'లేడి' ప్రేమపేరుతో మోసం-ప్రియుడు ఆత్మహత్యాయత్నం

Mallareddy Land Issue : సుచిత్రలో భూవివాదం- అల్లుడు, అనుచరులతో కలిసి మల్లారెడ్డి హల్ చల్-ఆపై అరెస్ట్!

Khammam Crime News : ఖమ్మం జిల్లాలో దారుణం.. ఆస్తి కోసం తల్లితో పాటు ఇద్దరు కుమార్తెల హత్య

మరో మూడు రోజుల పాటు ఇదే పరిస్థితి....

మరో మూడు రోజుల పాటు పగటి పూట కంటే రాత్రి సమయంలో ఉష్ణోగ్రతలు పడిపోతాయని.....సాధారణం కంటే డిగ్రీ కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే ఛాన్స్ ఉందని అధికారులు అంటున్నారు.ఇక హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 12 నుంచి 13 డిగ్రీల మధ్య నమోదు అవుతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

రాజేంద్ర నగర్ లో అత్యల్ఫా ఉష్ణోగ్రతలు....

రాజేంద్రనగర్ లో 12.5,మెదక్ లో 12.8 డిగ్రీల అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు వాతావరణ అధికారులు వెల్లడించారు.ఇక రాష్ట్ర వ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు 28-31 డిగ్రీలు గా నమోదు అవుతున్నాయి. రాత్రి పూట ఉష్ణోగ్రతలు అమాంతంగా పడిపోతున్నాయి.

పటాన్ చెరువు లో 13.2,అదిలాబాద్ లో 13.7,హకిం పెట్ లో 14.5,హనుమకొండ లో 15, దుందిగాల్ లో 15.7,రామగుండం లో 14.6,నిజామాబాద్ లో 16.1,హైదరాబాద్ లో 16.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయినట్లు అధికారులు వెల్లడించారు.ఇక ఖమ్మలో 17,మహబూబ్ నగర్ లో 18.5,భద్రాచలంలో 18 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు రికార్డ్ అయినట్లు వాతావరణ శాఖ వివరించింది.

(రిపోర్టింగ్ కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్)

తదుపరి వ్యాసం