తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hyderabad Police : దీపావళి రోజు ఆ 2 గంటలు మాత్రమే క్రాకర్స్ కాల్చాలి - పోలీసుల ఆంక్షలు ఇవే

Hyderabad Police : దీపావళి రోజు ఆ 2 గంటలు మాత్రమే క్రాకర్స్ కాల్చాలి - పోలీసుల ఆంక్షలు ఇవే

HT Telugu Desk HT Telugu

10 November 2023, 22:01 IST

    • Hyderabad police On Diwali Crackers : దీపావళి సందర్భంగా బాణసంచా కాల్చడంపై హైదరాబాద్ పోలీసులు పలు ఆంక్షలు విధించారు. ఈ మేరకు మార్గదర్శకాలను జారీ చేశారు. 
దీపావళి టపాసులపై ఆంక్షలు
దీపావళి టపాసులపై ఆంక్షలు

దీపావళి టపాసులపై ఆంక్షలు

Hyderabad police On Diwali Crackers : దీపావళి సందర్భంగా పటాకులు పేల్చడం పై హైదరాబాద్ సీపీ సందీప్ శాండిల్య నగర ప్రజలకు కీలక మార్గదర్శకాలు జారీ చేశారు.పర్యావరణ అనుకూలమైన,సురక్షితమైన దీపావళిని ప్రజలు జరుపుకోవాలని అయన సూచించారు.అందుకు ప్రభుత్వం సూచించిన నియమాలను ప్రజలు తప్పకుండా పాటించాలన్నారు.

ట్రెండింగ్ వార్తలు

20 May 2024 హైదరాబాద్ వాతావరణం ఎలా ఉంటుంది? పూర్తి సమాచారం తెలుసుకోండి

Karimnagar Politics: కరీంనగర్‌ల ఫ్లెక్సీల కలకలం, పార్టీ ఫిరాయింపు దారులకు వార్నింగ్‌లతో కూడిన ఫ్లెక్సీలు

Warangal Murder: ఆస్తి కోసం వృద్ధుడి దారుణ హత్య! కొడుకులతో కలిసి మామను చంపిన కోడలు, వరంగల్‌లో ఘోరం

BC RJC CET Results 2024 : టీఎస్ బీసీ గురుకుల ఇంటర్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల, రేపట్నుంచి కాలేజీల్లో రిపోర్ట్!

రెండు గంటలు మాత్రమే:

హైదరాబాద్, సికింద్రబాద్ జంట నగరాల్లో దీపావళి రోజు రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే పటాకులు కాల్చుకోవాలని సీపీ తెలిపారు.బహిరంగ ప్రదేశాల్లో రాత్రి 8 నుంచి 10 గంటల తరువాత పటాకులు పెల్చ వద్దానారు.ప్రజారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు ఎవ్వరూ మామూలు క్రాకర్స్ కాల్చవద్దని బదులుగా గ్రీన్ క్రాకెర్స్ కల్చుకోవచ్చని అయన సూచించారు.

ఈనెల 12 నుంచి 15 వరకు ఈ ఆదేశాలు అమలు లో ఉంటాయని అయన వెల్లడించారు.ఎవరైనా ఆదేశాలను అతిక్రమిస్తే హైదరాబాద్ పోలీసు చట్టం 1348/11 ప్రకారం కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ సీపీ సందీప్ శండిల్యా హెచ్చరించారు.

కాలుష్యం చేసే బాణసంచా కాల్చొద్దు : సుప్రీంకోర్టు

ఇదిలా ఉండగా సుప్రీం కోర్టు దీపావళి సందర్బంగా పటాకులు పేల్చడం పై కీలక ఆదేశాలు ఇచ్చింది.దేశంలో అన్ని రకాల బాణసంచా పై నిషేధం విధించలేదని స్పష్టం చేసింది.బేరియం సాల్ట్ ఉపయోగించిన క్రాక్కర్స్ పై మాత్రమే నిషేధం విధించినట్లు వెల్లడించింది.పర్యావరణాన్ని కాలుష్యం చేసే బాణసంచా విక్రయాలను నిషేధించినట్ల తెలిపింది.కాగా రాష్ట్రాలు,ఏజెన్సీలు,కేంద్ర పాలిత ప్రాంతాలు సహా అందరూ తమ ఆదేశాలను తూచా తప్పకుండా పాటించాలని స్పష్టం చేసింది.అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

రిపోర్టింగ్ : కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా

తదుపరి వ్యాసం