తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Real Estate : హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ హాట్ స్పాట్స్, ఇల్లు కొనుగోలుకు అనుకూల ప్రాంతాలివే!

Hyderabad Real Estate : హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ హాట్ స్పాట్స్, ఇల్లు కొనుగోలుకు అనుకూల ప్రాంతాలివే!

03 September 2023, 19:27 IST

    • Hyderabad Real Estate : హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం వృద్ధిని సాధిస్తోంది. రోజురోజుకూ విస్తరిస్తోన్న నగరం రియల్ ఎస్టేట్ మార్కెట్ లో దూసుకుపోతుంది.
హైదరాబాద్ రియల్ ఎస్టేట్
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ (Image Source : Hyderabad Real Estate Twitter)

హైదరాబాద్ రియల్ ఎస్టేట్

Hyderabad Real Estate : దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో హైదరాబాద్ ఒకటి. భాగ్యనగరం తన పరిధిని విస్తరించుకుంటూ రియల్ ఎస్టేట్ మార్కెట్‌ను వృద్ధి చేసుకుంటుంది. అంతేకాకుండా నగరానికి అంతర్జాతీయ పెట్టుబడులు, కొత్త వ్యాపారాలు రావడం, వాటి కార్యాలయాలను స్థాపించడంతో భౌగోళికంగా కూడా విస్తరిస్తోంది. హైదరాబాద్ పశ్చిమ, తూర్పు వైపు ప్రాంతాలు అభివృద్ధిలో దూసుకెళ్తున్నాయి. పశ్చిమం వైపు ఉన్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, నానక్‌రామ్‌గూడ, నార్సింగి, కోకాపేట్ వంటి ప్రాంతాలు నివాస, వాణిజ్య, వ్యాపార అభివృద్ధికి డఅనుకూలంగా ఉన్నాయి. తెలంగాణ ప్రభుత్వం కోకాపేట్‌లోని భూములను హైరైజ్ రియల్ ఎస్టేట్ కోసం వేలం వేసింది. నగరంలోని తూర్పు ప్రాంతాల్లో ఐటీ పరిశ్రమ విస్తరించింది. ఎల్‌బీ నగర్‌, ఉప్పల్‌, రామాంతపూర్‌ కూడా శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. హైదరాబాద్ దక్షిణ భాగంలో ఫార్మా సిటీ, ఏరోస్పేస్ పరిశ్రమలు, అనేక అంతర్జాతీయ కంపెనీలకు స్థావరంగా మారింది. హైదరాబాద్ నగరం నలువైపులా విస్తరిస్తూ మరింత అభివృద్ధి చెందుతుంది. నగరం ఉత్తర ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరిన్ని కంపెనీలను ఆకర్షించడానికి, నగరంలోని అన్ని ప్రాంతాలలో అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుంది.

ట్రెండింగ్ వార్తలు

Road Accidents : తెలుగు రాష్ట్రాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు- ఆరుగురు మృతి, 14 మందికి గాయాలు

Mutton Bone Stuck : పెళ్లి విందులో మటన్ బోన్ మింగేసిన వృద్ధుడు, శస్త్ర చికిత్స చేసి తొలగించిన వైద్యులు

Farmers Protest : అకాల వర్షాలకు తడిసి ముద్దైన వడ్లు, పలు జిల్లాల్లో రోడ్డెక్కిన రైతన్నలు

UK Election Telugu Man Contest : బ్రిటన్ ఎన్నికల బరిలో తెలుగు బిడ్డ, లేబర్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఉదయ్ నాగరాజు

పెట్టుబడులకు గమ్యస్థానం

హైదరాబాద్ లో స్థిరమైన రాజకీయ వాతావరణాన్ని కలిగి ఉంది. ఇది పెట్టుబడులు, కంపెనీలను ఆకర్షించడంలో కీలకంగా మారింది. రియల్ ఎస్టేట్ రంగం వృద్ధితో కొనుగోలుదారులు, పెట్టుబడిదారులకు హైదరాబాద్ ప్రముఖ గమ్యస్థానంగా మారింది. అనుకూలమైన వాతావరణం... వ్యాపారం, ఐటీ, ఔషధ పరిశ్రమలకు కేంద్రంగా మారింది. దీంతో అనేక అంతర్జాతీయ సంస్థలు, స్టార్టప్‌లు నగరంలో ప్రధాన కార్యాలయాలను స్థాపిస్తున్నాయి. హైదరాబాద్... భారత్ జీడీపీ వృద్ధికి భారీగా దోహదపడుతోంది.

ఇల్లు కొనుగోలుకు అనుకూల ప్రాంతాలు

గచ్చిబౌలి, కోకాపేట్, కొండాపూర్, మణికొండ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఎల్‌బీ నగర్, ఉప్పల్, శంషాబాద్ వంటి ప్రాంతాలు భారీ మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చెందాయి. ఇవి రియల్ ఎస్టేట్ మార్కెట్‌పై సానుకూల ప్రభావం చూపుతున్నాయి. ప్రయాణాన్ని సులభతరం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తుంది. ఫ్లై ఓవర్‌లు, అండర్‌పాస్‌లు, ఔటర్ రింగ్ రోడ్డు వంటి గ్రిడ్ రోడ్డులు, ఎస్ఆర్డీపీ వంటి ప్రాజెక్టుల కారణంగా ప్రజలు హైదరాబాద్ లో నివాసాలు కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణతో రియల్ ఎస్టేట్ రంగం మరింత వృద్ధి సాధిస్తుందని నిపుణులు అంటున్నారు.

తదుపరి వ్యాసం